మీ వ్యూస్

అభిరుచిలేని రచయిత పాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల విడుదలైన అజ్ఞాతవాసి చిత్రంలోని ‘‘కొడకా.. కోటేశ్వరరావు కరుసై పోతవురో’’ పాట రచయిత అల్పమైన ఆలోచనను, మనస్సును తెలుపుతోంది. ఇది అసలు అభిరుచి లేని రచయితలు రాసే పాటగా మనం పేర్కొనవచ్చు. పరమశివుని పేరైన కోటేశ్వరస్వామి మీద అనేకులు కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మ, కోటయ్య, కోటమ్మ తదితర పేర్లు పెట్టుకుంటారు. వ్యక్తుల పేర్లు పాటలో వచ్చే విధంగా పాటల రచయితలు రాయటం దురదృష్టకరం. గతంలో వ్యక్తుల పేర్లతో కాకుండా విశాల భావాలు, దృక్పథంతో రచయితలు రాసేవారు. ఉదాహరణకు ‘అప్పుచేసి పప్పుకూడు చిత్రంలోని ఒక పాటలో ఒక వ్యక్తి గుణాన్ని వక్రంగా చెప్పటానికి ఎంచుకున్న కాశీకి పోయాను రామా హరి.. గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి పాట ఎంతో హుందాగా ఉంటుంది. హిందీ గీతాల్లో కూడా ప్రస్తుత తీరు బాగా లేదనే చెప్పాలి. ‘‘మున్నీ బద్నాం హుయి’’ పాట వల్ల ముద్దుగా పిలుచుకునే ‘మున్నీ’ అను పేరుగల బాలికలు మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే! మరో చిత్రంలో ‘షీలా.. షీలాకి జవాని’ పాట కూడా వివాదాస్పదమైంది. ఇకనైనా పాటల రచయితలు చక్కని బుద్ధితో ఆలోచించి పాటలు రాయాలి.
- కప్పగంతుల వెంకట రమణమూర్తి, సికిందరాబాద్

రణ్‌వీర్‌సింగ్‌కే పేరు!
ఉత్తరాదిని ఒక హీరోయిన్ ఊపేస్తుంటే, దక్షిణాదిన మరో హీరోయిన్ దునే్నస్తోంది అంటూ ఓ ఛానల్ పూనకం వచ్చినట్టు షేక్ అయింది. ఇంతకూ విషయం ఏమంటే ఉత్తరాదిన పద్మావత్, దక్షిణాదిన భాగమతి సూపర్‌హిట్ అయ్యాయని ఆ చానల్ భాష్యం. పద్మావత్ ఇప్పటికే మన దేశంలో 250 కోట్లు విదేశాల్లో 200 కోట్లు కలెక్ట్ చేయగా భాగమతికి అంత సీన్ లేదు. వంద కోట్లు కూడా దాటలేక పోయింది. అనుష్క గొప్పగా నటించగా సినిమా విజయం సాధించింది. అంతే. పద్మావత్‌లో హీరోయిన్ కన్నా ఖిల్జీగా నటించిన రణ్‌వీర్‌సింగ్‌కే మంచి పేరు వచ్చింది.
- పి.శుభ, కాకినాడ, తూ.గో.జిల్లా.
వాస్తవానికి దగ్గరగా..!
ప్రతి ఆదివారం ఆంధ్రభూమి దినపత్రికలో వస్తున్న ‘వెనె్నల’ సినిమా సంచిక పాఠకులను ఎంతగానో అలరిస్తున్నది. కొత్తగా విడుదలయ్యే సినిమాలకు సంబంధించి వెనె్నల ఇచ్చే సమీక్షలు వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయి. వెనె్నలలో ఇచ్చే కవర్ స్టోరీలు చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ఆనాటి అపురూప చిత్రాలు గురించి ‘్ఫ్లష్ బ్యాక్’లో సి.వి.ఆర్ మాణిక్యేశ్వరి గారు అందిస్తున్న చిత్రాల వివరాలు వెలకట్టలేనివి. ఇంత చక్కగా వెనె్నలను రూపొందిస్తున్న ‘ఆంధ్రభూమి’ సంపాదక వర్గానికి శుభాకాంక్షలు.
-మార్టూరు అజయ్‌కుమార్,
రామచంద్రాపురం, గుంటూరు జిల్లా
ఒక స్టార్ కూడా
అవసరంలేదు!
రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి చూడు’ చిత్ర సమీక్షను ఆంధ్రభూమి ‘వెనె్నల’లో చదివాక అది పరమచెత్త సినిమా అని అర్థం అయ్యింది. అలాంటపుడు దానికి ఒక నక్షత్రం రేటింగ్ కూడా అవసరం లేదు. ఇకపై చెత్త చిత్రాలను సమీక్షించినపుడు వాటికి ఏ నక్షత్రమూ (ఒక్కటయినా) కేటాయించవద్దని మనవి.
- డి.ఎస్.శంకర్, నక్కలంక.
నవరస కళావల్లభుడు!
కులం, ప్రాంతం, వర్గంతో సంబంధం కానిది.. ప్రతిభావంతుడు అందరికీ బంధువే.. నటుడు కమలహాసన్ జాతీయ నటుడు విశ్వనటుడు.. నటన జన్మతః పొందిన నవరస కళావల్లభుడు తాను తమిళనాట రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో చిత్రసీమకు దూరమవుతున్నట్లు ప్రకటించటం.. ప్రేక్షకులకు, కళారాధకులకు నిరాశే. ఆర్థిక ఇబ్బందులతో మరుద నాయకన్ లాంటి చిత్రాలను తీయలేకపోయాడు. దశావతారాలలో వైష్ణవ భక్తునిగా ఆ పది నిమిషాల చిత్రీకరణ చాలు.. నిజానికి ఆ పాత్రకు అవార్డు ఇచ్చి తీరాలి. ఆస్కార్ ఆసియా వాసులకివ్వరు. సంకుచిత రాజకీయాలు ప్రక్కన పెట్టి సినిమా రంగానికి సంబంధించి భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారం ఇచ్చి మహానటుడిని గౌరవించాలి.
- శ్రీపాద మేఘన,
శ్రీరామపురం, భీమవరం, ప.గో.జిల్లా.