మీ వ్యూస్

పెద్దమనుషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సినిమా పేరును చూస్తే గౌరవం కలుగుతుంది. ఇందులోని పెద్దమనుషులు అసలు పెద్దమనుషులు కారనే వ్యంగ్యం వున్నది. ‘పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడయా’ అని పరమానందయ్య శిష్యులు సినిమాలో ఓ పాట ఉంది. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే పెద్దమనుషులుగా సమాజంలో చెలామణి అయ్యేవారు అర్థశతాబ్దం క్రింద కూడా కలరని ఈ చిత్రం చెప్పింది. దర్శకుడు కె.వి.రెడ్డి, రచన చేసిన నరసరాజుల సృజనాత్మకత చాలా సహజంగా ఈ రోజుకే కాదు అన్ని కాలాలకు వర్తించేదిగా వున్నది. రాజుగారు రచించిన ‘శివ శివమూర్తిని గణనాధా’, ‘నందామయా గురుడ నందామయా’ పాటలు ఆనాడు పశువుల కాపరులు సులభంగా, చక్కగా పాడుకుంటూ పశువులను మేపేవారు. ఈకాలంవారికి అవేమీ తెలియదు. తెలుసుకోవడం లేదు. చెప్పినా వినడంలేదు. ఇలాంటి సినిమాలు టెలివిజన్‌లో వస్తున్నా చూడడం లేదు.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్