మీ వ్యూస్

నాలుగు మాటలు బాగున్నాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్టోబర్ 10వ తేదీ ‘వెనె్నల’లో లవకుశ చిత్రం గురిం చి పూజారి వారు చెప్పిన నాలుగు మాటలు బాగున్నాయి. కొనసాగింపుగా మరో రెండు మాటలు. సుదీర్ఘకాలం నిర్మాణం జరుపుకున్న ఆ చిత్రాన్ని పంపిణీ చేయడానికి ప్రముఖ కంపెనీలయిన నవయుగ, విజయా, పూర్ణ లాంటి సంస్థలు ముందుకు రాకపోతే నహతాగారి సహకారంతో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఆ చిత్రం మార్చి 29, 1963న కేవలం 28 కేంద్రాలలో విడుదలై, అన్ని కేంద్రాలలోనూ శతదినోత్సవం చేసుకుంది. తరువాత మరో 44 కేంద్రాలలో నూరు రోజులు ఆడి మొత్తం 72 కేంద్రాలలో శతదినాలు నడిచి అద్భుతాలు సృష్టించింది. ఆ చిత్రం ఆ రోజుల్లో ‘ఎ’ సెంటర్లలో రోజుకు 3 ఆటలు, బి, సి కేంద్రాలలో రెండు ఆటలతో నూరు రోజులకు వసూలైన మొత్తం 14 లక్షల, 64 వేల రూపాయలు మాత్రమే. ఆ రోజు అన్ని పత్రికలలో 100 రోజుల కేంద్రాల ప్రకటనలో దీనిని ప్రచురించారు. నేల 20 పైసలు ఉండిన ఆ రోజుల్లో కేవలం 28 కేంద్రాలలో 2, 3 ఆటలతో వసూలైన ఆ మొత్తం అప్పటికీ ఓ అద్భుత రికార్డు. అవే కేంద్రాలు, అనే్న ఆటలతో అయితే ఆ మొత్తం ఇప్పటి టికెట్ రేట్ల ప్రకారం రూ.140 కోట్లకుపైగా ఉంటుంది. వేల థియేటర్లలో ఇప్పటిలాగా అతే ఎన్ని వందల కోట్లు ఉంటుందో ఊహకు కూడా అందదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ లవకుశ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. అదీ లవకుశ విజయవిలాసం!
-తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం