మెదక్

ఎన్నికల దృష్ట్యానే డబుల్‌బెడ్ రూం ఇళ్ల హడావుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట టౌన్, మార్చి 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి కాలం వెల్లదీయడమే తప్ప ప్రజలకు చేస్తున్నది ఏమిలేదని, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల దృష్ట్యానే డబుల్‌బెడ్ రూం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని టిడిపి జిల్లా అధ్యక్షురాలు శశికళ అన్నారు. మంగళవారం స్థానిక నీలిమా గార్డెన్‌లో టిడిపి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి హజరైన ఆమె మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 34 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి కోర్టు తీర్పు వెలువడిన వెంటనే షెడ్యులు విడుదల చేశారు. ప్రతిపక్ష పార్టీల వారు ఎన్నికల్లో పోటి చేయకుండా చేసే ప్రయత్నంలో భాగంగా తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారు. ఇది అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల లీస్టు ప్రవేశపెట్టకుండానే షెడ్యులు విడుదల చేశారు. ఎన్నికలుల్లో నిల్చునే అభ్యర్థులకు ఓటరు లీస్టు దొరకని పరిస్థితి ఉందన్నారు. పక్కపార్టీ నేతలను కొనుక్కొవడం వంటి చర్యలకు టిఆర్‌ఎస్ పాల్పడుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇంకా అమలు చేయలేదు, ఇంకా స్థానికంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అప్పటికప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించేలోపు డబుల్‌బెడ్ రూంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా అన్నారు. ప్రభుత్వం చేసే పనులు అమలు కాని విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో త్రాగునీటి సమస్య ఉదన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలు తీరడంలేదన్నారు. ఇవన్ని సమస్యలు పెట్టుకొని వాటి పరిష్కరానికి కృషి చేయకుండా ఏవో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలే చేస్తుందని మిండిపడ్డారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు అన్ని వార్డులలో నిల్చుంటున్నారని తెలిపారు.
ప్రజాసమస్యల పరిష్కరానికి కృషి చేసే టిడిపి అభ్యర్థులను గెలిపించి సిద్దిపేట అభివృద్దికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుండు భూపేష్, బాసంగారి వెంకటేశం, దరిపల్లిచంద్రం, శ్రీను, రమేష్, భూపాణి, శివకుమార్, రాజశ్రీ, చింతలబాబు, భరత్ తదితరులు పాల్గొన్నారు.