మీ వ్యూస్

లవకుశ గురించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్టోబర్ 10వ తేదీ వెనె్నలలో లవకుశ చిత్రం గురించి పూజారి వారు చెప్పిన నాలుగు మాటలు బాగున్నాయి. కొనసాగింపుగా మరో రెండు మాటలు. సుదీర్ఘకాలం నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రాన్ని పంపిణీ చేయడానికి ప్రముఖ కంపెనీలైన నవయుగ, విజయా, పూర్ణలాంటి సంస్థలు ముందుకు రాకపోతే నహతాగారి సహకారంతో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఆ చిత్రాన్ని మార్చి 29, 1963న కేవలం 28 కేంద్రాలలో విడుదలై అన్ని కేంద్రాలలోనూ శతదినోత్సవం చేసుకుంది. తరువాత మరో 44 కేంద్రాలలో నూరురోజులాడి మొత్తం 72 కేంద్రాలలో శతదినోత్సవాలు నడిచి అద్భుతాలు సృష్టించింది. ఆ చిత్రం ఆ రోజుల్లో ‘ఎ’సెంటర్‌లో రోజుకు 3 ఆటలు, బి, సి కేంద్రాలలో 2 ఆటలతో నూరు రోజులకు వసూలైన మొత్తం 14 లక్షల 64 వేల రూపాయలు మాత్రమే. ఆ రోజు అన్ని పత్రికలలో 100రోజుల కేంద్రాల ప్రకటనలో దీనిని ప్రచురించారు. ఆ రోజుల్లో కేవలం 28 కేంద్రాలలో 2, 3 ఆటలతో వసూలైన ఆ మొత్తం అప్పటికి ఓ అద్భుత రికార్డు. అవే కేంద్రాలు, అనే్న ఆటలతో అయితే ఆ మొత్తం ఇప్పటి టికెట్ రేట్ల ప్రకారం రూ.140కోట్లుపైగా వుంటుంది. వేల థియేటర్లలో ఇప్టిలాకా అయితే ఎన్ని వందల కోట్లు వుంటుందో ఊహకు కూడా అందదు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ లవకుశలలు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. అదీ ‘లవకుశ’ విజయవిలాసం!
-తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం