మెదక్

జిల్లా సరిహద్దుల్లో ఐకాస నేత కోదండరాం అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జగదేవ్‌పూర్, జూలై 25 : పోలీసుల లాఠీ చార్జీలో గాయపడి గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వస్తున్న రాజకీయ ఐకాస చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాంను వంటిమామిడి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ పనులు: ఇఎన్‌సి
గజ్వేల్, జూలై 25 : మిషన్ బగీరథ పథకాన్ని ఆగస్ట్ 7న ప్రారంబిస్తున్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినట్లు మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కోమటిబండలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిఅర్‌తోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే అవకాశముందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు రాత్రింబవళ్లు పథకాన్ని పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా మొదటి విడతలో గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజక వర్గాలకు మిషన్ భగీరథ పథకాన్ని వర్తింపజేస్తుండగా, నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో పైప్‌లైన్‌ల నిర్మాణం, ఇళ్లకు నల్లా కనెక్షన్‌లు ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని సూచించామన్నారు. గఢా అధికారి హన్మంతరావు, జిల్లా ఎస్‌ఇ విజయప్రకాశ్, ఇఇ రాజయ్య, డిప్యూటీ ఇఇ కమలాకర్ ఆయన వెంట ఉన్నారు.
జిన్నారంలో బంద్ ప్రశాంతం
జిన్నారం, జులై 25: కాంగ్రెస్ బిజెపి, టిడిపి ఇచ్చిన జిల్లా బంద్ మండలంలోని ప్రశాంతంగా కొనసాగింది. జిన్నారంమండలంలో వ్యాపార కేంద్రాలను ఉదయం నుండే మూసివేయించారు. బొంతపల్లి కమాన్ వద్ద ప్రతిపక్ష పార్టీలు ధర్నా రాస్తారోకోను నిర్వహించారు.