నల్గొండ

ఎబివిపి ధర్నాతో దద్దరిల్లిన గడియారం సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 25: అధిక ఫీజులను ప్రభుత్వ అరికట్టాలని, కెజి టూ పిజి ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఎబివిపి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రం తరగతులను బహిష్కరించి గడియారం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో గడియారం సెంటర్ చౌరస్తాలో బైఠాయించి అధిక ఫీజుల వసూళ్లకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థుల ఆందోళనతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం కెజి టూ పిజి ఉచిత విద్య అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి అందుకు చర్యలు తీసుకోకుండా ప్రైవేటు విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడికి పాల్పడుతున్న ప్రేక్షక పాత్ర వహిస్తుందని దుయ్యబట్టారు. వెంటనే అధిక ఫీజులను నియంత్రించేందుకు తగిన చట్టాలు రూపొందించి అమలు చేయాలని విద్యారంగం వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎబివిపి నాయకులు లింగరాజు, లింగస్వామి, గోపి, దయాకర్, విజయ్‌రెడ్డి, రామకృష్ణ, వెంకటేష్, సాయికుమార్ ధర్నాలో పాల్గొన్నారు.