మీ వ్యూస్

మితిమీరుతున్నారు! ( మీ వ్యూస్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్క్రీన్ చించేస్తున్న బాలీవుడ్ సెక్స్ బాంబుల గురించి వ్యాసం బావుంది. షకీలా రాకముందే మలయాళ చిత్రాలపై సెక్సీ ముద్ర ఉండేది. నిజానికి ఆ కథలు కాస్త బోల్డ్‌గా ఉండేవి తప్ప శృంగారం మితిమీరేది కాదు. ఆ బోల్డ్‌నెస్‌నే సెక్సీ అనేవారు. ఇప్పుడు పచ్చి శృంగారమే బాలీవుడ్‌ని ముంచెత్తుతోంది. అయితే పబ్బులు, వీడియో పార్లర్లు, లాప్‌టాప్‌లు వచ్చాక యువత అటు మళ్లింది. అట్టడుగు జనాలే సెక్సీ చిత్రాల్ని థియేటర్లలో చూస్తున్నారు. శృంగార తారల ఆత్మహత్యలు చూస్తున్నాం. షకీలా అలాంటి చిత్రాల్లో నటించను అంది. శృంగార చిత్రాలూ ఫ్లాప్ అవుతున్నాయి. వాటికి లాభాలు వస్తున్నా ఏదీ వంద కోట్ల క్లబ్బు చేరుకోలేదు. శృంగార ట్రెండ్ కూడా ముగిసిపోక తప్పదు.
-శాండీ, కాకినాడ

సర్దార్ మర్డర్
ఏ నటుడికైనా వీరాభిమానులుంటారు. చిత్రం వారు ఆశించినంతగా ఉంటే వారే రిపీట్ ఆడియన్స్‌గా మారి కోట్ల క్లబ్బుల్లో చేరుస్తారు. బాగుండకపోతే వౌత్‌టాక్‌తోనే సినిమాను తిప్పికొడతారు. ఇక సినిమా బాగుంటే చూద్దామనుకునే ప్రేక్షకుడు డబ్బు దంగడని థియేటర్ మొహం చూడడు. చిత్రాలు హిట్టయితేనే అభిమానులు పుడతారు. ఫట్టయితే పార్టీ మారినట్టు మరో నటుడిని ఆరాధిస్తారు. అభిమానమనేది ఓ మిథ్య. సినిమాను తన సొంత బ్యానర్‌లా భావించి ముఖ్యమైన క్రాఫ్ట్ వారి పని తానే చేసేసుకుంటే ఫలితాలిలానే ఉంటాయి. అదే జరిగింది సర్దార్ గబ్బర్‌సింగ్‌కు. 2019లో ఎన్నికల బరిలో దిగుదామనుకునే పవన్‌కళ్యాణ్‌కు చిత్ర విజయాలు చాలా ముఖ్యం. లేకపోతే పవర్‌కు దూరం కావాల్సి వస్తుంది.
-ఎన్నారెల్, సికిందరాబాద్

అవును.. నిజమే!
అక్కరకు రాని అవార్డులు ఆలోచింపజేశాయి. నిజమే.. అవార్డులపై అందరికీ అసంతృప్తి ఉంది. అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ మీడియాలో లబలబలాడి ఊరుకోవడంవల్ల ప్రయోజనం లేదు. అవార్డు కమిటీల్లో ఉండేది సినీ ప్రముఖులే. వాళ్లకి మొగమాటాలు, లాబీయింగ్, ఆశ్రీత పక్షపాతం, దక్షిణలు ఉంటాయి. నిజానికి ఉత్తముల్ని ఎంపిక చేసే విధి విధానాలు ఎవరికీ తెలియవు. అందువల్ల వాటిని చెప్పమని సహచట్టం ద్వారా ప్రభుత్వాన్ని అడగాలి. తర్వాత నిబంధనల్ని ఉల్లంఘించి యిచ్చిన అవార్డుల్ని రద్దుచేయాలని కోర్టుల్ని ఆశ్రయించాలి. ఇలాచేస్తే తప్పక అవార్డులకు గౌరవం లభిస్తుంది. ఈ పనికి జర్నలిస్టులే పూనుకోవాలి.
-లక్ష్మి, బృందావనం

ఏది నమ్మాలి వర్మా!
పూరీ తన గురువు వర్మ గురించి చెప్తూ అతని జేబులో డబ్బుండదు. డబ్బు లెక్కలు పట్టించుకోడు అన్నాడు. కానీ బాలీవుడ్ వార్తల ప్రకారం వర్మ అక్కడే ఆఫీసు నిర్మించుకున్నాడు. దాని హంగులు, అలంకరణల కోసం 15కోట్లు ఖర్చు పెట్టాడట. ఆఫీసు పేరు ‘కంపెనీ’. ఇంతకుముందు ఆఫీసు ‘్ఫక్టరీ’. తీసిన సినిమాలే మళ్లీ మళ్లీ తీస్తున్నాడన్న అపకీర్తి పోగొట్టుకోడానికి హైదరాబాద్ వచ్చేసి నాలుగేళ్ల తర్వాత నూతన జవసత్వాలతో ముంబాయి వెళ్లిన వర్మ ‘వీరప్పన్’ సినిమా తీస్తాడట. తర్వాత అతనికి పేరు తెచ్చిన ‘కంపెనీ’కీ సీక్వెల్ తీస్తాడట. వర్మ కొత్త జీవితం ఆరంభించి దమ్మున్న సినిమాలు తీస్తాడని ఆశిద్దాం.
-జ్ఞానబుద్ధ, సిద్ధార్ధనగర్

అందాల బొమ్మలేనా?
స్టార్ హీరోల సరసన నటించే తారలకు ప్రాముఖ్యం ఉండటంలేదు. వారు కేవలం ఆట పాటలకే పరిమితం. మహేశ్ చిత్రంలో ఆఫర్‌ని నిత్యామీనన్ తిరస్కరించడం వివాదాస్పదమైంది. ఆమెకు గీర, అహంకారం అని మశేశ్ అభిమానులు తిట్టడం మొదలెట్టేశారు. దీపిక, కత్రిన లాంటి బాలీవుడ్ తారలే మహేశ్‌తో నటించడానికి ఉవ్విళ్లూరుతుంటే నిత్యకిదేం రోగం అని విమర్శిస్తున్నారు గానీ దీపిక, కత్రిన మహేశ్‌తో నటించే అవకాశమే లేదు. వారు 12నుంచి 15 కోట్లు పారితోషికం తీసుకునే బాపతు. నయనతార 4 కోట్లు అడిగినందుకే బాబోయ్ అంటున్నారు. అలాంటివారు దీపిక, కత్రినలను తెచ్చుకుంటారా? పసలేని పాత్రని తిరస్కరించే హక్కు నిత్యకు ఉందని మహేశ్ అభిమానలెందుకు గుర్తించరు?
-్ధర్మతేజ, గొడారిగుంట

భారీ బడ్జెట్ వద్దు
బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రకటించాడు. అది తన తండ్రి ఎన్టీఆర్‌కు కలగా మిగిలిన కథ అని ప్రకటించాడు. అది తప్పు. ఎన్టీఆర్ చేయలేక కాదు. అది అందరికీ తెలిసినదే అని అల్లూరి సీతారామరాజు కథని చేస్తాను అంటూనే భారీ బడ్జెట్ అవుతుందని, తాను ఓ గెస్ట్‌గా ఆ పాత్రలో నటించి తృప్తిపడ్డాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖాళీ సమయాలలో సామ్రాట్ అశోక నిర్మించి నటించాడు. కానీ ఫ్లాప్ అయింది. అలాంటిది బాలకృష్ణ శాతకర్ణి చేస్తాననడం వృధా ప్రయత్నం. పైగా దర్శకుడు క్రిష్‌కి ఒక గమ్యం తప్పించి పెద్ద హిట్స్‌లేవు. కంచె భారీగానే తీసినా ఫ్లాష్‌బ్యాక్‌లు ఎక్కువై చతికిలపడ్డాడు. భారీ బడ్జెట్ బాలకృష్ణకు అచ్చిరాదు.
-బలివాడ నరసింహమూర్తి, శ్రీకాకుళం

చింతామణి
ఫ్లాష్‌బ్యాక్ శీర్షికన చింతామణి సినిమా గురించి చక్కగా వివరించారు. భానుమతి సంగీతంలో దిట్ట అని, రాజేశ్వరరావు సంగీతం అందించిన విప్రనారాయణ, చింతామణి చిత్రాలతో అర్ధమైంది. పరభాషా చిత్రాలనుండి తీసుకున్న బాణీలు ఆమెకు తెలియకుండా చింతామణిలో రావడం యాదృచ్ఛికమే. భానుమతి పాడిన రావోయి రావోయి ఓ మాధవ హిందీ సినిమాలోని లతామంగేష్కర్ ఆజాద్ సినిమాకోసం సి.రామచంద్ర దర్శకత్వంలో వచ్చింది. ఇటువంటి రీమేక్‌లను ఎలా సమర్ధించారో అర్ధం కావడం లేదు. స్వంత బ్యానర్‌లోనే రావడం మరో వింత.
- ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు

60 ఏళ్లు
60 ఏళ్ల క్రితం వచ్చిన భలేరాముడు సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో చదివి ఆనందించాం. సావిత్రి, నాగేశ్వరరావుల నటనతో ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. కళాత్మకమైన ఈ ఫ్లాష్‌బ్యాక్ సేవకు అభినందనలు తెలియజేస్తున్నాను. మాతరం అభిమానులకు ఆపాత మధురంలా వెనె్నల ద్వారా అందిస్తున్నందుకు నీరాజనాలిస్తున్నాం.
- ఎం ఆనందరావు, వేగివారిపాలెం