మీ వ్యూస్

సైరా అనేది సర్ నేమ్ కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను భారీ సినిమాగా నిర్మిస్తున్న నిర్మాత దర్శకులకు అభినందనలు. అయితే టైటిల్‌కు న్యాయం జరగలేదు. ఉయ్యాలవాడ ఇంటిపేరును తొలగించి సైరా నరసింహారెడ్డిగా మార్పు చేయడం సరికాదు. టైటిల్ లోగోలో నరసింహారెడ్డి పేరును దిగువగా వేశారు. ఇది సరికాదు. సైరా అనేది సర్ నేమ్ కాదు. బుర్రకథ కళకాకారులు, గ్రామీణులు నరసింహారెడ్డిని స్మరిస్తూ పాడుకొనే పాటలలో సై.. సైరా నరసింహారెడ్డి అంటారు. అదొక ఊతపదం మాత్రమే. సహజంగా సై సై అంటే పోరాటం చేసేవాళ్ళు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ సవాలుని విసరుకోవటం కోసం సై.. సైరా అంటారు. ఉయ్యాలవాడను తొలగించి సైరా ఉపయోగిస్తే నరసింహారెడ్డి పేరు గందరగోళంలో పడే పరిస్థితి ఉంది. కొన్ని పేర్లు ప్రజల పిలుపులవల్ల ప్రసిద్ధమవుతాయి. వాటికి సమాజంలో శాశ్వత రూపముంటుంది. సినిమాలకు సంబంధించినంవరకు టైటిల్ చాలా ఇంపార్టెంట్. ప్రజల నాలుకలమీద 200 సంవత్సరాలుగా నానుతున్న పేరును మార్పు చేసే సాహసం చేయకండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గోన గన్నారెడ్డి, తాండ్ర పాపారాయుడు, పల్నాటి వీరహనుమంతు, నాయకురాలు నాగమ్మ, అల్లూరి సీతారామరాజు బలమైన శబ్దాలుగా కాలాన్ని గెలిచి చరిత్రలో నిలిచాయి. వాటిని అలాగే చదవాలి, అలా ఉచ్చరించాలి. మార్పు చేయకూడదు. మార్చితే సమాజం స్పాంటేనియస్‌గా స్వీకరించదు. స్వాతంత్య్ర సమరయోధు అమరజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సినిమా టైటిల్ కోసం మార్చితే వక్రీకరించినట్లవుతుంది. దయచేసి ఆ పేరు అలాగే ఉంచండి.