మీ వ్యూస్

మరపురాని చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవకుశ లాంటి వెండితెర వెలుగు తెలుగు చిత్రసీమలో మరే చిత్రానికి రానంత శాశ్వత కీర్తి నార్జించింది. సినిమాకుండవలసిన అన్ని కళలు ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండడమే కారణం. నటీనటులు, తెర వెనుకనున్న వారు అకుంఠిత దీక్షతో తమ ప్రతిభను ప్రదర్శించారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఎన్టీ రామారావు రాముడిగా తెలుగువారి మనోఫలకంమీద మరపురాని ముద్రను వేశారు. ఈ సినిమా ముందు, తరువాత ఎంతమంది సీత పాత్రను ధరించినా సీతాదేవి అనగానే అందాల నట సుందరి అంజలియే తలపునకు వస్తుంది. సంగీత సాహిత్యాలు ఉన్నత స్థాయిలో పండిత, పామరుల ప్రశంసలు అందుకున్నాయి. ఇందులోని పాటలుల, పద్యాలు పదే పదే నాయికలమీద పలుకుతున్నాయనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆస్కార్ అవార్డుకు అన్ని అర్హతలున్నప్పటికీ ఏదీ రాకపోవడం చిత్రసీమ దురదృష్టం.
-ఎన్.ఆర్.లక్ష్మి, హైదరాబాద్