మీ వ్యూస్

విందు భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ సినిమా అభిమానులకు షడ్రశోపేతమైన విందు భోజనంలా అలరించింది. ఈ సినిమాకు ప్రధాన బలం ఎన్‌టిఅర్ నటనా విశ్వరూపం. ఈమధ్యకాలంలో ఇంత అద్భుతంగా అవలీలగా, అలవోకగా మూడు వైవిధ్యాలున్న పాత్రలను ఎవ్వరూ పోషించలేదనడం అక్షర సత్యం. అడుగడుగునా కన్‌ఫ్యూజన్ వున్న కథలో ఎన్టీఆర్ నటన తీసేస్తే మొత్తం సినిమా కలగాపులగంగా మారి బాక్సాఫీస్ వద్ద ఫట్ అయ్యిందనడంలో సందేహం లేదు. కొన్ని సన్నివేశాలలో ముగ్గురు ఒకేలా వున్నా ఆహార్యాన్నిబట్టి ఎవరు ఏ పాత్రలో వున్నారో ఇట్టే చెప్పేయగలమంటే అందుకు కారణం ఎన్టీఆర్ నటనలో, పాత్రపరంగా చూపించిన వైవిధ్యమే కారణం. ఇంటర్వెల్ ముందు జై పాత్రను ప్రవేశపెట్టిన విధానం అద్భుతంగా వుంది. కాగా ద్వితీయార్థంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య నడిచే ఎమోషనల్ సన్నివేశాలు ఔరా అనిపించేవిగా వున్నాయి. రొటీన్ కథ, చప్పగా వున్న సంగీతం, ఆసక్తిలేని స్క్రీన్‌ప్లే సినిమా స్థాయిని ఒకింత తగ్గించాయ.

-ఎం.కనకదుర్గ, తెనాలి