మీ వ్యూస్

మూసధోరణిలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2017 సంవత్సరంలో దాదాపు 200 తెలుగు సినిమాలు విడుదలవ్వగా పట్టుమని పది సినిమాలు కూడా ప్రజాదరణ పొందలేదు. వీటిలో గుర్తుంచుకోదగిన సినిమాలు అతి తక్కువ. ఒకప్పుడు మన తెలుగు సినిమాలు అద్భుత విజయాలు, అవార్డులు, రివార్డులతో విశ్వవిఖ్యాతి గాంచినాయి. అనేక సంవత్సరాల తర్వాత మన తెలుగు సినిమా ‘బాహుబలి’ జాతీయ పురస్కారం సాధించింది. ఇపుడు తెలుగు సినిమా నిర్మాతల, దర్శకుల ధోరణి చాలా మారిపోయింది. దీన్ని బట్టి ఇమేజ్ చట్రంలో సినిమాలు మూసధోరణిలో తీస్తున్నారు. ఒక విధానంలో తీసిన సినిమా (డబ్బింగ్ అయినా) సక్సెస్ అయితే ఆ ధోరణిలో 20-30 సినిమాలు వరుసగా వచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. 2017 లో ఖైదీ నెంబర్ 150, శతమానంభవతి, బాహుబలి-2 తదితర సినిమాలు ప్రజాదరణ పొందాయి. పెళ్లిచూపులు, ఘాజి, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు హిట్ కాకున్నా విమర్శకుల ప్రశంసలు పొందాయి. టీవీ మాధ్య మం విభిన్నమైన ప్రసారాలు 24 గంటలు అందిస్తున్న తరుణంలో ఆ పోటీని తట్టుకొని ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాలు నిర్మించడం నిస్సందేహంగా కత్తిమీద సాములాంటిదే. అయి మంచి సినిమాలు, సామాజిక ప్రయోజనం, మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా చిత్రాలు తీయాలన్న జిజ్ఞాస, తపన, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే అదేం అసాధ్యం కాదు. మసకబారిపోతున్న తెలుగు సినిమాల ప్రతిష్ఠను పెంపొందించేందుకు టాలీవుడ్ కృషి చేయాలి.
-జి.అశోక్, గోదూర్