మెదక్

ఏడుపాయల జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, మార్చి 1: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడుపాయల జాతరలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి తక్షణమే పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఏడుపాయల్లో జరుగుతున్న జాతర పనులను కలెక్టర్ ధర్మారెడ్డి, జేసీ నగేష్‌లు పరిశీలించారు. ఈ నెల 4 నుండి ఏడుపాయల్లో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్న దృష్ట్యా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని దేవాదాయ, వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జాతరలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, చేపట్టాల్సిన పనులపై ఈపాటికే రెండు దఫాలుగా సమావేశాలు నిర్వహించామని, నిర్ణయించిన పనులను ఆలస్యంగా చేయడం పట్ల అధికారుల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం లోగా అయా శాఖలకు అప్పటించిన పనులు పూర్తికాకపోతే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ హెచ్చరించారు. స్నాన ఘట్టాలు, శవర్‌బాత్, సాంస్కృతిక కార్యక్రమాల స్టేజీ, చెక్‌డ్యామ్‌లోని నీటిని, ఘణపురం డ్యామ్, రోడ్డు పనులను కాలినడకన తిరుగుతూ కలెక్టర్, జేసీలు పర్యవేక్షించారు. ఏడుపాయల జాతరకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నందున వివిధ శాఖల అధికారులు, దేవస్థాన అధికారులు, పోలీసులు సమిష్టి కృషితో ఏడుపాయల జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు త్రాగునీరు, వౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
* వనదుర్గమాతను దర్శించుకున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్
ఏడుపాయల వనదుర్గామాతను శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ నగేష్‌లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయలకు వచ్చిన కలెక్టర్, జేసీలకు ఆలయ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, ఈఓ మోహన్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దుర్గామాత ఆలయానికి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జేసీ నగేష్‌లు చేరుకొని వనదుర్గామాత అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి అనుగ్రహాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి కలెక్టర్, జేసీలను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ ఏసయ్య, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మల్కాపూర్ స్పూర్తితో..
గ్రామాలను తీర్చిదిద్దండి
- ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు
తూప్రాన్, మార్చి 1: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు మల్కాపూర్ స్పూర్తి తో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చిన సందర్బంగా మల్కాపూర్ సందర్శించి ఆయన మాట్లాడారు. యువత, గ్రామస్తులు ఏకమై మొదటి దశలో వ్యక్తిగత, పరిసరాల పరిశుబ్రతతో ప్రారంభించారన్నారు. దీంతో వ్యాదిరహిత గ్రామంగా మారిందని, ఇంకుడుగుంతలు నిర్మించడంతో భూగర్బజలాలు పెరిగాయని చెప్పారు. గ్రామంలో ఎక్కడా చెత్తా, చెదారం కనిపించదని, తడిపొడిచెత్తను వేరుగా చేసి పంచాయతీ సిబ్బందికి అందజేస్తారని తెలిపారు. అలా సేకరించిన చెత్తను డంప్‌యార్డులో వేసి ఎరువుగా తయారుచేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో 100 మంది రైతులకు డ్రిప్ మంజూరైందని దీంతో విద్యుత్, నీటి ఆదా చేయడంతో పాటు సేంద్రీయ ఎరువులతో కూరగాయల పంటలు పండిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే జంట నగరాలకు మల్కాపూర్ సమీపంలో ఉండడంతో హైదరాబాద్‌కు చెందిన సంస్థలు కొనుగోలు కోసం వస్తున్నట్లు చెప్పారు. అలాగే నాటిన మొక్కలను సంరక్షిస్తుండగా, ఎక్కడా ఎండిపోయినట్లు కనిపించవన్నారు. ప్రతి గృహం వద్ద పచ్చటి వాతావరణం కనిపిస్తుండగా, ప్రశాంతమైన వాతావరణంలో గ్రామం కనిపిస్తుందన్నారు. ఎన్నికైన సర్పంచ్‌లు మీ గ్రామాలలో ప్రజలతో సమావేశం నిర్వహించి అభివృద్ది ప్రణాళిక రూపొందించుకునే క్రమంలో కమిటీలు వేసుకోవాలని కోరారు. ఇందుకోసం పంచాయతీ సెకరెట్రీలు, రెవెన్యూ కార్యదర్శిల సహకారం తీసుకోవాలని వివరించారు. కార్యక్రమం లో ఈఓపీఆర్డీ రాఘవరావు, సర్పంచ్ మహాదేవిలు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిలో ప్రైవేటు ప్లాట్లు
* చోద్యం చూస్తున్న రెవెన్యూ శాఖ
రామాయంపేట, మార్చి 1: ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ప్రైవేటు వ్యక్తులు వాటిని ప్లాట్లుగా మార్చి అమాయకులకు అంటకడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా రామాయంపేటలో రియల్ దందా జోరుగా సాగుతుంది. హైవేకు అనుకొని ఎకరా కోటి పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. ఇదే అదునుగా బావించిన కొందరు రియల్ ఎస్టెట్ వ్యాపారం ద్వారా వెంచర్లు ఏర్పాటు చేసి ప్రైవేటు భూములతో పాటు చుట్టుపక్కల గల ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తూ అక్రమంగా లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే రామాయంపేట-మెదక్ రహదారికి ఆనుకొని సప్తగిరి వెంచర్ పేరుతో 30నుండి 40 ఎకరాల్లో ప్లాట్ల కోసం చదును చేశారు. 1544 సర్వే నంబర్‌లో 0.39గుంటల ఖరీదు ఖాతా ప్రభుత్వ భూమిలోను ప్లాట్లు వెలిశాయి. 1541 ప్రభుత్వ సర్వే నంబర్‌లో ఎకరా తొమ్మిది గుంటల భూమిని కూడా వెంచర్ నిర్వాహకులు అధికారుల అండదండలతో ప్లాట్లుగా మార్చి విక్రయాలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో ఇట్టి వెంచర్‌పై స్థానికులు పిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేశారు. అది కొంత కాలానికి కనిపించకుండా పోయింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకుండి పోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఏది ఏమైనా కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
* విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం..
-సప్తగిరి వెంచర్‌లో ప్లాట్లు కొనవద్దు..తహశీల్దార్
సప్తగిరి వెంచర్ నిర్వాహకులు ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని నూతనంగా వచ్చిన తహశీల్దార్ శేఖర్‌రెడ్డి అన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సప్తగిరి వెంచర్‌లో ప్రభుత్వ భూములు ఉన్నందున అందులో ఎవరూ ప్లాట్లు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని తహశీల్దార్ సూచించారు.
ఓటుహక్కు నమోదుకు నేడు, రేపు అవకాశం
- సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ పిలుపు
సిద్దిపేట టౌన్, మార్చి 1: సాదారణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఓటరు హక్కును నమోదుకు మరో అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఈ ఓటర్ల నమోదు జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మార్చి 2,3వ తేదిల్లో కొత్త ఓటర్ల నమోదు చేయడంతో పాటు సవరణలకు అవకాశం కల్పించి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతంలోనే ఓటరు గుర్తింపుకార్డు ఉంది కదా అని ఊరుకోవద్దని, ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఓటర్లపై ఉందన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డు లేకపోయినా జాబితాలో పేరుంటే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చినవారు, ఓటరు నమోదు సమయంలో వేరొక చోట ఉన్నవారు ఈ రెండు రోజులు నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18ఏండ్లు నిండిన ప్రతి యువతీ, యువకులకు ఓటరుగా నమోదు చేసుకోనేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటు సేనంత మాత్రాన ఈ సారి ఓటర్ల జాబితాతో ఓటరుగా ఉంటుందని అనుకోవద్దని, గత ఎన్నికల్లో ఓటు వేసినా మరోసారి ఓటరు జాబితా లో మీ ఓటు నమోదు ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఒకవేళ ఓటరు జాబితాలో లేకపోతే సవరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే గ్రామాల్లో ఓటు నమోదుకు దూరంగా ఉన్న వారిని గుర్తించి వారి దగ్గరకు వెళ్లి అవగాహన కల్పించాలని బీఎల్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు.

స్ట్రక్చర్ వాల్యు కోసం రైతులు ముందుకు రావాలి

సిద్దిపేట, ఫిబ్రవరి 1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొమురవెళ్లి మల్లన్న సాగర్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయని, ఆదారం కోల్పోతున్న రైతులను అక్కున చేర్చుకొని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని సిద్దిపేట జాల్ల కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో భూసేకరణపై తొగుట మండలంలోని పలుగ్రామల్లో స్ట్రక్చర్ వాల్యు, ఆటవి, ఉద్యానవన, ఆర్‌అండ్‌బి , ఆర్‌డబ్లుఎస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ కృష్ణ్భాస్కర్, జేసీ పద్మాకర్‌లు సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాట్లాడుతూ తొగుట మండలంలోని పలుగ్రామాల్లో స్ట్రక్చర్ వాల్యు కోసం పలు ప్రతిపాదిత గ్రామాలకు వచ్చే అధికారులకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. మరికొన్ని గ్రామాల్లో పాత స్ట్రక్చర్లకు సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయని, మీ గ్రామానికి వచ్చిన అధికారులకు గ్రామ ప్రజలు సమగ్ర వివరాలు అందించాలన్నారు. సమగ్రంగా వివరాలు అందిస్తేనే స్ట్రక్చర్ వాల్యు చెల్లింపులు చేయవచ్చన్నారు. రైతులంత ఈవిషయాన్ని గమనించి గ్రామానికి వచ్చిన సర్వే అధికారులకు పూర్తిస్థాయిలు సహకరించాలన్నారు. అంతకు ముందు అయా శాఖ అధికారులు స్ట్రక్చర్ స్ట్రక్చర్ వాల్యు సర్వే పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సుదర్శన్, ఉద్యానవన శాఖ డీడీ రామలక్ష్మి, ఆటవిశాఖ, ఆర్‌డబ్లుఎస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.