మెదక్

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికోడ్, మార్చి 28: మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మించనున్న సిసి రోడ్ల అభివృద్ధి పనులకు అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ సోమవారం శంకుస్థాపన చేశారు. పాంపాడ్ గ్రామానికి రూ.5లక్షలు, అల్లాపూర్ రూ.5లక్షలు, ధర్మాపూర్, ఇందూర్, ఔరంగనగర్, హస్నాబాద్ గ్రామాలకు రూ.5లక్షల చొప్పున మంజూరైన సిసి రోడ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిసి రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సిఎం కెసిఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పెద్దపీట వేస్తున్నాఠని గుర్తు చేశారు. ఇటివల గుండెపోటుతో మృతి చెందిన మహభత్‌పూర్ టిఆర్‌ఎస్ నాయకుడు కాశీనాథ్‌పాటేల్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపిపి బస్వరాజ్‌పాటిల్, ఎంపిటిసి విఠల్, నాయకులు ఏసప్ప, శివకుమార్, సుల్తాన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు స్వరూపరాణి వీరన్నపాటిల్, కౌంసమ్మ మాణిక్యం, అలీమోద్దీన్, సమ్మమ్మ పాల్గొన్నారు.

నలుగురు దొంగల అరెస్టు
* 9.5 తులాల బంగారం
రూ.1.25 లక్షలు స్వాధీనం
* డిఎస్పీ తిరుపతన్న
సంగారెడ్డి టౌన్, మార్చి 28: బంగారు ఆభరణాల దుకాణాలకు వెళ్లి మాటల ద్వారా దృష్టి మళించి ఆభరణాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు, లారీలను దొంగిలించి విలువైన టైర్లను అపహరించుకుపోయే మరో ఇద్దరు దొంగలను వేర్వేరుగా అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న తెలిపారు. సోమవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ వివరాలను వెల్లడించారు. అనంతపూర్ జిల్లా కదిరి గ్రామానికి చెందిన సయ్యద్ నదీర్, షేక్ అబ్దుల్‌లు గత 15యేళ్లుగా పలు చోరిలకు పాల్పడ్డట్లు తెలిపారు. వరుసకు బంధువులైన వీరద్దరిలో నదీర్ జహీరాబాద్‌లో, అబ్దుల్ కదిరిలో నివాసం ఉంటారన్నారు. దొంగలించిన బంగారాన్ని సంగారెడ్డిలో విక్రయించేందుకు వచ్చి పట్టుబడ్డట్లు వెల్లడించారు. వీరిద్దరు 2014 అక్టోబర్‌లో సిద్ధిపేటలో పలు దొంగతనాలకు పాల్పడి సుమారు 15 తులాలు, సంగారెడ్డి విద్యనగర్‌లో గల బంగారం షాపులో 5తులాల బంగారాన్ని దొంగిలించుకుపోయారన్నారు. బంగారం షాపుకు వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు యాజమానిని మాటల్లో పెట్టి చాకచక్యంగా చోరిలు చేస్తుంటారన్నారు. వీరిపై బెంగుళూర్ 13, హైదరాబాద్‌లో 10 కేసులు నమోదయ్యాయినట్లు తెలిపారు. వీరి నుండి తొమ్మిదన్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ప్రధాన రాహదారులు, దాబాల వద్ద ఆగి ఉన్న లారీలను దొంగిలించుకుపోయి టైర్లను తొలగించి అమ్ముకునే జహీరాబాద్‌కు చెందిన రషీద్, రాథోడ్ ప్రకాష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 2012లో మునిపల్లి వద్ద ఆగిఉన్న లారీ నుండి 7టైర్లు, 2015లో సంగారెడ్డి చౌరస్తా వద్ద లారీ నుండి 7టైర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం టైర్ల చోరిలకు పాల్పడినట్లు తెలిపారు. వీరి నుండి రూ. ఒక లక్ష 25వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని, ఇందులో మరో వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన వహిద్ కూడా ఉన్నాడని, ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు తెలిపారు. రూరల్ సిఐ శ్యామల వెంకటేశం, టౌన్ సిఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.