మీ వ్యూస్

మాయాజాలమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో సెట్స్ మైమరిపించే మాయాజాలమే. అయితే గొప్ప సెట్స్ వున్న ఎన్నో చిత్రాలు ఢాం అనడం చూశాం. ‘‘అబ్బా! సెట్స్ ఎంత బాగున్నాయో!’’ అని ప్రేక్షకుడు అన్నాడంటే ఆ ఆర్ట్ డైరెక్టర్ ఫెయిల్ అయినట్టే అని ఒక కళా దర్శకుడే అన్నాడు. సెట్ ఎప్పుడూ కథని, పాత్రల్ని డామినేట్ చేయకూడదు. జానపద, పౌరాణిక చిత్రాల్లో గొప్ప సెట్స్ అవసరమే గాని సామాన్య ప్రజలు నివసించే ఇళ్లను రాజమహల్‌లాగా చూపించడం తగదు. ఇపుడు బిగ్ బడ్జెట్ చిత్రాల్లో హీరో ఇమేజ్‌కి తగినట్టు పెద్ద సెట్స్, ఖరీదైన అలంకరణలు చేస్తుండటం అసహజంగా ఉంటుంది అని దర్శకులు గ్రహించాలి.
-సంపూర్ణ,
సాంబమూర్తినగర్
మూఢ నమ్మకాలను వ్యాప్తి చేస్తారా?
గ్రామీణ ప్రాంతాలలో మూఢ నమ్మకాలు వేళ్ళూనుకొనిపోయాయి. చేతబడి, బాణామతి, మంత్ర తంత్రాలు, దెయ్యలు ఈ నమ్మకాలు చాలా గ్రామాలను వీడటంలేదు. వీటిని అసత్యాలని ప్రజలన నమ్మించడనాకి విజ్ఞానవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ మన సినిమా వారు ఇందుకు విరుద్ధంగా మూఢ నమ్మకాలను వ్యాపింపజేస్తూ సినిమాలు తీస్తున్నారు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి వ్యాపార దృక్పథంతో దెయ్యల భూతాల సినిమాలు, మంత్ర తంత్రాలు, చేతబడి, బాణామతులు తదితరాలు కుప్పించి అడపాదడపా సినిమాలను తీస్తున్నారు. మీ వ్యాపారంకోసం సమాజాన్ని అడ్డదారి పట్టిస్తారా? ప్రజలలో భయోత్పాతాలు సృష్టిస్తారా? ఇలాంటి చిత్రాలను సంపూర్ణంగా నిషేధించాలి. సమాజాన్ని సన్మార్గంలో పెట్టే కథ, కథనాలతో తెలుగు సినిమాలు రావాలి.
-సరికొండ శ్రీనివాసరాజు,
వనస్థలిపురం
స్థలా భావమా?
కొన్ని సినిమాలు వెనె్నలలో సమీక్షింపబడడం లేదు. స్థలాభావమా? లేక అవి సమీక్షకు కూడా అర్హమైనవి కావని అనుకోవాలా? ఈ విషయంలో పాఠకులకు ఒక స్పష్టతను ఇవ్వవలసిన అవసరం ఉంది.
- డొక్కా నీలకంధరుడు, వక్కలంక
పోటీ ప్రమాదకరమే..!
ఫిబ్రవరి 25 వెనె్నలలో వచ్చిన ప్రధాన వ్యాసం ‘పోటీ ప్రమాదకరమే’ ఆలోచించదగ్గదిగానే వుంది. ఈనాటి బడ్జెట్, మారిన కాలమాన పరిస్థితులనుబట్టి బడా చిత్రాల పోటీ ప్రమాదకరమే అయి ఉండొచ్చు! భారీ చిత్రాల విడుదలకు సిద్ధమైనప్పుడు ఒక చిత్రం వారం ముందుకు రావడమో 10రోజులు వెనక్కు పోవడమో లాంటి సర్దుబాటు మన స్వర్ణయుగ సినీ కాలంలో లేదు. ఆనాటి అగ్ర నటులు అక్కినేని, నందమూరి చిత్రాల నిర్మాతలు ఇలాంటి అనుమానాలకు, భయాలకు ఏనాడూ తావివ్వలేదు. 1964 సంవత్సరం జనవరి 1వ తేదీన శంభూ ఫిలిమ్స్ ‘పూజాఫలం’, జనవరి 9న జగపతివారి ‘ఆత్మబలం’, అదే నెల 31వ తేదీన బాబూమూవీస్ ‘మూగమనసులు’ విడుదలయ్యాయి. ఈ మూడు ఆనాటి అగ్ర నటుడు అక్కినేని చిత్రాలే కావడం విశేషమేకదా! దేనికదే విజయం సాదించాయి. మరి ఆనాటి నిర్మాతలు కథమీద నమ్మకంతో తప్ప పోటీ అన్న భావనను రానీయలేదు. అదే 1965 సం.తీసుకుంటే జనవరి 1వ తేదీన అశోక్‌మూవీస్ ‘సుమంగళి’, 7వ తేదీన వాణీ ఫిలింస్ ‘నాదీ ఆడజనే్మ’, 14 జనవరి తేదీన విజయమాధవీ వారి ‘పాండవ వనవాసం’ విడుదలయినాయి. ఏ నిర్మాత జంకలేదు. చిత్రాల పట్ల, ప్రేక్షకుల పట్ల ఆయా నిర్మాతలకున్న బ లం అలాంటివి. పై చిత్రాల్లో అక్కినేని చిత్రం ఒకటి, నటరత్న రామారావు చిత్రాలు రెండు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు విజయం సాధించి శత దినోత్సవాలు జరుపుకున్నాయి. కథలో దమ్ము, కథనంలో నవ్యత్వం ఉంటే ఏ నిర్మాత భయపడవలసిన అవసరం లేదు. కోట్లు ఖర్చుచేసి విడుదల తేదీ దగ్గరపడటం అన్నది ఏమిటో అర్థంకాని విషయం! కంటెంట్ మీద నమ్మకంతో రెండు కొదమసింహాల లాంటి భారీచిత్రాల మధ్య విడుదలై భారీ విజయం సాధించిన శతమానంభవతి, మహానుభావుడు లాంటి చిత్రాలు పాత కాలంనాటి పరిస్థితుల్ని జ్ఞప్తికి తెచ్చాయి. కథలో దమ్ముతోపాటు నిర్మాత కూడా దమ్మున్నవాడయి ఉండాలి అప్పుడే మంచి చిత్రాలు మంచి టైంలో వస్తాయి, మురిపిస్తాయి, అలరిస్తాయి!!
- తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం

గొప్ప నటుడే..!
వికసిత కమలం కమల్‌హాసన్ గొప్ప నటుడే. అయితే గొప్ప నటుడు గొప్ప రాజకీయవేత్త కానక్కరలేదనడానికి మన రాష్ట్రంలోనే మెగా ఉదాహరణ ఉంది. ఎంతటి మిత్రులైనా రజనీ, కమల్ ఒకే పార్టీలో ఉండలేరు. ఇప్పటికే తమిళనాట రెండు బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. రజనీ, కమల్, దినకరన్ పార్టీలుల వస్తే ఓట్లు చీలిపోయి ఎవరు గెలుస్తారో చెప్పలేని స్థితి వస్తుంది. అదీకాక కమల్ ఏ సినిమా తీసినా కోర్టు కీడ్చే బలమైన వ్యతిరేక వర్గం ఉందక్కడ. ప్రపంచం అంతా కమ్యూనిస్టు దేశాలు కూడా వదిలేసిన కమ్యూనిజం తనకిష్టం అంటాడు కమల్. అతడు తమిళనాడు సిఎం అయ్యేది కష్టమే.
-మరుద కాశి, కరప