మీ వ్యూస్

గళం విప్పడం తప్పుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి శ్రీశ్రీ అన్నట్లు తెలుగు సినిమా నటులు రాజకీయాలకు అతీతులు. వారు దేనికీ స్పందించకపోవడం చైతన్యం కాదు. చచ్చుదనమే. సమాజానికి నటుడు అతీతుడు. వారు తమిళ సోదరులనుంచీ నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అస్థిరంగా అవినీతిలో కూరుకొనిపోయి నాటకంగా సాగుతున్న పరిపాలనపై కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్‌లు ధ్వజమెత్తడం ఆహ్వాదించదగిందే. అన్యాయంపై వౌనం ఆత్మహత్యతో సమానం. మనకెందుకులే..? అనుకుని వుంటే నేడు మనం స్వాతం త్య్ర వాయువులు పీల్చేవారిమే కాదు. అన్యాయాన్ని ఎదిరించేవాడు నిజమైన వీరుడు అది తెరమీదనా, తెరవెనుకైనా. కమల్‌హాసన్ గళం విప్పడం తప్పుకాదు. అతని ప్రాణాలకు ముప్పు ఉందేమో అనిపిస్తుంది. గౌరీ లంకేష్‌ను ఎవరు ఆదుకున్నారు. విజ్ఞులు ఆలోచించాలి.
-మణిదీపిక, కొమ్మెర