మెదక్

సిద్దిపేట పురపోరుకు రెండవ రోజు 170 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 22 : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో రెండవ రోజు మంగళవారం 170 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి కెవి. రమణాచారి వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నామినేషన్ల స్వీకరణకు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 34 వార్డులకు 34 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే వెంకటేశ్వరాలయం, ఆర్ అండ్‌బి అతిథి గృహం చౌరస్తా, వీరసావర్కర్ చౌరస్తా వద్ద బారికేడ్లు నిర్మించారు. పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. అభ్యర్థులతో పాటు మరో ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించటంతో నామినేషన్లు ప్రక్రియ సజవుగా సాగిందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ పక్షాన 98, టిడిపి 2, ఎంఐఎం 7, సిపిఎం 3, బిఎస్‌పి 2, బిజెపి 10, రిజిస్టర్ పార్టీ పక్షాన 1 నామినేషన్, స్వతంత్రులు 30 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. 1వ వార్డులో 6, 2లో 5, 3లో 10, 4లో 5, 5లో 6, 6లో 5,7లో 6, 8లో 3, 9లో 5,10లో 8, 11లో 9, 12లో 8, 13లో 4, 14లో 1, 15లో 2, 16లో 4, 17లో 3, 18లో 2,19లో 6, 20లో 8, 21లో 6, 22లో 4,23లో 7,24లో 5,25లో 1, 26లో 4, 27లో 3, 28లో 2, 29లో 6, 30వార్డులో 9, 31లో 4, 32లో 6, 33లో 3, 34లో 4, నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు
19 వార్డుకు అదనపు పోలింగ్ స్టేషన్
పట్టణంలోని 19వ వార్డులో అదనపు పోలీంగ్ స్టేషన్ మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కెవి,రమణాచారి తెలిపారు. గతంలో 1232 ఓటర్లు ఉండగా ఒక పోలీంగ్ స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా 488 ఓటర్లు నమోదు చేసుకోవటంతో అదనంగా మరో పోలింగ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్పైస్ వరల్డ్ హైస్కూల్‌లో రెండు పోలింగ్ స్టేషన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ల చివరి రోజున 11 గంటల నుండి 3 గంటల లోపు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 3 గంటలకు మున్సిపల్ ప్రధాన గేటు మూసివేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ప్రాంగణంలో ఉన్న అభ్యర్థులకు టోకన్లు ఇచ్చి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 24న ఇవిఎంల తనిఖీలు, నామినేషన్ స్కూృటిని, 25న విత్ డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్కూృటిని కార్యక్రమానికి అభ్యర్థులు స్వయంగా హజరుకావాలన్నారు. 25న ఉప సంహరణ ఆనంతరం, బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు. 26న వెబ్ కాస్టింగ్‌పై శిక్షణ, 29న మైక్రో అబ్జర్వర్లు పరిశీలన, 1న ఈవిఎంల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలన్నారు. ఈసమావేశంలో అదనపు ఎన్నికల అధికారి నజీబ్, టిపిఓ రాంరెడ్డి, సిఐ సైదులు, సహయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు