మెదక్

రైతుల్లో ధైర్యం నింపేందుకే పాదయాత్ర: తమ్మినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 24: రాష్ట్రంలో పదవుల కోసం పాకులాడే నాయకులున్నారు తప్పా ప్రజా సమస్యలను పట్టించుకునే నాధుడే లేడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. జివో 123 చట్ట విరుద్దమని, నిమ్జ్‌లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న న్యాల్‌కల్ మండలంలో ప్రారంభమైన సిపిఎం పాదయాత్ర మంగళవారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నా, పాదయాత్ర ముగింపు సభకు తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడుతాయనుకున్న రైతాంగాన్ని కెసిఆర్ ప్రభుత్వం పాతాళానికి తొక్కుందని విమర్శించారు. న్యాల్‌కల్ మండలంలోని 14 గ్రామాలు, ఝరాసంగం మండలంలోని 3గ్రామాల్లో 12,635 ఎకరాల భూములను నిమ్జ్ పేరుతో సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, పంటలు సాగు చేస్తున్న భూములను భయబ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం లాక్కొవడం సరైంది కాదన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే భూ సేకరణ చేపట్టాలని, పునారావాసం, న్యాయబద్దమైన నష్టపరిహారం, పారదర్శకత ప్రకారమే భూములు సేకరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎకరాకు రూ.15లక్షలు, రోడ్డు పక్కన భూములకు 20 నుండి 30లక్షల ధర పలుకుతుందని, చట్టంలో పేర్కొన్న విధంగా మార్కెట్ రేట్‌కు 4రేట్లు అదనంగా చెల్లించాలన్నారు. బహుల పంటలు పండే భూములు తీసుకోరాదని, రైతులకు, కౌలుదారులకు, చేతి వృత్తిదారులకు, భూమి పై ఆధారపడి జీవించే వారందరికి నెలకు రూ.2వేల చొప్పున 20యేళ్లు చెల్లించాలని, కుటుంబంలో ఒక్కరికి శాశ్వతంగా ఉద్యోగం, వెయ్యి గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్దంగా 123 జివో తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రైతుల ఆమోదంతోనే భూ సేకరణ చేయాలని, భూ నిర్వాసితులకు సిపిఎం అండగా ఉంటుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ సిపిం పాదయాత్ర నిమ్జ్ భూ నిర్వాసితులైన రైతుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపిందన్నారు. రైతులను మోసం చేసేందుకే ప్రభుత్వం 123 జివోను తీసుకొచ్చిందని, ఈ జివోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆమోదం లేకుండా పోలీసులను ఉపయోగించి భయబ్రాంతులకు గురి చేయడం, భూములు లాక్కోవడం లాంటివి మానుకోవాలని, లేని పక్షంలో కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌లు జిల్లావాసులై ఉండి ఇలా రైతుల జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. రైతాంగ పక్షాణ పోరాడేందుకు సిపిఎం సిద్ధంగా ఉందని, ఇందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం డిఆర్వో దయానంద్‌కు వినతి పత్రాన్ని సమర్పించి న్యాయం చేయాలని కోరారు. ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, కార్యదర్శివర్గ సభ్యులు కె.రాజయ్య, ఎ.మానిక్యం, జి.జయరాజ్, బి.మల్లేశం, జె.మల్లికార్జున్, రాంచందర్, జిల్లా కమిటి సభ్యులు నర్సింలు, మహిపాల్, కాంగ్రెస్, టిడిపి జెడ్పీటిసిలు ప్రభాకర్‌రెడ్డి, అంజయ్య, శ్రీకాంత్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు విలాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి , శ్రీకాంత్‌రెడ్డితో పాటు భూ నిర్వాసితులు పాల్గొన్నారు.