మీ వ్యూస్

మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరి పరిస్థితి అదే..
మాలీవుడ్, బాలీవుడ్‌ల నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన భామలు తొలి ఒకటి రెండు చిత్రాల్లో మిలమిల మెరిసేసరికి మన మీడియా మూర్ఛపోయి ఆ తారలు ఎక్కడికో వెళ్లిపోతారంటూ అంచనాలు పెంచేస్తారు. మూడు నాలుగు చిత్రాలతో వారి ప్రభ తగ్గిపోయి ఐరెన్ లెగ్ అనిపించుకొని ఫేడ్ అవుట్ అయిపోతారు. అందాల రాక్షసిగా అలరించిన లావణ్య రెండు హిట్లు, మూడు యావరేజ్‌లు సాధించాక వరుస ఫ్లాప్‌లు మూటగట్టుకొని ఫేడ్ అవుట్ పరిస్థితికి చేరుకుంది. ఇద్దరు ముగ్గురు తప్ప దిగుమతి అయిన భామలందరి పరిస్థితి అదే.
-కృష్ణ, కొండయ్యపాలెం
శిరోభారం!
పెద్దనటుల చిత్రాలను అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణ వ్యయం అతి భారీగా ఉండడంతో కొన్ని సినిమాలకు ప్రేక్షకాదరణ బాగా లభిస్తున్నప్పటికీ బయ్యర్లకు లాభాలు రావడంలేదు. దీంతో సినిమా విజయం సాధించినా ఆ సంతోషం అటు అభిమానుల్లోనూ, ఇటు బయ్యర్లలోనూ కనిపించడంలేదు. నిర్మాతలు బయ్యర్ల పరిస్థితిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే సినిమాకు మంచి కథ, కథనాలు, సంగీతం పైనే ముందు దృష్టిసారించాలి. చిత్ర నిర్మాణ సమయంలో దీనికి అనవసరంగా ఎక్కువ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారేమో ఆలోచించచుకోవాలి. అవసరాన్ని బట్టి ఎక్కువ, తక్కువ బడ్జెట్‌లను కేటాయించాలి. నిర్మాణ వ్యయం తగ్గించడం ద్వారా బయ్యర్లనూ, ప్రేక్షకులనూ సంతృప్తిపరచాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
అన్నీ మిస్టరీలే..!
మద్యం సేవించి పై అంతస్థు కిటికీలోంచి పడి మరణించిందన్నారు దివ్యభారతిని. నేడు అతిలోక సుందరి కూడా మద్యం సేవించి బాత్‌టబ్‌లో పడి మరణించిందంటున్నారు? సెలబ్రిటీలు సరే- రాజకీయనాయకుల చావులు కూడా మిస్టరీగానే వుంటున్నాయి. ఆ రోజుల్లో మాయమైన సుభాష్ చంద్రబోస్, ఇరవై నాలుగు గంటలపాటు కనిపించకుండా పోయిన సిఎం, పొరుగుదేశాన్నించి పి.ఎం శాస్ర్తిజీ పార్థివ దేహాన్ని తీసుకొచ్చి దౌత్య సంబంధాలు దెబ్బతింటాయంటూ పరిశోధన మానిన మనవాళ్ళు.. ఎవరికి రక్షణ వుంది?
-వి. అనూరాధ,
విజయవాడ
ఫ్యాషన్ అయింది..!
‘గెడ్డాల హీరోస్’ లేఖ చదివాక.. నేటి మహిళ జుట్టు విరబోసుకొని బొట్టు, కాటుక, గాజులు లేకుండా కనిపించడం ఫ్యాషన్ అయింది. అబ్బాయిలు తుప్ప జుట్టు, ఇరుకు జీన్స్, పిచ్చిరాతలున్న షర్టులు ధరించడం ఫ్యాషన్. అబ్బాయిలు మగాడిలా కనిపించాలంటే మొలకల్లాంటి గరుకు గడ్డం ఉండాలని అమ్మాయిల అభిప్రాయం. నున్నగా గడ్డం గీసుకుంటే పేడి మూతిలా కనిపిస్తుందని గాళ్‌ఫ్రెండ్సు చెప్తుంటారు. అందువల్లనే అబ్బాయిలు గడ్డాలతో కనిపించి ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకుంటున్నారు.
-ప్రవీణ్, కాకినాడ

అవును.. ప్రమాదకరమే!
కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు నిర్మించడం లాభార్జన కోసమే. సినిమాలు తీసే వారందరూ చిత్ర పరిశ్రమ సభ్యులే. భారీ సినిమాలు పోటీ పడి ఒకే రోజున విడుదల చేస్తే, ప్రేక్షకుడు సెలక్టివ్‌గా అభిమాన హీరో సినిమానే చూస్తాడు. కారణం- విడుదలైన అన్ని సినిమాలు అవి ఆడే ఒకే వారంలో చూడాలంటే వందల వేల రూపాయలు ఖర్చవుతుంది. విడుదలలో తేడాలుంటే అన్నీ చూసే అవకాశం వుంటుంది. ఈ పోటీతత్వం ఈ నాటిది కాదు. గతంలో కృష్ణ కురుక్షేత్రం, రామారావు డివిఎస్ కర్ణ ఒకే రోజు విడుదల చేయడంవల్ల కురుక్షేత్రం దెబ్బతింది. కృష్ణ దేవదాసు విడుదల సమయంలోనే ఎఎన్‌ఆర్ దేవదాసును విడుదల చేసి అనారోగ్య వాతావరణాన్ని సృష్టించారు. ప్రతి సినిమా విడుదలకు కొంత గ్యాప్ ఉండాలనే నిర్ణయాన్ని సంఘాలు తీసుకోవాలి.
-ఎన్.ఆర్.లక్ష్మి, సికింద్రాబాద్

నవ్వొస్తోంది..!
‘మనసుకు నచ్చింది’ సినిమా మనసుకు నచ్చలేదు, బాగోలేదు అంటూ సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చింది వెనె్నల. తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్ అమైరా మాత్రం ఆ కథకు బాకా కనెక్ట్ అయ్యాను. కథ బాగా నచ్చి చేశాను అంటూ ఆ చిత్రాన్ని పొగిడేసింది. కొత్తగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన భామలకు తెలుగు రాదు. ఇండస్ట్రీ అంతా తెలిసినట్టే ఇంటర్వ్యూలలో చెప్పేస్తూ వుంటారు. వాళ్లు చెప్పేది ఇంగ్లీషులో లేదా హిందీలో. మనవాళ్లకి ఆ భాషలో, ఉచ్ఛారణలో ప్రావీణ్యం ఉండదు. అందుకే ఇంటర్వ్యూలు చదివితే నవ్వొస్తుంది.
-జె.ప్రేమజ్యోతి, శ్రీనగర్
వికసిత కమలం..
భారత చలనచిత్ర సరోవరంలో వికసిత కమలం కమల్‌హాసన్.. సినీ వినీలాకాశంలో రజనీకాంతుడు చంద్రుడే.. తమిళనాట అగ్రనటులైన వీరు దేశానికే మేరువులు.. బాలచంద్రుడుకి రెండు కళ్ళులా భిన్న ధృక్పథాలు.. నటనా శైలులు వీరివి. ఒకరు హేతువాది మరొకరు ఆధ్యాత్మిక వాది. రజనీకి అభిమాన నటుడు కమల్‌హాసన్. కమల్‌కు సినీ ఆప్తుడు రజని.. ఎన్నో సందర్భాలలో కలిసి పోరాడారు. కలిసికట్టుగా స్పందించారు. దక్షిణాదివారు కావడంతో వీరికి రావలసినంత గుర్తింపు రాలేదేమో. కమల్‌హాసన్‌కు భారతరత్న ఇవ్వవచ్చు. గొప్ప నటులు పెద్ద వయసులో చూపిన ప్రతిభ కమల్ యువకుడిగానే చూపించి ఆశ్చర్యపరిచాడు. జయలలిత ఓ నియంతగా వున్న కాలంలో వీరు మరుగున పడ్డారు. నేడు వీరు రాజకీయాలలోకి రావడం శుభకరం.
-అల్లూరి వివేక వర్మ, భీమవరం