తెలంగాణ

మేడారానికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు: మేడారం మినీ జాతరకు భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల తరలి వచ్చారు. ముందుగా భక్తులు కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుని జంపన్నవాగు సమీపంలో అధికారులు ఏర్పాటు చేసిన ట్యాప్స్ వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. నిలువెత్తు బంగారం, ఎదురుకోళ్లు, గొర్రెలు, మేకలతో భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. వాటర్ ట్యాంకులు, వైద్య సదుపాయాలను భక్తులకు అందుబాటులో ఉంచారు. అలాగే మరుగుదొడ్లను సైతం ఏర్పాటుచేశారు. మొదటి రోజు జాతర ప్రశాంతంగా జరిగింది.