మెదక్

మరో రైతును మింగిన అప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 18: అప్పులబాదతో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కాగా శుక్రవారం తెల్లవారు జామున గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని అనంతరావుపల్లిలో ఓ రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జానబోయిన రాములు(38) తనకున్న 3ఎకరాల వ్యవసాయ పొలంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటను సాగుచేస్తూ వస్తున్నాడు. అయితే కాలం కలసిరాకపోవడం, కుటుంబ పోషణ, తాగునీటి కోసం వేసిన బోర్లతో రూ.5లక్షల వరకు రాములు అప్పులు చేశాడు. అయితే అతివృష్టి, అనావృష్టిల ఫలితంగా సాగుచేసిన పంట ఎండిపోతుండడం, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో అతనిని తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో అందోళనకు గురైన రాములు శుక్రవారం తెల్లవారు జామున పొలం వద్దకు వెల్లివస్తానని భార్య తిరుపతమ్మతో చెప్పి వెళ్లాడు. కాగా బావిదగ్గరకు వెళ్లిన రాములు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో అనంతరావుపల్లిలో తీవ్ర విషాదం నెలకొనగా భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి కుమారుడు, ఓ కూతురు ఉండగా రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.