మీ వ్యూస్

ఆ స్థాయ ఎప్పుడో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి చిత్రంతో ప్రభాస్ జగత్ విఖ్యా తి పొందాడని మన మీడియా భజన మొదలుపెట్టింది. బాహుబలిలో కొందరి నటన బాగుందని విదేశీయులు గుర్తిస్తారు కాని వారికి పేర్లు తెలియవు. ప్రభాస్ చిత్రాలు మరో రెండు మూడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయితే వారు అతని పేరు, సమాచారాలు సేకరిస్తారు. అమీర్‌ఖాన్ ఇప్పటికే చైనాలో లగాన్, 3 ఇడియెట్స్ చిత్రాలతో పేరుపొందాడు. ఇప్పుడు దంగల్ చిత్రంతో చైనా భాషలో వి లవ్ అమీర్ అని అర్థం వచ్చేలాగా చెప్పుకొంటున్నారు. ఆ స్థాయికి ప్రభాస్ ఇంకా చేరుకోలేదన్నది సత్యం. ఆ స్థాయ ఎప్పుడో..? త్వరలోనే ఆ చేరుకోవాలని ఆశిద్దాం.
-జి.ప్రభాస్, గాంధీనగర్
నమ్మకపోవచ్చు కానీ..!
2017 సంవత్సరానికి మన దేశంలోని వినోద పరిశ్రమకు సంబంధించి అత్యధిక సంపాదనగల వందమంది ర్యాంక్‌లను ఇటీవల ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన సంగతి తెలిసిందే. 232 కోట్లతో సంపాదనతో సల్మాన్‌ఖాన్ అగ్రస్థానంలో వుండగా, 170 కోట్లతో షారుక్‌ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆంధ్రులకు సంబంధించి 57 కోట్లతో బాడ్మిటన్ స్టార్ పి.వి.సింధు 13వ స్థానం, 55 కోట్లతో రాజవౌళి 15వ స్థానం, 36 కోట్లతో ప్రభాస్ 22వ స్థానం, 22 కోట్లతో రానా 36వ స్థానం, 20 కోట్లతో మహేశ్ 37వ స్థానం, 11 కోట్లతో పవన్‌కళ్యాణ్ 69వ స్థానం పొందాడు. కొందరు ఈ అంకెల్ని, ర్యాంక్‌లను నమ్మకపోవచ్చు కాని చాలా మంది నమ్ముతారు.
-కృష్ణ, కొండయ్యపాలెం
అభినందనలు!
పాత చిత్రాల జ్ఞాపక దొంతరల్ని మాకు అందిస్తున్న ‘వెనె్నల’కు అభినందనలు! 1865, 1969 సంవత్సరాలలో ఒక విశేషం జరిగింది. ఇద్దర అగ్రనటుల మూడు చిత్రాలు రోజుల వ్యవధిలో విడుదలవటమే ఆ విశేషం! 1965 జనవరి 1న అశోక్ వీనస్ కంబైన్స్ ‘సుమంగళి’, జనవరి 7న వాణీ కంబైన్స్ ఎస్వీఆర్ సొంత చిత్రం ‘నాదీ ఆడజనే్మ’, జనవరి 14న విజయమాధవీ వారి ‘పాండవ వనవాసం’ విడుదలయ్యాయ. మొదటి చిత్రం ఏఎన్నార్, మిగతా చిత్రాల్లో ఎన్టీఆర్ హీరోలయితే మూడు చిత్రాల్లోనూ సావిత్రి హీరోయిన్ కావడం గొప్ప విషయం! అయితే మూడు చిత్రాలు కూడా విజయవంతమయ్యాయి! అలాగే 1969 జూలై 24న సారధి స్టూడియోస్ ఆత్మీయులు, ఆగస్టు 12న ఎస్‌విఎస్ ఫిలింస్ వారి ‘నిండు మనసులు’, ఆగస్టు 14న విజయభట్ మూవీస్ ‘్భలే రంగడు’ విడుదలయ్యాయి. ఈసారి ఏఎన్నార్ రెండు చిత్రాల్లోనూ వాణిశ్రీ కథానాయిక అయితే, ఎన్టీఆర్ చిత్రానికి జోడి దేవిక! కేవలం 20 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ మూడు చిత్రాల్లో భలేరంగడు మాత్రం వెనుకబడిపోయింది.
-తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం

మూస పాత్రలతో బోర్..!
వెనుకటి సినిమాల్లో కామెడీ కథలో భాగంగా వచ్చేది. ప్రత్యేక కమెడియన్లు ఉన్నా వారి కామెడీ సినిమా సినిమాకు వైవిధ్యంగా ఉండేది. నేటి సినిమాల్లో కథకు సంబంధం లేక, కామెడీ కోసం ప్రత్యేకంగా సీన్లు తీస్తున్నారు. అయితే కామెడీ ఒక మూసలో సాగుతూ ప్రేక్షకులకు బోర్ కొడుతోంది. ఉదాహరణకు ఒక నటుడు ఒక సినిమాలో తాగుబోతు పాత్రను వేశాడు. అది సూపర్ హిట్ అయింది. ఇక ప్రతి సినిమాలో తాగుబోత పాత్రయే. కొన్నాళ్లకు ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ఒక నటుడు ప్రత్యేక యాసలో ఆకట్టుకుంటే ఇక ఏ సినిమాలోనైనా అదే యాస. ఒక నటుడు సీరియస్‌గానో, అవతలివాడిని తంతూ నో, చెంప దెబ్బలు కొడుతూనో ఉంటాడు. ఇక ప్రతి సినిమాలో అదే మూస. ఇలా ఒకే మూసలో అలాంటి పాత్రలే ఇస్తే కొన్నాళ్లకు ప్రేక్షకులకు బోర్‌కొడుతుంది. కామెడీ కథలో భాగంగా రావాలి. కమెడియన్లకూ వైవిధ్యమైన పాత్రలను ఇస్తూ ఆల్‌రౌండర్లను చేయాలి. రకరకాల పాత్రలలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సుత్తివేలు కొన్ని సినిమాలలో కంటతడి పెట్టించాడు. ఇలా ఆయా నటులకు నవరసాలలో రాణించాలంటే అవకాశం ఇవ్వాలి.
-సరికొండ శ్రీనివాసరాజు,
వనస్థలిపురం
టికెట్‌ధర పెంపు..
సినిమా టిక్కెట్ల ధర పెంచుకోవచ్చంటూ థియేటర్లకు ఉమ్మడి హైకోర్టు అనుమతించటం సగటు ప్రేక్షకులను వినోదానికి దూరం చేసేదిగా వుంది. కుటుంబంతో సినిమా చూసే రోజులు పోయాయి. ద్వందార్థ సంభాషణలు, అర్థనగ్న దృశ్యాలు, ఒళ్ళు గగుర్పొడిచే పోరాటాలు, విపరీతమైన శబ్దాలతో చిన్నపిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇద్దరు పిల్లలతో కనీసం వెయ్యి రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. పాప్‌కార్న్ పాకెట్ 100, శీతల పానీయాలు రెట్టింపు ధరలకు విక్రయించటంతో సామాన్యునికి అందని ద్రాక్షగా సినిమా ఉంది. అంతకంటే నటీనటులు, సాంకేతిక నిపుణులకు పారితోషికాలు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అవసరం లేకపోయినా విదేశాలలో చిత్రీకరణ వందల కోట్లతో భారీగాతీశామని కోట్లాది రూపాయలు ప్రచారానికి ఖర్చుపెడుతున్నారు. వాటిపై అదుపు చేయగలిగితే చిత్ర నిర్మాణం ధర తగ్గి అందరికీ ఆమోదయోగ్యంగా ఉం టుంది. గత సంక్రాంతికి భారీగా నిర్మించిన ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి కంటే సాదా సీదాగా తీసిన ‘శతమానంభవతి’ ఊహించని విజయం సాధించి పరిశ్రమకు మంచి పేరు తెచ్చింది. వందల కోట్లతో తీసిన చిత్రాలు పరాజయమైతే సంబంధిత నిర్మాత చిరునామా కోల్పోయే దుస్థితి నెలకొంది. కావున ఉన్నత న్యాయస్థానం ధరలు పెంపు సరికాదుగా తీర్మానించి నిర్మాణ ధర, మన రాష్ట్ర, దేశ ప్రాకృతిక అందాలు, నాగరికత, భావి పౌరులకు దేశభక్తి, పెద్దలయందు గౌరవం, మాతృభాషయందు మక్కువ పెంచేవిగా చిత్రాలు నిర్మిస్తే తెలుగు చిత్రాల ఖ్యా పెంచినవారు కాగలరు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
పెద్ద చిత్రాలు చేయాలి
గత ఏడాది చిన్న చిత్రాలు బాగా రాణించడం ముదావహం. చిన్న చిత్రాలతో ఆగిపోకుండా ఆ దర్శకులు జన బాహుళ్యం మెచ్చుకునే పెద్ద చిత్రాలు కూడా చేయాలి. అయితే కొమ్ములు తిరిగిన పెద్ద దర్శకుల ప్రతిభ, సృజనాత్మకత ఐదారు చిత్రాలతో మాయమైపోయి వాళ్ళు తమ చిత్రాలనే మళ్లీ మళ్లీ కాపీ కొట్టి తీయడం కనిపిస్తుంది. చిన్న చిత్రాల దర్శకుల సృజన, ప్రతిభ ఎంతకాలం ఎన్ని చిత్రాలకు పరిమితమవుతుందో కాలమే నిర్ణయించాలి.
-చంద్రిక, రాజేంద్రనగర్*