మీ వ్యూస్

వేగాన్ని పెంచింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో రాజశేఖర్ నటించిన పిఎస్‌వి గరుడవేగ చిత్రం వెండితెర వేగాన్ని పెంచింది. ట్రెండ్ మారినా రాజశేఖర్ స్టయల్ మారలేదని ఈ చిత్రం రుజు వు చేసింది. ముఖ్యం గా దర్శకుడి స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. సన్నీలియోన్ అందా లు ఆరబోసింది. మరీ ము ఖ్యంగా విశ్రాంతి ముందు ఛేజింగ్ సీన్ అభిమానులను అలరిస్తుందనుటలో అతిశయోక్తి లేదు. పతాక సన్నివేశాలు చిత్రానికే హైలెట్. హీరోయిన్ పూజాకుమార్ తన కళ్ళతో భావాలు పలికించింది. రాజశేఖర్ తన బాడీ లాంగ్వేజ్‌తో స్క్రీన్‌ను నడిపించాడు వీటన్నింటికితోడు తొలి ఆట నుంచి కొందరు సినీ నటుల ప్రచారం ఈ చిత్రానికి మరింత హైప్‌నిచ్చింది. రాజశేఖర్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలతో వస్తే థియేటర్లు మహిళలతో మరింత కళకళలాడుతాయి. యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ చిత్రాలు మరిన్ని రావాలని ఆశిస్తూ...

-వెలిశాల దుర్గాప్రసాద్, ఆత్కూరు, కృష్ణాజిల్లా