మీ వ్యూస్

గౌరవించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటిమెంట్‌ని గౌరవించరా? అని ప్రశ్నిస్తూ ప్రొఫెసర్ రాసిన వ్యాసం ఆలోచింపచేసింది. ఇతర మతాల జోలికి వెళ్లలేని పిరికివాళ్లు, తమకు లైసెన్సు వున్నట్లు హిందువులమీద పడతారు. వ్యాసంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందంటూ రేపు సీతా రావణులమధ్య డ్యూయెట్ పెట్టవచ్చు అన్నారు. ఆ ప్రయత్నమూ జరిగింది. ద్రవిడ సెంటిమెంట్‌తో మణిరత్నం తీసిన విలన్ (హిందీ- రావణ్)లో అది సాంఘిక రామాయణం అవునో కాదో అన్నట్లు అనుమానం కలిగించి రామాయణమే తీశాడు. దాంతో రాముడు చేతకానివాడు. రావణుడు అణగారిన ప్రజల ఉద్ధరణకు పూనుకునే సమర్థుడు. సీత అతనిపట్ల సానుభూతి, గౌరవం చూపుతుంది. రెండు భాషల్లో ఆ చిత్రం ఫ్లాఫ్ అయింది. కల్పితాలు ఎన్ని రకాలుగా తీసినా ఒప్పుకుంటారు. కానీ సెంటిమెంట్‌ను అగౌరవపరుస్తూ ఇలాంటి చిత్రాలు తీస్తే ఫ్లాపే గతి అని ప్రేక్షకులు నిరూపించారు ఈ చిత్రంతో. అదీ గౌరవించడం అంటే!
-కె.గునే్నష్, కొవ్వాడ