మెదక్

సోనియా భిక్షతో భోగాలు అనుభవిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 4: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భిక్షతో సిఎం కెసిఆర్ భోగాలు అనుభవిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం గజ్వేల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఎన్నికల సందర్బంగా సిఎం కెసిఆర్ ఎన్నో హామీలు గుప్పించి అధికారం చేపట్టగా, ప్రస్థుతం అరచేతిలో వైకుంఠం చూపుతూ ప్రజలను మభ్య పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఎద్దేవా చేశారు. అయితే దళితుడిని సిఎం చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తానని, అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని, పంటల రుణమాఫీని ఏక కాలంలో రైతులకు వర్తింపజేస్తానని, బంగారు తెలంగాణా సాదిద్దామని చెప్పిన సిఎం కెసిఆర్ తమ కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుకున్నట్లు ఆరోపించారు. ముఖ్యంగా ఎకరాకు కోటి రూపాయల పంట పండించవచ్చని చెప్పిన సిఎం కెసిఆర్ కరువుకాలంలోనైనా రైతులకు ఆ చిట్కా చెప్పి ఆదుకోవాలని సూచించారు. అలాగే హైకోర్టు విబజనలో ఇద్దరు చంద్రులు ప్రజలతో చెలగాటమాడుతుండగా ఇందులో కేంద్రం ప్రమేయం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సునితారెడ్డి మాట్లాడుతు జిల్లాల ఏర్పాటు అంశానికి తెరలేపిన సిఎం కెసిఆర్ ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అవసరమున్న సామర్యంతోనే ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టడంతోపాటూ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా స్వార్ధం కోసమే మల్లన్నసాగర్ నీటి నిల్వను 51 టిఎంసిలకు పెంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ డాక్టర్ శ్రావన్‌కుమార్‌రెడ్డి, ములుగు ఎంపిపి అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, కాంగ్రెస్ నేతలు బండారు శ్రీకాంత్‌రావు, రామరాజుశర్మ, సర్దార్‌ఖాన్, నరేందర్‌రెడ్డి, నర్సింహాచారి, జనార్దన్‌రెడ్డి, బండి నర్సాగౌడ్, బయ్యారం నర్సింలు, శ్రీనివాస్‌గౌడ్, జాఫరుల్లా, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎక్బాల్, వేణుగోపాల్‌రావు, భానుప్రకాశ్‌రావు, గుంటుకు మల్లేషం, సంతోష్‌రెడ్డి, అమరసేనారెడ్డి, సుప్రదాతరావు, మామిడ్యాల శ్రీనివాస్, మదుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కాగా మొదటగా ప్రజ్ఞాపూర్ రహదారి నుండి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఘన స్వాగతం లభించగా, గజ్వేల్ ప్రధాన వీదుల వెంట పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.