అంతర్జాతీయం

మేమే ముందుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ పరిరక్షణ మా బాధ్యత
అన్ని హామీలూ నెరవేరుస్తాం
ఒబామాతో మోదీ మీడియా భేటీ
పారిస్, నవంబర్ 30: భూగోళాన్ని అగ్నిగుండంగా మారుస్తున్న వాతావరణ మార్పులను నిరోధించేందుకు భారత్ తన అన్ని బాధ్యతలను నెరవేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. పారిస్ పర్యావరణ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమై సంయుక్త విలేఖరుల భేటీలో మాట్లాడారు. పర్యావరణానికి సంబంధించిన అన్ని అంశాలను బరాక్ ఒబామా తనతో నిష్పాక్షికంగా చర్చించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య మరింత లోతైన అవగాహన పెరిగే అవకాశం ఉంటుందని మోదీ అన్నారు. భారత్ నుంచి ఏకరమైన బాధ్యతలను ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయో వాటన్నింటినీ త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తామని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడంతోపాటు కలసికట్టుగా పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు తోడ్పడతామని విలేఖరుల భేటీలో మోదీ తెలిపారు. 175 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని చేరుకోవాలన్న భారత్ ఆశయాన్ని కూడా మోదీ ఈ సందర్భంగా నివేదించారు. పర్యావరణ సదస్సులో భారత ధోరణి ఓ సవాల్ కాబోతోందంటూ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఈ విషయాన్ని స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సౌర ఇంధన వినియోగాన్ని పెంపొందించాల్సిన అవసరం గురించి కూడా మోదీ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ రెండు దేశాలూ నిర్దేశించుకున్న పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ప్రయత్నం ఉపకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఒబామా భారత్ కార్బన్-డై-ఆక్సైడ్ వినియోగాన్ని గరిష్టస్థాయిలో తగ్గించుకుని పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని సూచించారు. పేదరిక నిర్మూలన, వృద్ధి లక్ష్యాల సాధన, ఆర్థికాభివృద్ధి పథంలో వేగంగా ముందుకు వెళ్తూనే కార్బన్ -డై-ఆకైడ్ వినియోగాన్ని గరిష్టస్థాయిలో తగ్గించుకోవాలన్నారు. వాతావరణ మార్పులను అరికట్టే విషయంలో భారత్ అమెరికాల మధ్య మరింతగా సహకారం పెంపొందాలన్నారు. ‘నా స్నేహితుడిని భాగస్వామిని మరోసారి కలుసుకునే అవకాశం కలగడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అని ఒబామా పేర్కొన్నారు. ప్రపంచ మనుగడకే వాతావరణ మార్పు పెను విఘాతం కలిగిస్తోందన్న స్పృహతోనే రెండు దేశాలూ పని చేస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు భారత్ సారధ్యం వహించడం ఆహ్వానించతగ్గ పరిణామమన్నారు. అలాగే పేదరిక నిర్మూనల దిశగా భారత్‌వంటి దేశాలు సాగించే పోరాటానికి పారిస్ సదస్సు బలమైన వేదిక కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్య దేశాలు చేసే హామీలు త్రికరణ శుద్ధిగా అమలు కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కేవలం మాటల్లోకాకుండా చేతల్లోనే అన్ని దేశాలు ఫలితాలను సాధించాలని ఒబామా విజ్ఞప్తి చేశారు. ఒబామాతో సమావేశం అనంతరం మాట్లాడిన మోదీ భూగోళాన్ని పరిరక్షించడంలోను, వాతావరణాన్ని సంరక్షించుకోవడంలోనూ ప్రపంచంలోనే భారత్ ముందుందని తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ సారథ్యంలోనే ఏనాడూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మొదలైందన్నారు. ఇంతకుముందు ప్రతిష్ఠాత్మక భారత్ పెవిలియన్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోదీ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఆచరణయోగ్యమైన సమన్యాయంతో కూడిన సుస్థిరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. భూతాపాన్ని ఎంతగా తగ్గిస్తే అంతగానూ భావితరాల మనుగడ సురక్షితం అవుతుందని తెలిపారు. ప్రజల జీవన శైలిలో మార్పులు తీసుకురావడం ద్వారానే భూగోళంపై భారాన్ని తగ్గించవచ్చని, కేవలం కొన్ని దేశాల అలవాట్లు జీవన విధానం కారణంగా అభివృద్ధి చెందిన దేశాల అవకాశాలు హరించుకుపోవడానికి వీల్లేదని వెల్లడించారు. (చిత్రం) ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మీడియా భేటీలో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా