మీ వ్యూస్

రఘుపతి వెంకయ్యనాయుడు’ సినిమా విడుదలకు చొరవ చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

31-10-17లోని ఆంధ్రభూమి ‘వెనె్నల’లో సినీయుగానికి సృష్టికర్త అయిన రఘుపతి వెంకయ్య నాయుడుపై వ్యాసం చదివి 2012లో నరేశ్ హీరోగా తీసి, 13లో విడుదలకు సిద్ధమైతే ఎవరూ కొనడానికి రాకపోవడం సిగ్గుగా ఉంది. కోట్లు సంపాదించే సినీ పరిశ్రమ రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా రిలీజ్‌ను ‘మా’ ద్వారా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా విడుదల చెయ్యాలి. రఘుపతి వెంకయ్యనాయుడుగా సీనియర్ హీరో నరేశ్ అచ్చుగుద్దినట్లుగా సరిపోయారు. బాబ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ లేకపోవడం ద్వారానే విడుదలకు నోచుకోలేదంటే సిగ్గుపడాలి. తెలుగు చలనచిత్ర హీరోలైన సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, బాలకృష్ణలు ఈ చిత్రం విడుదలపై మా ఆర్టిస్టిస్ట్ అసోసియేషన్, ఎంపి అయిన మురళీమోహన్‌తో సంప్రదింపులు జరిపి విడుదలయ్యేలా చూడాలి. ఫిల్మ్‌నగర్ పేరును రఘపతి ఫిల్మ్‌నగర్‌గా మార్చి కాంస్య విగ్రహం నెలకొల్పేలా చెయ్యాలి. ఈ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వినోదపు పన్ను ఎత్తివేసేలా సిఎంలు కెసిఆర్, చంద్రబాబునాయుడు చొరవ చూపాలి అని ప్రార్థిస్తున్నాం

-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి