మెదక్

ఉద్యమాల ఖిల్లా.. మెదక్ జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్/ మెదక్, మార్చి 8: అన్నంపెట్టిన మెతుకుసీమ...ఉద్యమానికి ఊపిరి పోసింది...అన్ని ఉప ఎన్నికల్లో అండగా నిలిచింది...రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అఖండ మెజార్టీతో ఎంపీ స్థానాన్ని గెలిపించి దిల్లీలో కెసిఆర్ చక్రం తిప్పేలా ఊతమివ్వాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్‌రావు అన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లు పోటీకాదు.. కరీంనగర్, వరంగల్ ఎంపీ అభ్యర్థుల మెజార్టీయే మనకు పోటీ అని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ స్థాయి టీఆర్‌ఎస్ సన్నాహక సభ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా హరీష్‌రావు మాట్లాడుతూ స్వయంగా ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కావడం మన అదృష్టం. బాబు నోట్ల కట్టలు కోట్లాదిగా వెదజల్లినా నాడు సిద్దిపేటలో కేసీఆర్‌ను గెలిపించారు. ఉద్యమాల సందర్భంగా అరెస్టై మెదక్ జైలులో మూడు రోజులున్నామన్నారు. ఎప్పుడూ ఏ ఎన్నిక వచ్చినా గులాబీనే గెలిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లో అదే మెజార్టీనివ్వాలని కార్యకర్తలు, నాయకులను కోరారు. అభివృద్దిలో ముందున్నాం, కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాలయ్యాయన్నారు. 2 నెలల్లో రైల్వేలైన్ పూర్తి కానుంది, ఘన్‌పూర్ ఆనకట్ట చివరి కాలువల వరకు ఆధునీకరించుకున్నామన్నారు. నర్సాపూర్‌లో బస్‌డిపో, దుబ్బాకలో డబుల్‌బెడ్‌రూం, రహదారులు, పటాన్‌చెర్వులో ఐటి పార్క్, ఇతర ప్లాంట్‌లు, గజ్వేల్ దేశానికి నమూనాగా అభివృద్ది ఇలా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా సాధించిన అభివృద్ది శూన్యమన్నారు. జూన్, జూలైలో కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. ఎంపి ప్రభాక్‌రెడ్డి తక్కువ మాట్లాడినా ఎక్కువ అభివృద్ది చేసే వ్యక్తని, నర్సాపూర్ హైవే, కేంద్రీయ విద్యాలయం, మెదక్‌లో సింథటిక్ ట్రాక్, గజ్వేల్, మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్‌ల ఏర్పాటులో కీలకపాత్ర వహించారన్నారు. ప్రజలు చాలా స్పష్టంగా టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యమన్న నమ్మకంతో ఉన్నారు, ఎంలు మండినా నెలరోజులు కష్టపడి కెసిఆర్ నాయకత్వంలో దిల్లీని శాసించాలంటే 16 ఎంపి స్థానాలు గెలవాలి, మెదక్ ఎంపి అభ్యర్థికి కనీసం 5 లక్షల మెజార్టీనివ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బిజెపిలతో పోటీలేనేలేదన్నారు. అఖండ మెజార్టీనిచ్చి మెదక్ గౌరవం కాపాడుకుందామన్నారు.
* మహిళలకు శుభాకాంక్షలు
హరీష్‌రావు ప్రసంగానికి ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రాజమణిలతోపాటు తరలివచ్చిన మహిళా ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత అభివృద్ధి చేసుకోవాలి
- మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపాలి, మరింత అభివృద్ది చేసుకోవాలని ఎంపి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్‌లో జరిగిన సన్నాహక సభలో ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డాలు, మీసాలు పెంచినా లాభం లేకుండా పోయిందన్నారు. దేశం ఫెడరల్ ఫ్రంట్ వైపు చూస్తోందన్నారు. మెజార్టీ సాధించాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట అమలు చేస్తున్నారన్నారు. కారు స్పీడును తట్టుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజలు ఇతరులను నమ్మరన్నారు. దేశం మనవైపు చూస్తోంది, అవకాశం జారవిడుచుకోవద్దన్నారు. మెదక్ రైల్వేలైన్, హైవే సాధించుకున్నామన్నారు. ఇంకా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసుకుందామని, దిల్లీని శాసించేలా 16 ఎంపీ స్థానాలు గెలుచుకుని మన సత్తా చాటాలన్నారు.

సన్నాహక సమావేశానికి గులాబీశ్రేణులు
పార్టీ జెండా ఊపి వాహన శ్రేణిని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం
పటన్‌చెరు, మార్చి 8: మెదక్ పట్టణంలో శుక్రవారం జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి పటన్‌చెరు పట్టణం నుండి భారీగా గులాబి శ్రేణులు తరలివెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల పరిధిలోని అనేక గ్రామాల నుండి పట్టణ పరిధిలోని మైద్రి మైదానానికి చేరుకున్నారు. అనంతరము స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి టిఆర్‌ఎస్ జెండా ఊపి వాహన శ్రేణిని ప్రారంభించారు. సుమారు నాలుగు వందల వాహనాలలో నాలుగు వేల మంది నాయకులు, కార్యకర్తలు పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి తరలి వెలుతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 16 పార్లమెంట్ స్థానాలను తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారకరామారావు అధ్యక్షతన తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్ ప్రభంజనం సాక్షాత్కరించడం తప్పదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పటన్‌చెరు ఎంపిపి గొల్ల శ్రీశైలంయాదవ్, రామచంద్రాపురం ఎంపిపి నాలకంటి యాదగిరియాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు బూరుగడ్డ పుష్పనాగేష్‌యాదవ్, రామచంద్రాపురం కార్పొరేటర్ తొంట అంజయ్య, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన కొట్యాల విద్యార్థిని స్వర్ణలత
ములుగు, మార్చి 8: గత నవంబర్ సిద్దిపేటలో జరిగిన ఎన్‌ఎంఎస్ పరీక్షల్లో పాల్గొని జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన కొట్యాల ఉన్నత పాఠశాల విద్యార్థిని జి. స్వర్ణలత 2018-19 విద్యాసంవత్సరానికి గానూ, జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌కు నిర్వహించిన పరీక్షల్లో ములుగు మండలం కొట్యాల గ్రామానికి చెందిన జి. స్వర్ణలత 8వ తరగతి చదువుతోంది. అయితే ఎన్‌ఎంఎస్‌కు జరిగిన పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్కాలర్‌షిప్‌కు ఎన్నికవడం ఎంతో ఆనందించదగ్గ విషయమని ఎంఈఓ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులైనప్పటికీ విద్యలో మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎదగడం తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాద్యాయులకు ఎంతో సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు వారికి మంచి విద్యాబోదన చేసిన ఉపాద్యాయులు మిగితా విద్యార్థులను కూడా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర కొనసాగించాలని ఈ సందర్బంగా ఉపాద్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుడు రాంబాబు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్‌కు తరలివెళ్లిన టీఆర్‌ఎస్ శ్రేణులు
ములుగు, మార్చి 8: మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి ములుగు మండలం నుండి ఏఎంసీ చైర్మెన్ జహంగీర్ ఆద్వర్యంలో తరలివెల్లారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నందున ములుగు మండలం నుండి వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మెన్ జహంగీర్, యువత విభాగం అధ్యక్షులు అంజిరెడ్డి ఆద్వర్యంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెల్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ సలీం, నాయకులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తోడేటి కిష్టయ్య, పొన్యాల బాల్‌రెడ్డి, అర్జున్‌గౌడ్, గణేష్‌గుప్త, కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్లారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను
సమర్థవంతంగా నిర్వహించాలి
- కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్, మార్చి 8: ఈ నెల 22న నిర్వహించబోయే ఉపాధ్యాయ, పట్ట్భద్రుల శాసనమండలి ఎన్నికల సందర్భంగా జిల్లాలో గల ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యకమం కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను సమర్దవంతంగా నిర్వహించాలని గత అసెంబ్లీ ఎన్నికలకు, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయు విధానం వేరేగా ఉంటుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే పద్దతి కనుక ఎక్కువ సమయం తీసుకుంటుందన్నారు. ప్రతి అధికారి తప్పనిసరిగా ఎన్నికల సంఘం సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అలాగే ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొని వస్తేనే ఓటింగ్‌కు అనుమతించాలని సూచించారు. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉంటుందని రెండు ఓట్లను సైతం ఒకే బ్యాలెట్ బాక్సులో వేయించేలా చూడాలన్నారు. పట్ట్భద్రుల ఎమ్మెల్సీకి ఓటేసే వారికి కుడిచేతి చూపుడు వేలుకి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటేసే వారికి కుడిచేతి మధ్యవేలుకు సిరా గుర్తు అంటించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారి రాజిరెడ్డితో పాటు ఆర్డీఓలు శ్యాంప్రకాశ్, అరుణారెడ్డి, రిసోర్స్ పర్సన్ బాలరాజుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సిద్దిపేట, మార్చి 8 : మహిళలు సాధికారత సాధించాలని..మహిళలు చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండ అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక టీటీసీ భవన్‌లో మహిళ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహించారు. మంచి కోసం సమతుల్యం అనే థీమ్‌తో ఉత్సహభరితంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్మీ, ఆర్చరీ, పెయింటింగ్ రంగాల్లో రాణించాలన్నారు. సిద్దిపేట జిల్లాలో భృతహత్యలు నిర్మూలించాలన్నారు. ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 940 అమ్మాయిలే ఉన్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలతో పోలీస్తే అబ్బాయిలు శాతం పెరిగిందన్నారు. అమ్మాయిల శాతం పెంచేందుకు కృషిచేయాలన్నారు. బాలికల పట్ల వివక్ష వద్దని, బాల్య వివాహాల నిర్మూళనకు కృషిచేయాలన్నారు. ఆడపిల్లలు తాము అనుకున్న రంగంలో ముందుకెళ్లాల తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత టెక్నాలజీ పరిస్థితుల దృష్ట్యా, గర్భిణులకు తమకు పుట్టెది పాపన, బాబు అనే ఆలోచనలో మార్పు రావాలన్నారు. బాలికలతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. జిల్లా సంక్షేమాధికారి జరినాభేగం మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 0-18 సంవత్సరాల బాల, బాలికల సంరక్షణ, పరిరక్షణే ధ్యేయమని, దీని కోసం త్వరలో కలెక్టర్ సమక్షంలో సఖీ సెంటర్, బాలరక్షక భవన్‌లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళలు విద్యా, పోషణ, ఆర్థిక రంగాల్లో సమతుల్యత పాటించాలని చెప్పారు. బాలసదనం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆనంతరం కలెక్టర్ కెక్ కట్ చేశారు. జిల్లాలోని 50 మంది అధికారిక మహిళలను శాలువా, మెమోంటోలతో కలెక్టర్ కృష్ణ్భాస్కర్ సన్మానించారు. మహిళ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ నవీన్, ఉపాధి కల్పన అధికారి ప్రశాంతి, టీఎన్జీఓస్ నాయకులు పరమేశ్వర్, విక్రమ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.