మీ వ్యూస్

బోరోత్సవం (మీ వ్యూస్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కనుక మహేష్‌బాబు కథానాయకుడుగా ఉన్నందుకు ఈ సినిమా ఎంత బాగుంటుందో అని థియేటర్‌లోకి వెళ్ళి కూర్చుంటే 20 ఏళ్ళ క్రితంనాటి లాగి లాగి వదిలిన ఓ టీవీ సీరియల్ చూసినట్లుగా అనిపించింది. సినిమాకుండవలసిన ఎటువంటి అర్హతలు ఈ ఉత్సవానికి లేవు. మహేష్‌బాబు కెరీర్‌లో ఇటువంటి చిత్రం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. అయినా ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయడం మనదే తప్పు. బ్రహ్మోత్సవం కాస్తా అదుపుతప్పి బోరోత్సవంలా మారి తల బొప్పికట్టింది.
- వెంకట శివప్రసాద్, ఆలూరు

స్టయిలిష్ విలన్లు
తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషా రంగాలనుండి వెలుగు తగ్గిన మాజీ హీరోలు, దర్శక నిర్మాతలు సరికొత్తగా విలన్లుగా పరిచయమవుతున్నారు. ఈ ప్రయత్నంలో విజయం సాధించడమేకాక హీరోలకు సమానమైన క్రేజ్ వారికి ఏర్పడుతుంది. ఇంతకుముందే సుమన్, వినోద్‌కుమార్, సురేష్‌లు విలన్లుగా రూపాంతరం చెందిన బోయపాటి శ్రీను లెజెండ్‌లో జగపతిబాబు కొత్త విలనీ స్టయిల్ పరిచయం చేశాడు. ఇప్పుడిదే హవాతో సరైనోడు, రాజా చెయ్యివేస్తే లాంటి చిత్రాల్లో కొత్త విలన్లు పరిచయమయ్యారు. హిందీ రంగంలో కూడా శతృఘ్నసిన్హా, సంజీవ్‌కుమార్‌తో పాటుగా ఈమధ్య క్రిష్-3లో అమీర్‌ఖాన్ విలన్‌గా రాణిస్తారట. అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్‌లు కూడా విలన్లుగా రాణించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. హీరో నవదీప్ అప్పుడప్పుడు విలన్ వేషాలు వేస్తున్నాడు. దర్శకుడు విభిన్న కోణంలోనుంచి రూపుదిద్దుకుంటున్న ఈ పాత్రలు జీరోలైన మాజీలకు కొత్త అవకాశాలు ఇస్తున్నాయి.
- పి.వి.ఎస్.ప్రసాదరావు, అద్దంకి

ప్రాధాన్యత లేని పాత్ర
మహేష్‌తో దీపికాపదుకొనే నటిస్తుందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రోబో-2లో స్క్వాష్‌నెగ్గర్ నటిస్తాడని హైప్ సృష్టించారు. చివరకు అక్షయ్ నటించాడు. ఇది కూడా ఓ పబ్లిసిటీ స్టంట్ కావచ్చు. దీపిక పారితోషికం ఇతర ఖర్చులు పరిగణిస్తే చిత్రం బడ్జెట్ 125 కోట్లు దాటవచ్చు. తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందిస్తే ఆపాటి బడ్జెట్ సహజమే. అయితే బాహుబలి, రోబోలాంటి అరుదైన చిత్రాలు తప్ప దక్షిణాది హీరోలు నటించనవన్నీ హిందీలో ప్లాపయ్యాయి. మహేష్‌బాబు హిందీ చిత్రం కూడా ప్లాప్ అవుతుంది అన్న భయం వుంటే ఆ సినిమా నిర్మాణం కాదు. అదీ కాక తన పాత్ర బాగుంటేనే నటిస్తానని సల్మాన్‌ఖాన్ చిత్రాన్ని పెండింగ్‌లో పెట్టిన దీపిక మహేష్‌బాబు చిత్రంలో నటిస్తుందా?
- జె.్ధర్మతేజ, గొడారిగుంట

పక్కా మాస్‌గాడు
సరైనోడు చిత్రం మాస్ ప్రేక్షకులను టార్గెట్‌చేసి వచ్చినట్టుగా వుంది. సినిమా మొత్తాన్ని అల్లు అర్జున్ తన భుజాలపై మోసాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో, డాన్సుల్లో ఇరగదీశాడు. కేథరిన్, రకుల్ తమ పరిధిలో పరవాలేదనిపించారు. ఆది పినిశెట్టి చేసిన పాత్ర అర్జున్‌కి ధీటుగా సాగింది. థమన్ సంగీతం పెద్ద మైనస్. రీరికార్డింగ్ బాగాలేదు. పాటలు రణగొణధ్వనులతో గందరగోళంగా సాగాయి. బోయపాటి మార్కు హింస మరొక్కసారి శృతిమించి ఒళ్లు గగుర్పొడిచింది. అర్జున్ యాక్షన్‌వల్ల సరైనోడు పరవాలేదని పించాడు.
- కెజె శ్రీనివాసరెడ్డి, కొంకుదురు

నవరస భరితం
మే 3 వెనె్నల నవరస భరితంగా వుంది. నవరాత్రి చిత్రం సావిత్రి నిర్మించగా, ఆ సినిమాకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ చదివి ఆనందించాం. ఆపాత మధురాలు మధురంగా అందిస్తున్న సేకరణ కర్తకు కృతజ్ఞతలు. శరత్‌కాలమ్‌లో అలనాటి అగ్ర నటీనటుల పురస్కారాలు, సత్కారాల వివరాలు చక్కగా వివరిస్తున్నారు. అలనాడు వీక్షించలేని ఎన్నో నగ్నసత్యాలు, అవార్డుల కార్యక్రమాలు ఈ శరత్‌కాలమ్‌లో అందిస్తున్నందుకు ఆనందంగా వుంది.
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం

తేలిగ్గా చెప్పేస్తే
ఇన్నాళ్లకు ఒక తెలుగు చిత్రం ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే సంతోషించవలసింది పోయి, మనవాళ్లే విమర్శిస్తున్నారు. ఆ చిత్రం రెండో భాగం తయారవుతుందని, కేవలం ఫైట్స్, గ్రాఫిక్స్‌ఉన్నాయని తెలికగా చెప్పేస్తున్నారు. ఇది చాలా శోచనీయం. లేదా అక్కసుతో రాసినదై వుండాలి.
- సునీతప్రకాష్ బీజాపూర్, బెంగుళూరు

మెచ్చదగింది
సమంత గురించి రచయిత రాసినదంతా నిజమే. మంచి ప్రవర్తనగల నటిగా ఆమెను తెలుగు ప్రేక్షకులు గౌరవిస్తారు. నేను అందగత్తెను కాను. నా అందం అంతా మేకప్ మహిమ. గొప్ప నటిని కాను. ఉత్తమనటిగా నాకన్నా నిత్యకు అవార్డు రావచ్చు అన్నది సమంత. మరెవరూ అంత నిజాయితీగా చెప్పలేదు. ముక్కుపిండి పారితోషికం వసూలుచేస్తుందన్న అభియోగం ఆమెపై వుంది. ఎవరు మాత్రం డబ్బు వదులుకుంటారు? అయితే ఆమె తన సంపాదనలోనుంచి సమాజసేవకు కొంత కేటాయిస్తుంది. అది మెచ్చదగినదే కదా?
- కె.లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట

గబ్బర్‌సింగ్‌లో కథ వుందా?
అ ఆ ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన పవన్‌కళ్యాణ్ మామూలు పొగడ్తలు అయ్యాక, హీరోకి మంచి ఇమేజ్ రావడానికి కారణం రచయితలే. అందుకే నేను కథను బలంగా నమ్ముతాను అన్నాడు. నిజానికి నటీనటులందరూ కథ నచ్చినందువల్లే నటించాం అని చెబుతారు. కానీ ప్రేక్షకులకు తెలుసు. 90 శాతం సినిమాల్లో కథే వుండదని! కథను బలంగా నమ్ముతానంటున్న పవన్‌కళ్యాణ్, తనే స్వయంగా కథాస్క్రీన్‌ప్లే రాసుకున్న సర్దార్ గబ్బర్‌సింగ్‌లో కథ వుందా?! ఈ రోజుల్లో ఏ సినిమా చూసినా గతంలో వచ్చిన సినిమాలే ఎందుకు జ్ఞాపకం వస్తాయి? కొత్త కథ చూస్తున్న అనుభూతి ఎందుకు కలగదు?
- ఎ.శాంతి సమీర, వాకలపూడి