మెదక్

వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, అక్టోబర్ 15: నూతనంగా ఏర్పడిన వట్‌పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేసన్‌ను సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం నాడు సందర్శించారు. వట్‌పల్లిలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్తగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో వాటి గురించి తెలుసుకున్నారు. అలాగే పోలీస్‌స్టేషన్‌కు నూతన వాహనంను వారం రోజులలోగా ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. నూతన వట్‌పల్లి మండలం సంగారెడ్డి జిల్లాలో కలిసినందున ఈ పోలీస్‌స్టేషన్‌కు స్వంత భవనం లేకపోవడంతో నిర్మించిన మార్కెట్‌యార్డులోని ఓ భవనంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఎస్పీ వెంట జోగిపేట సిఐ వెంకటయ్య, ఎస్సై గణేష్ తదితరులు ఉన్నారు.