మీ వ్యూస్

ఇద్దరిని కలిపింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌కౌంటర్ చిత్రం ద్వారా దర్శకత్వంలోకి అడుగుపెట్టిన ఎన్.శంకర్, తెలుగులో 2 కంట్రీ స్ పేరుతో ఓ విభిన్నమైన చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. ఈ చిత్రంలో తను ప్రేమించిన ప్రియురాలు పెళ్లి చేసుకొని తనకు విడాకులు ఇవ్వడానికి వస్తే, తను ప్రేమించిన ప్రేయసి తనవల్ల తనకు నిజంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే తను విడాకులు ఇస్తేనే బాగుంటుందని విడాకులు తీసుకొని ఇంకో పెళ్లికి సిద్ధపడితే, తను ప్రేమించిన ప్రియురాలు పెళ్లిపందిరికివచ్చి కన్నీళ్లతో వుంటే తను కరిగిపోయి ఆమెతోనే జీవితం గడపడం కోసం ముందుకు కదలడం ద్వారా 2 కంట్రీస్ చిత్రం ద్వారా విడాకుల సంస్కృతిని అంతమొందించే ప్రయత్నం చేసిన దర్శకుడు శంకర్ అభినందనీయుడు. మనీషారాజ్ తనదైన నటనతో మత్తెక్కించింది. అమెరికాలో వైవాహిక జీవితాలు పొద్దున పెళ్లి రాత్రి విడాకులుగా మారడంపై దర్శకుడు ఎన్.శంకర్ డైవర్సిపై స్పందించి 2 కంట్రీస్ ద్వారా ఆప్యాయత అనురాగాలు అనుబంధాల ద్వారా జీవితాలు భద్రంగా ఉంటాయని చెప్పిన తీరు బాగుంది. ఉల్లాస్‌కుమార్‌గా సునీల్ ఉల్లాసంగా నటించారు.
-కోలిపాక శ్రీనివాసు, బెల్లంపల్లి
ఆకట్టుకునే కథనం..
చక్కని కథ, ఆకట్టుకునే కథనం, నటీనటుల చక్కని నటన, వినసొంపుగా వున్న సాహిత్యం, సంగీతం, మనస్సుకు ఆహ్లాదం కలిగించే మాట లు వెరసి ‘మెంటల్ మది’లో చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అభిరుచి గల నిర్మాత రాజ్‌కందుకూరి పెళ్లిచూపులు వంటి విభిన్న కథా చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులకు అందించిన ఒక మంచి చిత్రంగా అభివర్ణించవచ్చు. ఇద్దరుఅమ్మాయిలు పరిచయం అయినపుడు, ఎవరు తనకు కరెక్టుగా సరిపోతారో తేల్చుకోలేని సందిగ్ధంలో సతమతమయ్యే హీరో పాత్రలో శ్రీవిష్ణు అభినయం చాలా బాగుంది. ఆ పాత్రతోనే నవ్వులు పూయించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రొటీన్ డైలాగులు, ఫైట్లు, బూతు కామెడీ, హీరోయిన్ అంగాంగ ప్రదర్శనలు లేకుండా ఆద్యంతం సహజత్వం, వినోదం, ఆహ్లాదకరంగా కుటుంబమంతా కలిసి హాయిగా చూసుకొని ఆనందించే చక్కని సినిమా అందించినందుకు దర్శక నిర్మాతలను మనస్ఫూర్తిగా అభినందించాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఆంగ్ల చిత్రాలకే పరిమితం
‘కీర్తినార్జించాయి’ శీర్షికతో మాయాబజార్ చిత్రం గొప్పదనాన్ని అభివర్ణిస్తూ ఆ చిత్రానికి ఆనాడు ఎన్ని ఆస్కార్లు రావాలి అంటూ నిట్టూర్చారు. అయితే ఆస్కార్లు కేవలం ఆంగ్ల చిత్రాలకే పరిమితం, ఇతర భాషా చిత్రాలు పోటీపడేది కేవలం ఉత్తమ విదేశీ చిత్రం అన్న ఒకే ఒక్క అవార్డు కోసం. సుమారు 90 దేశాలుపైగా పోటీపడే ఈ విభాగంలో పోటీ చాలా తీవ్రంగా వుంటుంది. మన దేశానికి ఒక్కసారి కూడా ఆ అవార్డు దక్కలేదు. లగాన్, మదరిండియా లాంటి చిత్రాలు గట్టి పోటీ ఇచ్చినా అవార్డు రాలేదు. ఆంగ్ల చిత్రాల్లో పనిచేయడంవల్ల కాస్ట్యూమ్స్, మ్యూజిక్, ఫొటోగ్రఫీ విభాగాల్లో భారతీయులకు అవార్డులు వచ్చాయి.
-మరుదకాశి, కరప
అవమానించటమే..!
రజనీకాంత్ నిరక్షరాస్యుడు అంటూ ఆయ న రాజకీయాలకు పనికిరాడంటూ బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడటం రజనీకాంత్‌ను అవమానించటమే అవుతుంది. గతంలో కామరాజ్ నాడార్ లాంటివారు ఏమి చదువుకొని రాజకీయాల్లో రాణించారు? చరిత్రలో అక్బరు లాంటి చక్రవర్తులు ఏమి చదువుకొన్నారు? సహన సంస్కృతులున్నచో చదువులేల? అది లేనపుడు ఎంత చదువుకొన్నా మా నుష ద్వేషులానే వుంటారు. వాస్తవానికి రజనీకాంత్ వెనుక వున్న ప్రజాబలం, అభిమానం ఎంతటిదో అందరికీ తెలుసు. జయలలిత విషయంలో పూర్తి సానుకూలం మెప్పుని కనబరిచిన డా.స్వామి రజనీ నచ్చకపోవడం ఒంటికన్ను తత్వాన్ని చెబుతోంది.
-గంధం సాహితి, అత్తిలి
బాగా గుర్తుచేశారు..
ప్రొ.ముదిగొండ శివప్రసాద్ గారు ‘సినిమా చరిత్ర వక్రీకరణ’ గొప్ప రిసెర్చి వ్యాసంలో నడచినది. చారిత్రక సినిమాలలో చరిత్రను తమ ఇష్టమైన రీతిలో మార్చేయడం, అదే నిజమని ప్రేక్షకులు భ్రమపడడం- అలాగే బాహుబలి భారీ చిత్రంలో చరిత్రలోని భారీ నామధేయాలు, పేర్లను హాయిగా వాడుకోవడం విషయంబుగా తెలిపారు శివప్రసాద్‌గారు. బాహుబలిని అంతెత్తు పొగిడే ఎపి సిఎమ్‌గారు, భారత ప్రధానిగారు, ప్రస్తుత ఉపరాష్టప్రతిగారికి గుణపాఠం. మా సిఎంగారు అమెరికా పర్యటనలో ఒక్కొక్క తెలుగు వాడు ఒక్కొక్క బాహుబలి అవ్వాలనడం, మన మీడియా గొప్పగా రాయడం ఈ సందర్భంగా శివప్రసాద్‌గారు 1950 దశకంలో శాంతారామ్ నటించి నిర్మించిన ‘దో ఆంఖే బారాహాత్’ చిత్రంలో నిజమైన బాహుబలి శాంతారామ్ అని బాగా గుర్తుచేశారు. సుదీర్ఘమైన వారి వ్యాసాన్ని చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి వారు చదివితే, వారు నిర్మాత, దర్శకులను శాసించగల దన్నుగలవారు గనుక సినిమాలలో చారిత్రక తప్పులు దొర్లవు. ఇంత డీప్‌గా చరిత్ర కోట్ చేస్తూ రాసే చారిత్రక రచయిత శివప్రసాద్‌గారు, నడుస్తున్న చరిత్ర విషయంలో కొంత పక్షపాతం చూపించారు, భూమిక దినపత్రిక ఇంటర్వ్యూలో. అదేమిటంటే ఏపి ప్రభుత్వ 3 నందులు ఉత్తమ నటులుగా ముగ్గురికి ఇవ్వడంలో కమ్మదనం వారు గుర్తించకపోవడం. ఆ సినిమాలు తాను చూడలేదని మూడు నందుల కమ్మదనం మీద ఏ మాత్రం విమర్శించకపోవడం ఆశ్చర్యం. ఈ వ్యాసంలో శివప్రసాద్‌గారు విమర్శనాస్త్రాలు సబబుగా పక్షపాతం లేకుండా బాగా పండించారు వ్యాసాన్ని.
-ఎ.వి.సోమయాజులు, కాకినాడ