మీ వ్యూస్

కృష్ణ అంటే కృష్ణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్టమనేని శివరామకృష్ణ ఉరఫ్ సూపర్‌స్టార్ కృష్ణ 1943 మే 31 బుర్రిపాలెంలో జన్మించి 66లో సినీ రంగ ప్రవేశం చేశారు. తేనెమనసులు చిత్రంతో హీరో అయ్యారు. సూపర్‌స్టార్‌గా ఐదుసార్లు ఎన్నికై రికార్డు సాధించారు. ఎన్టీఆర్ చేయాలనుకున్న అల్లూరి సీతారామరాజు తీసి బంపర్‌హిట్ చేశారు. గూఢచారి 116 ద్వారా యువ హీరోలకు ఓ పెన్నిధిగా నిలిచారు. ఏలూరులో ఎంపిగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా మన్ననలు పొందారు. శ్రీశ్రీ చిత్రం ద్వారా వెండితెరపై మళ్లీ మెరిశారు. బావుంది.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

దినోత్సవమే
సరైన కథ, నడిపించే విధానం లోపిస్తే ఎంతటి స్టార్ హీరోలున్నా సినిమా మాత్రం డిజాస్టర్ బాట పట్టక తప్పదని గత చరిత్ర లెక్కలేనన్ని సార్లు చెప్పింది. అయినా అర్థం చేసుకోకుండా కోట్లు ఖర్చుచేస్తూ నిర్మాతలు, అతి అంచనాలతో దర్శకులు బోల్తాపడుతూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే -సినిమా హిట్టయితేనే హీరోకి అభిమానులు. అంటే, సినిమాలకు మాత్రమే అభిమానులు ఉంటారన్న మాట. హిట్టయితే స్టార్లను అందలమెక్కిస్తారు. ఫట్టయితే తొక్కేస్తారు. ఇదే సినీ నీతి. అందుకే -ప్రముఖ దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు వారం పదిరోజులు సాగితే, మహేష్ సినీ బ్రహ్మోత్సవాన్ని మాత్రం ఒక్క రోజుకు మార్చేస్తారు ప్రేక్షకులు.
-ఎన్‌ఆర్ లక్ష్మి, సికింద్రాబాద్

హరిశ్చంద్ర
అన్ని ఫ్లాష్‌బ్యాక్‌ల కథనాల మాదిరిగా హరిశ్చంద్ర కథనం బాగుంది. బలిజేపల్లి రాసిన హరిశ్చంద్రలో కాటి సీను అజరామరం. ఆ సీనుకి కంటతడి పెట్టనివారుండరు. నిజానికి ఇప్పుడు ఏడుపుగొట్టు సీనులుగా పరిగణిస్తున్న ఆ సన్నివేశాలే అప్పట్లో కాసులు కురిపించే విజయకారకాలు అయ్యాయి. క్రమంగా ప్రజల ఆలోచన మారింది. ఇచ్చిన మాటకోసం రాజ్యాన్ని త్యాగం చేసి భార్యాబిడ్డల్ని అమ్ముకోవడం నానె్సన్స్ అనిపించింది. ‘అవసరానికో అబద్ధం’ అన్న సినిమా సూక్తి బాగా నచ్చింది. మనుషులు ఆ కాలానికి వచ్చేశాక -ఎన్టీఆర్‌తో తీసిన హరిశ్చంద్ర పెద్దగా ఆడలేదు. అఫ్‌కోర్స్, ఇప్పుడసలు హరిశ్చంద్రుని తలిచేవారే లేరనుకోండి. అంతా కాలమహిమ!
-జె.జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగరం

గుర్తుకొచ్చాయి
గుర్తుకొస్తున్నాయి వ్యాసం ఎన్నో జ్ఞాపకాలను వడ్డించింది. నిజమే. టూరింగ్ టాకీసులు పోయి మల్టీప్లెక్స్‌లు వచ్చాయి. మూగ సినిమాలు పోయి అరుపులు, గర్జనలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ పోయి రంగుల ధగ్ధయమానం వచ్చింది. రద్దీలో దూరి టికెట్ సాధించినవారే జగదేకవీరుడు! కానీ, ఇప్పుడు ఆన్‌లైన్ సౌకర్యంవల్ల, చాలా థియేటర్‌లలో విడుదలవల్ల రద్దీ ఉండటం లేదు. జగదేకవీరులూ లేరు. ఇన్ని సౌకర్యాలు వచ్చినా సినిమా చూసిన సంతోషం ఉండటం లేదు. ఆ రోజుల్లో దర్శక నిర్మాత రచయితలు ప్రజల్లోనుంచి వచ్చినవారు. అందుకే ప్రజలకేం నచ్చుతుందో, వారి హృదయాలు ఎలా పట్టుకోవాలో చర్చించి రంగంలోకి దిగేవారు. ఇప్పుడలా కాదు. అందుకే ఈ హీనదశ!
-కె సుధీర్, శ్రీనగరం

జీర్ణం కష్టం!
24 సినిమా కొంతమందే చూసి ఆనందించగలరు, మనసుపెట్టి చూస్తేనే. కొంత గందరగోళంగా ఉంటుంది. పైపైన చూస్తే పిచ్చిపడుతుంది. విక్రం కుమార్ కష్టం, ఇష్టం కనపడుతుంది ప్రతి సన్నివేశంలో. సూర్యకూడా అలాంటి సబ్జెక్టులే కోరుకోవడంతో పని సులువైంది. ఎఆర్ రెహమాన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టొచ్చు. తెలుగు, తమిళంలో హాలీవుడ్ రేంజ్ చిత్రాలు వచ్చిన తరువాత లోకల్‌పై శ్రద్ధ తగ్గి చుట్టేస్తున్నాడు. ఏ మాయ చేసావే పాటలు మళ్లీ విన్నట్టుగా ఉంది. సమంత, నిత్యామీనన్‌లు అందంగా కనిపించినా చేసిందేమీ లేదు. హీరోగా విలన్‌గా సూర్య అయ్యేటప్పటికి ఇక ఎవరి అవసరమూ రాలేదు. మనకు కొంచెం జీర్ణం కావడం కష్టం.
-కాళిదాసు, కావలి

పాత రోజులు
ఎస్‌ఎస్ శాస్ర్తీ రాసిన గుర్తుకొస్తున్నాయి వ్యాసం చదివి నేను కొన్ని నిమిషాలు గతంలోకి ప్రయాణించాను. పాత రోజులు కళ్లకు కట్టినట్టు వ్యాసంలో రాయడం అభినందనీయం. ఈతరం ప్రేక్షకులకు ఆనాటి విషయాలు తెలియజేయడం ఎంతో అవసరం. చక్కని వ్యాసం ప్రచురించినందుకు అభినందనలు.
-ఎస్‌డి మొహియుద్దీన్, పొన్నూరు

మగ్గురు నాయికలు
కథాబలం లేని బ్రహ్మోత్సవం చిత్రం ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. కేవలం హీరోయిన్లు ముగ్గురు ఉన్నంత మాత్రాన సినిమాకు ఏం ప్రయోజనం ఉండదని ఈ సినిమా చెబుతోంది. అమ్మాయిల యాంగిల్స్‌తో చిత్ర విజయం అసాధ్యం. హావభావాలతో నటనతో ఆకట్టుకోవాలి. వారిలో మార్పు రావాలి. కథానాయికలు ఎక్కువగావున్నా ఆ సినిమా విజయం పొందదని గమనించగలరు.
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం

రేలంగి విమర్శ
31 మే వెనె్నలలో రేలంగి గూర్చిన ఓ విషయాన్ని ప్రచురించారు. విజయా సంస్థ నిర్మాత చక్రపాణితో రేలంగి మీ సంస్థ చిత్రాలన్నింటిలో నటించాను కదా, గుండమ్మ కథలో నన్ను తీసుకోలేదంటి అని అడిగితే, అందుకు చక్రపాణి ఈ చిత్రంలో మీకు తగ్గ పాత్ర లేదు. అందుకే ఇవ్వలేదు అన్నారట. ఈ విషయం సందర్భోచితంగా అలరించింది. తమాషాగా అనిపించింది.
-శ్రష్ఠి శ్రీనివాస శర్మ, వినుకొండ

లుక్కుల గొడవేంటో?!
ఫస్ట్‌లుక్ అదిరింది. ఫస్ట్ పోస్టర్ సూపర్. టీజర్ రిలీజైన గంటలోనే లక్షల మంది చూశారంటూ మీడియానే హైప్ సృష్టిస్తుంది. లుక్స్, పోస్టర్స్ ఎంత అదిరినా సినిమా మొదటి ఆటవరకే వాటి ప్రభావం. తెలుగు చిత్రాలు చూసే కోట్లాది మందిలో ఈ లక్షలాది జనం ఏపాటి?! ఫస్ట్‌లుక్ చూసి ఆహా అన్నవాళ్లే.. మొదటిరోజు మొదటి ఆట చూసి ఛీఛీ అని తిట్టుకోవడం ఎన్నిసార్లు చూళ్లేదు. అంచనాలు అందుకోని చిత్రాలపై అంతర్జాలంలో ఎంతమంది జోకులేస్తున్నారో, ఎన్ని కార్టూన్లు వస్తున్నాయో ఆ లెక్కలూ పత్రికల్లోకి వస్తే అప్పుడుంటుంది మజా?
- రవీంద్ర, గజపతినగరం