మెదక్

ఇబ్రహీంపూర్‌లో గవర్నర్‌కు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 15: మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినం రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు గ్రామస్తుల నుంచి ఘనస్వాగతం లభించింది. గవర్నర్ గ్రామంలో సుమారు 2గం. పాటు ప్రజలతో మమేకమై అభివృద్ధి పనులను పరిశీలించి వారి పై ప్రశంసలు కురిపించారు. ఉదయం 10.40గం.కు హెలీకాప్టర్ ద్వారా ఇబ్రహీంపూర్‌కు చేరుకున్న గవర్నర్‌కు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, ఎంపిలు ప్రభాకర్‌రెడ్డి, బిబిపాటిల్, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, డిపిఓ సురేష్‌బాబుస్వాగతం పలుకగా మంత్రి హరీష్‌రావు మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. భూమిలేని దళితులకు ప్రభుత్వం పంపిణి చేసిన స్థలంలో మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. ప్రత్యేక వాహనంలో దళితులకు ప్రభుత్వం పంపిణి చేసిన భూముల వద్దకు వెళ్లారు. నాగచంద్రయ్య భూమి గట్టు పై గవర్నర్ టేకుమొక్క, మల్లారెడ్డి భూమిలో నీలగిరి మొక్క నాటారు. గవర్నర్ నరసింహన్ మొక్క నాటుతున్న క్రమంలో అధికారులు విజిల్ వేయగా ఉపాధికూలీలు మొక్కలు నాటడాన్ని ఆరంభించారు. ఇప్పాలగడి వద్ద జమ్మిమొక్కను నాటారు. గ్రామంలోని నీటిశుద్ది కేంద్రం బాలవికాస్‌ఫ్లాంట్‌ను పరిశీలించారు. బీరతోటను పరిశీలించి రైతు మహిపాల్‌రెడ్డితో ముచ్చటించారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీని సందర్శించారు. కాలనీలోని 5గురి ఇండ్లకు గవర్నర్, మంత్రి, కలెక్టర్ వారి ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. శౌచాలయాలు ఉన్నాయా, వినియోగిస్తున్నారా, ఇంటి ముందు ఎన్ని మొక్కలు నాటారు, ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారా, ఇంట్లో ఎల్‌ఇడి బల్బులు ఉన్నాయా, రోజూ తాగునీటి సరఫరా అవుతుందా, దోమలు, ఈగలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌ఇడి బల్బుల వల్ల ఏలాంటి లాభం ఉందని ప్రశ్నించగా విద్యుత్ బిల్లు ఆదా ఆవుతుందని సమాధానమిచ్చారు. నల్లాలు పని చేస్తున్నాయా, నీళ్లు వస్తున్నాయా అని గవర్నర్ పరిశీలించారు. ఉపాధిహామి కూలీలతో మాట్లాడుతూ మీకు సక్రమంగా జాబ్‌కార్డులు పరిశీలించారు. కూలీ ఏలా చెల్లిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటే సమయంలో నీళ్లు ఏలా పోస్తారని ప్రశ్నించగా కొందరు వాననీరే ఆధారమని, కొందరు స్వయంగా నీరుపోస్తామని చెప్పారు. మంత్రి హరీష్‌రావు ట్యాంకర్‌ద్వారా నీరు పోయించి మొక్కలు ఎండిపోకుండా చూస్తామని హామినిచ్చారు. గ్రామంలో పారిశుద్ద్యం, చెత్త సేకరణ ఏలా ఉందో తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోకి వెళ్లి విద్యార్థులను సక్రమంగా పుస్తకాలు అందాయా అని తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూఫ్‌ఫోటో దిగారు. పాఠశాల శుభ్రత పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కాలినడకన సభాస్థలికి వచ్చారు.
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
గ్రామ ప్రధాన రోడ్డు నుంచి సభావేదిక వరకు అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదిక మీద జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలంగాణ అర్చక సమాఖ్య పక్షాన కృష్ణమాచారి, నర్సింహాచారి గవర్నర్‌ను సన్మానించారు. అనంతరం గ్రామాభివృద్ధి పనుల పై ఎగ్జిబిషన్‌ను, డాక్యుమెంటరీని గవర్నర్ తిలకించారు. అనంతరం గవర్నర్ మాట్లాడి గ్రామాభివృద్ధి కోసం ప్రజలు చేసిన సమిష్టికృషిని అభినందించారు. గ్రామాన్ని దత్తత తీసుకొని వారికి పూర్తి సహకారం అందించిన మంత్రి హరీష్‌రావుకు, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌ను అభినందించారు. ఇబ్రహీంపూర్ తెలంగాణకే సింబల్ అని వ్యాఖ్యానించగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఇబ్రహీంపూర్ నుంచి వాహనం పై సిద్దిపేటకు బయలుదేరారు. మార్గమధ్యలో లక్ష్మీదేవిపల్లి సబ్‌స్టేషన్ వద్ద గవర్నర్ నరసింహన్ మొక్కలు నాటారు. అలాగే గాడిచెర్లపల్లి వద్ద సబ్సిడి పై వచ్చిన పాలీహౌజ్‌లను గవర్నర్ సందర్శించారు. పాలీహౌజ్‌లో పని చేస్తున్న వారితో వాటితో కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట కోమటి చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. అనంతరం కొండపాక మండలం నాగులబండకు వెళ్లి సర్పంచులతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి ఆర్‌అండ్‌బి గెస్టుహౌజ్‌కు వచ్చి మంత్రి హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సిఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌లతో కలిసి భోజనం చేశారు. ఎంసిహెచ్ ఆస్పత్రిలోని నవజాత శిశుకేంద్రాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో రోగుల చికిత్స పట్ల సంతోషం వ్యక్తం చేశారు.