మీ వ్యూస్

దర్శకుడి ఆత్మవంచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్కార్‌లు ఆంగ్ల చిత్రాలకే పరిమితం. ఆంగ్లేతర చిత్రాలు పోటీపడేది ఉత్తమ విదేశీ చిత్రం అనే ఒక్క విభాగంలోనే. పోటీ చాలా తీవ్రంగా వుంటుంది. అంత పోటీవున్న విభాగానికి ఎలాంటి సినిమాలు పంపాలో మనవాళ్లకి తెలియకపోవడం ఆశ్చర్యం! బాహుబలిని చూసి హాలీవుడ్ షేక్ అయిపోయింది. బాలీవుడ్ బావురుమంది అని మీడియా సృష్టించిన హైప్‌ని సామాన్య ప్రేక్షకులు నమ్మవచ్చు. కానీ రాజవౌళికి తన చిత్రం సత్తా తెలియదా? స్క్రీనింగ్ టెస్టులో బాహుబలి ఫెయిల్ అవగానే అవార్డు కోసం నేనా చిత్రం తీయలేదు. తమ యూనిట్ అంతా సంతృప్తి చెందడానికే జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాం. ప్రేక్షకుల రివార్డు దక్కింది చాలు అని రాజవౌళి అనడం దర్శకుడి ఆత్మవంచన. అవార్డుకోసం కాకపోతే ఎంట్రీగా దాన్ని ఎందుకు పంపినట్టు?

-చంద్ర, కాకినాడ