మెదక్

ప్రాణహిత ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 28: ప్రాణహిత ప్రాజెక్టు పనులన్ని త్వరిగత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. గురువారం రాత్రి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలసి సమన్వయంతో పనిచేయాలన్నారు. పది రోజుల్లో మళ్లీ సమీక్షలు నిర్వహిస్తానన్నారు. అధికారులు పారదర్శకతతో కూడిన నివేదికలు సిద్ధం చేయాలన్నారు. హరితహరంలో కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్క సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు సంరక్షణపై ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.