మీ వ్యూస్

ద్విపాత్రాభినయం మెప్పించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడిగా, డైలాగ్‌కింగ్‌గా మోహన్‌బాబుకు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్టయిల్‌ని ఏర్పరచుకున్నారు. వివిధ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని అలరించాయి. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించినన్ని పాత్రలు మరే నటుడూ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో! చాలా కాలం విరామం తర్వాత సొంత నిర్మాణ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం ‘గాయత్రి’. దీనికి మదన్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌బాబు ద్విపాత్రాభినయం ఆకట్టుకుంది. శివాజీ అనే పాజిటివ్ క్యారెక్టర్, గాయత్రి పటేల్ అనే నెగెటివ్ షేడ్‌తో కూడుకున్న పాత్రల్లో ఆయన నటన సూపర్. తన వాళ్లందరినీ కోల్పోయిన శివాజీ తండ్రీకూతుళ్ల నేపథ్యంలో సాగే కథ ఇది. దర్శకుడు మదన్ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ కొత్త కథనే ఎంచుకున్నారు. సెంటిమెంట్‌కు తోడు కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తపడ్డాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ భావోద్వేగాలతో కూడుకున్నది. కొన్ని పొలిటికల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయ. మోహన్‌బాబు పోషించిన శివాజీ పాత్ర సాధారణంగానే ఉన్నా, గాయత్రి పటేల్ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్ అయింది. విష్ణుతెరపై కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ చక్కటి నటనను కనబరిచాడు. శ్రీయ పాత్ర ఎమోషనల్‌గా ఉంది. జర్నలిస్ట్ పాత్రలో అనసూయ తన పాత్ర పరిధులు దాటకుం డా మెప్పించింది.
వర్మ పబ్లిసిటీ స్టంట్..
‘వెనె్నల’లో ప్రచురించిన ‘వర్మ పబ్లిసిటీ స్టంట్’ వ్యాసం చాలా బాగుంది. తన చిత్రాలు ఎలాగూ ఆడవు కాబట్టి సంచలన ప్రకటనలతో తను జీవించే ఉన్నానని చాటుకుంటాడాయన. వంగవీటి రంగ, బెజవాడ రౌడీలు అంటూ సంచలనం రేకెత్తించినా ఆ సినిమాలు ఆడలేదలు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ అనగానే తనూ ఆ చిత్రం తీస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేకెత్తించాడు. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం ప్రకటించగానే కాంగ్రెస్‌కు చెందిన దాసరి ఆ కథతో టీవీ సీరియల్ హిందీలో తీశాడు. దాన్ని చూసి ఉత్తరాదివారు నవ్వుకున్నారు. ఎన్టీఆర్ విశ్వామిత్ర కూడా ఫ్లాప్ అయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంచలనం కోసం కాక నిజాయితీగా తీస్తేనే ప్రజలు చూస్తారు.
-ప్రవీణ్, కాకినాడ
ఆలోచింపజేసింది
‘గమ్యంలేని టాలీవుడ్’ వ్యాసం బాగుంది, ఆలోచింపజేసింది. ఇప్పటి నంది స్థాయిలో కాకపోయినా ప్రపంచ వ్యాప్తంగా అవార్డులు వివాదాస్పదం అవుతూనే వుంటాయి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రముఖ పాత్ర వహించేవారినే అవార్డులు వరిస్తాయన్న వ్యాఖ్యను నిజం చేసే ఉదాహరణలెన్నో! రష్యా, చైనాలకు వ్యతిరేకంగా వచ్చిన నవలలకు నోబెల్ సాహిత్య అవార్డుకలు లభించాయి. భారత్‌ను ద్వేషించే వామపక్షుల రచనలకూ ఇతర బహుమతులొచ్చాయి. రచయితలకే కాక సామాజిక కార్యకర్తల్లో ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారికీ రామన్ మెగ్‌సేసే అవార్డులొచ్చాయి. అవార్డులిచ్చే సంస్థలకూ స్వార్థాలున్నాయని మరో వ్యాఖ్య!
-మరుదకాశి, కరప
నిజమే గళం విప్పాలి
‘గళం విప్పడం తప్పదుకాదు’ లేఖ చదివాక- నిజమే గళం విప్పాలి. కాని కమల్ గళం విప్పడం కాదు వామపక్షాలతో గళం కలిపి హిందూ ఉగ్రవాదం అన్నాడు. ప్రతి చిన్న సమస్యకు మోదీని నిందించే వర్గంతో గళం కలిపాడు ప్రకాశ్‌రాజ్. నిజానికి అతడు నిందించవలసింది కర్ణాటక ప్రభుత్వాన్ని. న్యాయం కోసం నిజాయితీగా, స్వతంగ్రా గళం విప్పితే మంచిదే. ఇద్దరూ స్వార్థ రాజకీయులతో గళం కలపడమే అనుమానాస్పదంగా వుంది. చిత్రసీమలోని నల్లధనం, మహిళల వేధింపులు, బూతు చిత్రాలకు వ్యతిరేకంగా గళం విప్పే సాహసం ఉందా వాళ్ళకి? గుంపులో గోవిందా లాగా గళం ఎత్తితే ఏం ప్రయోజనం?
-శాంతిచంద్రిక, సామర్లకోట
ఈ ప్రశ్నలకు బదులేది?
సినిమాల్లో వీళ్లు పాతకక్షలు తీర్చుకోవడానికి, కేసుల నుంచి బయటపడడానికి రాజకీయాల్లో చేరుతారు. అన్నయ్య పార్టీ (పిఆర్‌పి)కి ద్రోహం చేసినవారిని ఎవర్నీవదలను అని పవన్‌కళ్యాణ్ అనడం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ప్రవచించే అడిగే హక్కుతో ఈ ప్రశ్నలు అడుగుతున్నాం. ఈ ప్రశ్నలకు బదులేది? 1.కక్షలు తీర్చుకోవడానికే ఆయన పార్టీ పెట్టాడా? 2.ఇతర పార్టీలనుంచి పిఆర్‌పిలో చేరినవారు ద్రోహలు కానప్పుడు, పిఆర్‌పినుంచి బయటకు పోయేవారు ద్రోహలెలా అవుతారు? 3.మంత్రి పదవికోసం తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి ప్రజలందరికీ అన్నయ్య ద్రోహం చేయలేదా?
-ప్రేమజ్యోతి, శ్రీనగర్
రీఎంట్రీ అదిరింది..
‘్ఫ్లష్‌బ్యాక్’ శీర్షిక మళ్లీ మా అభిమాన రచయిత్రి సి.వి.మాణక్యేశ్వరి గారి రీఎంట్రీ అదిరింది. మాకు తెలియని అనేక విషయాలు తమ రచనల్లో పొందుపరుస్తున్న రచయిత్రికి నిజంగా హ్యాట్సాఫ్! ఆపాత మధురాలు జ్ఞాపకం తెస్తున్నాయి. విడుదల కాకమునుపే కొన్ని సినిమాలపై ప్రముఖ శీర్షికలతో పేజీలు పేజీలు రాయడం మాకు అంతగా నచ్చలేదు. కొత్తవారికి అవకాశం కల్పించగలరు. మాకు నచ్చినపాట ఆయా చిత్రాల బొమ్మలు ప్రింట్ చేయండి. పాతతరం నాటి హీరో హీరోయిన్‌లను బ్లోఅప్‌ను నెలకి ఒకసారి ప్రచురించగలరు. సి.వి.మాణిక్యేశ్వరిగారి చరవాణి కూడా ప్రకటించగలరు.
-లక్కరాజు శ్రీనివాసరావు, అద్దంకి
వెనె్నల కృషి
అభినందనీయం
వెనె్నలలో వారం వారం అలనాటి అపురూప చిత్రాల గురించి వివరిస్తూండడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రగతికి ఆంధ్రభూమి వెనె్నల కృషి అభినందనీయం. చక్కటి చిత్ర సమీక్షలు, సద్విమర్శలు నిష్పక్షపాత జర్నలిజానికి నిదర్శనం. ‘వెనె్నల’ సంపాదక వర్గానికి శుభాకాంక్షలు.
-ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం