మీ వ్యూస్

కమల్ రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ప్రారంభించకుండానే కమల్‌హాసన్ రాజకీయాలాడుతున్నాడు. ఇప్పుడున్న ఏ పార్టీతోనూ సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదంటూనే కేరళ వెళ్లి వామపక్ష నేతలతో భేటీ అయ్యాడు. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆయన్ని కలిసి మంతనాలాడి వెళ్లాక కేజ్రీని కమల్ పొగిడాడు. తమిళనాట ఆయన చిత్రాలపై కేసులు పెట్టే వర్గం ఉంది. ఆయన నిర్వహించిన బిగ్‌బాస్‌పై నిరసనలు వ్యక్తం అయాయి. విసిగిపోయిన కమల్ ఒక సందర్భంలో ముంబాయికి వెళ్లిపోతానన్నాడు. ఆయన గెలవవచ్చునేమో గాని తన పార్టీలో ఎంతమందిని గెలిపించగలడన్నది కోటి రూపాయల ప్రశ్న! రజనీకాంత్ చెప్పినట్లు డబ్బు, కీర్తి మాత్రమే చాలవు. ఆ విషయం మన చిరంజీవి నిరూపించాడు!

-కె.ప్రవీణ్, కాకినాడ