మీ వ్యూస్

నచ్చే డిటెక్టివ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసులకు కూడా సాధ్యంకాని కేసులను సులభంగా పరిష్కరించే డిటెక్టివ్ పాత్ర ప్రధానాంశంగా విశాల్ నటించిన ‘డిటెక్టివ్’ సినిమా బాగుంది. ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లేతో కూడిన ఇనె్వస్టిగేషన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా చక్కని అనుభూతిని ఇస్తుంది. ఊహించని విధంగా మలుపులు తిరుగుతూ సాగే ఈ సినిమా ఆప్‌బీట్ సినిమాల పట్టికలో అగ్రస్థానంలో వుంటుంది. హీరో విశాల్ ప్రత్యేకమైన వస్త్రాలంకరణ, బాడీ లాంగ్వేజ్‌తో ప్రతి సన్నివేశంలో తన అసాధారణ మేధాశక్తని ప్రదర్శిస్తూ అద్భుతంగా నటించాడు. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలకు తగినట్లుగా చక్క గా అమరింది. అయితే డిటెక్టివ్ హంతకులను పరిచయం చేసే సన్నివేశాలు కాస్త తికమకగా ఉండి ఒక పట్టాన అర్థం కావు. సగటు ప్రేక్షకుడికి కావాల్సిన యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇందులో మిస్ అయ్యాయి. అయితే అంతర్జాతీయ స్థాయి స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి సాంకేతిక అంశాలు భారతదేశంలోనూ సాధ్యమేనని డిటెక్టివ్ సినిమా మరొక్కసారి నిరూపించింది.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం