జాతీయ వార్తలు

ఐవిఆర్‌ఎల్‌సి కంపెనీపై హైదరాబాద్‌లో ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కోల్‌కతలో భారీ ప్రాణనష్టానికి దారితీసిన ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి సంబంధించి హైదరాబాద్‌లోని ఐవిఆర్‌ఎల్‌సి కంపెనీలో బెంగాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కంపెనీ నిర్మిస్తున్న ఫ్లయ్ ఓవర్ కుప్పకూలి 25 మంది మరణించడంతో సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. కోల్‌కత నుంచి ముగ్గురు పోలీసు అధికారులతో కూడిన బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఐవిఆర్‌ఎల్‌సి కంపెనీ ప్రతినిధులను విచారిస్తోంది. ఇంతవరకూ ఈ కంపెనీ చేపట్టిన నిర్మాణాలు, ప్రమాద సంఘటనలు, నాణ్యతా ప్రమాణాలు వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాల తరబడి తాము ఎన్నో నిర్మాణాలను చేపడుతున్న ఇంతవరకూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.