మీ వ్యూస్

నందులు కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో కొంతమందికి అన్యాయం జరిగింది అన్నది నిజం. అల్లు అర్జున్‌కు రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి అల్లు అర్జున్ మంచి పేరున్న హీరో. 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఒక్క మెగా హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడం విచిత్రం. 2002వ సంవత్సరం నుండి సదరు హీరోలకు అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని ఓ పెద్ద నిర్మాత చేసిన ఆరోపణలలో నిజం ఉంది. గుణశేఖర్ దర్శకుడిగా రూపొందించిన రుద్రమదేవి చిత్రానికి అవార్డు రాకపోవడం అన్యాయం. లెజెండ్ చిత్రానికి తొమ్మిది అవార్డులు వచ్చాయో ఆ అవార్డులు ప్రకటించినవారికే తెలియాలి. ఇకనుండైనా అవార్డులు ప్రకటించేముందు అందరినీ దృష్టిలో పెట్టుకుని నిష్పక్షపాతంగా ప్రకటించాలి.
-బాణాల కృష్ణ, హైదరాబాద్