మీ వ్యూస్

పిచ్చిపట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో సుధీర్‌బాబు, మారుతి కాంబినేషన్‌లో ‘ప్రేమకథా చిత్రమ్’ నచ్చింది. హారర్ కామెడీతో అదరగొట్టిన ఈ సినిమా తరహాలోనే థ్రిల్లర్ అన్నారు కదా అని ఈమధ్య వచ్చిన ‘కుటుంబ కథా చిత్రమ్’ పోస్టర్ చూసి సినిమాకెళితే పిచ్చిపట్టింది. ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన మహారాజశ్రీ దర్శకుడికి శతకోటి వందనాలు. ఆ టైటిల్ ఏంటో, ఆ సినిమా ఏంటో, ఆ కలల గోలేంటో అర్థమైతే ఒట్టు. మొత్తంగా ఈ చిత్ర రాజాన్ని కిచిడి చేసి పారేశారు దర్శక ప్రభుద్ధుడు. డబ్బులిచ్చి తల బొప్పి కట్టించుకోవడం అంటే ఇదే కామోసు!
-వాడపర్తి వెంకటరమణ, గొల్లలవలస
మూసధోరణిలో...
2017 సంవత్సరంలో దాదాపు 200 తెలుగు సినిమాలు విడుదలవ్వగా పట్టుమని పది సినిమాలు కూడా ప్రజాదరణ పొందలేదు. వీటిలో గుర్తుంచుకోదగిన సినిమాలు అతి తక్కువ. ఒకప్పుడు మన తెలుగు సినిమాలు అద్భుత విజయాలు, అవార్డులు, రివార్డులతో విశ్వవిఖ్యాతి గాంచినాయి. అనేక సంవత్సరాల తర్వాత మన తెలుగు సినిమా ‘బాహుబలి’ జాతీయ పురస్కారం సాధించింది. ఇపుడు తెలుగు సినిమా నిర్మాతల, దర్శకుల ధోరణి చాలా మారిపోయింది. దీన్ని బట్టి ఇమేజ్ చట్రంలో సినిమాలు మూసధోరణిలో తీస్తున్నారు. ఒక విధానంలో తీసిన సినిమా (డబ్బింగ్ అయినా) సక్సెస్ అయితే ఆ ధోరణిలో 20-30 సినిమాలు వరుసగా వచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. 2017 లో ఖైదీ నెంబర్ 150, శతమానంభవతి, బాహుబలి-2 తదితర సినిమాలు ప్రజాదరణ పొందాయి. పెళ్లిచూపులు, ఘాజి, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు హిట్ కాకున్నా విమర్శకుల ప్రశంసలు పొందాయి. టీవీ మాధ్య మం విభిన్నమైన ప్రసారాలు 24 గంటలు అందిస్తున్న తరుణంలో ఆ పోటీని తట్టుకొని ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాలు నిర్మించడం నిస్సందేహంగా కత్తిమీద సాములాంటిదే. అయి మంచి సినిమాలు, సామాజిక ప్రయోజనం, మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా చిత్రాలు తీయాలన్న జిజ్ఞాస, తపన, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే అదేం అసాధ్యం కాదు. మసకబారిపోతున్న తెలుగు సినిమాల ప్రతిష్ఠను పెంపొందించేందుకు టాలీవుడ్ కృషి చేయాలి.
-జి.అశోక్, గోదూర్
పాటకు చిరునామా..
19 డిసెంబర్, మంగళవారం ఆంధ్రభూమి వెనె్నలలో బాబ్జి వ్రాసిన మధరమైన పాట పేరు మహమ్మద్ రఫీ హిందీ గానప్రియులను అలరించేలా ఉంది. సమ్మోహన గాయకుడు మహమ్మద్ రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గానం అమరం. అప్పట్లో భాషాభేదం లేకుండా రేడియోలో రఫీ పాటలు ‘బినాకా గీత్‌మాలా’లో వినని శ్రోతలుండరు. అంటి మహాగళం కూడా అవకాశాల కోసం, సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం, స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి రావడం, చేతిలో పని లేక పస్తులు ఉంటూ ఆకలిరాగలా ఆలపించడం హృదయవిదారకం. ఒక ప్రపంచ ప్రసిద్ధుడైన రఫికి జయంతే వుంటుందని చెప్పిన వ్యాసరచయిత బాబ్జీ అభినందనీయులు.
-యం.రమణకుమారి, హైదరాబాద్
మధురాతిమధురం..
హిందీ, తెలుగు చిత్రసీమలో మధురంగా పాడగలిగిన గాయకులెందరో వున్నా మధురాతిమధురంగా పాడి భాష ఉన్నంతకాలం సప్తస్వరాలు జీవించినంతకాలం బ్రతికే గాయక శిఖామణులు మహమ్మద్ రఫీ, మన ఘంటసాల అని ఘంటాపథంగా చెప్పవచ్చు. వీరిద్దరూ కనీసం షష్టిపూర్తి అయినా చేసుకోకుండా ఏదో సమయం మించిపోతోంది అని చిత్ర పరిశ్రమను, అభిమానులను వీడి వెళ్లిపోయారు. వీరి తరువాత వచ్చిన గాయకులు ఎంత బాగా పాడుతున్నా వీరిద్దరి గళాల కళాత్మక మాధుర్యాన్ని మించి పాడటం అసంభం. వీరెప్పుడు మరువలేని సుమధుర గాయకులుగానే ప్రథమ స్థానంలో శాశ్వతంగా నిలవగలరు. కనుకే మరణించారనే భావన కలుగదు. అందుకే వీరికి జయంతులు ఉంటాయి కాని వర్థంతులు ఉండవు. మధురమైన పాట పేరు మహమ్మద్ రఫీ అనే మాట అక్షర సత్యం.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
సినిమా చూడరా!
హైదరాబాద్‌లో జరిగిన తెలుగు సభలలో అందరూ తెలుగులోనే మాట్లాడారు. పా ఠశాలల స్థాయి వరకు తెలుగు చదవాలని అన్నారు. వీరంతా మన తెలుగు సినిమాలలో ఇంగ్లీషు పదాలు లేని స్వచ్ఛమైన తెలుగు మాటలు ఉండాలని అనరెందుకు? వారు సినిమాలు చూడరా?
-డొక్కా యుగంధర్, ఒక్కలంక
ప్రశ్నలు - జవాబులు
తారల ఇంటర్‌వ్యూలు రాను రాను బోర్ కొడుతున్నాయి. ఇంచుమించు అన్నీ రొటీన్ ప్రశ్నలు, రొటీన్ జవాబులే. జిందగీ సక్సెస్‌ని మీరు ముందుగా ఊహించారా? అంటూ చచ్చుప్రశ్న. జవాబు మనం ఊహించుకోవచ్చు. అయితే మొదటి మూడు రోజులే ఆ చిత్రానికి సొమ్ములొచ్చాయి. తరువాత ఢమాల్. నష్టం మిగిలింది. ఇలాగే వుంటాయి అన్ని ప్రశ్నలు, డాబుసరి జవాబులు!
-ఆర్.శాంతి సమీర, వాకలపూడి
జగ్గయ్య గురువు
జీవిత మార్గంలో కొన్ని కొన్ని సంఘటనలు విచిత్రంగా వుంటాయి. జమున చదువుకొనే రోజులలో దుగ్గిరాల పాఠశాలలో జగ్గయ్య గురువుగా విద్యాబోధన చేశారు. అదే పాఠశాలలో జమున చదువుకున్నారు. ఆ తరువాత 1953లో పుట్టిల్లుతో గరికపాటి రాజారావు చిత్రంతో చిత్ర పరిశ్రమకు వచ్చారు. ప్రభాకర్ రెడ్డి ఎంబిబిఎస్ డాక్టర్ కావలసిన సమయంలో యాక్టర్‌గా మారారు. హైదరాబాద్‌లో ప్రభాకర్‌రెడ్డి మెడిసిన్ చదివే సమయంలో మేనమామ డా.హనుమంతరావు ప్రభాకర్‌రెడ్డికి గురువు. జీవితపథంలో ఆశ్చర్యపరిచే పలు సంఘటనలు జరుగుతుంటాయి. అది దైవలీల.
-కొవ్వూరు వెంకటేశ్వర ప్రసాదరావు, టంగుటూరు