మీ వ్యూస్

జీవించాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్ జీవించాడు. ఆ పాత్రకు జీవం పోసేలా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దిన విధానం అందరీన విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ఏ ఒక్క పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేనికదే సాటి. రంగస్థలంలో నటించిన ప్రతీ ఒక్కరూ వారి వారి పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మొత్తం మీద చాలా కాలం తర్వాత తెలుగు చిత్రసీమలో ఒక మంచి చిత్రం చూశామన్న తృప్తి కలిగింది.
-ఆర్.వి జయ, కదిరి
అనంతపురం
అది నిజం కాదు..
ఫిబ్రవరి 25 వెనె్నలలో ‘నాకు నచ్చిన పాట’ శీర్షికలో అన్నపూర్ణవారి ‘పూలరంగడు’ 22. 7.67న విడుదలైందని వచ్చింది. అది నిజం కాదు. 1967వ సంవత్సరం అక్కినేనికి చాలా గడ్డు సంవత్సరం. ఆ సంవత్సరం విడుదలైన భరణీవారి ‘గృహలక్ష్మి’, విక్రంప్రొడక్షన్స్ ‘వసంతసేన’, లలితా శివజ్యోతివారి ‘రహస్యం’, పద్మశ్రీవారి ‘ప్రాణమిత్రులు’ విడుదలై భారీ అపజయాల్ని మూటగట్టుకొన్నాయి. అక్కినేని పనిఅయిపోయిందన్న ఊసులు గుసగుసలాడటం మొదలయింది. అక్కినేని అభిమానులు కూడా ఆందోళనలో పడ్డారు. అటువంటి పరిస్థితిలో సంవత్సరాంతాన విడుదలయింది అన్నపూర్ణావారి ‘పూలరంగడు’. తేదీ 24.11.67న విడుదలైన ఆ చిత్రం 11 కేంద్రాలల్లో శత దినోత్సవం, 2 కేంద్రాల్లో రజతోత్సవం పూర్తిచేసుకుని అక్కినేనిని మళ్లీ అగ్రసింహాసనాధీశుడ్ని చేసింది. ఆనాటి పాతతరం వారికి ఈనాటి నవతరం వారికి వారధిగా నిలుస్తున్న మా ‘వెనె్నల’కు అభినందన చందనాలు. ముఖ్యంగా మాణిక్యేశ్వరి లాంటి వారి ద్వారా పాత చిత్రాల నిర్మాణ విలువల్ని, పాతతరం నటుల క్రమశిక్షణా విశేషాలను ఈతరంవారికి అందిస్తున్న ‘వెనె్నల’కు సదా వందనాలు. నెలకొకసారి కనిపించే ఆ పున్నమి వెనె్నలకన్నా, వారంవారం మమ్మల్ని మురిపించే ఈ వెనె్నలలో ఎంతో హాయిని పొందుతున్నాము. ఆపాత మధురాలను మరింత శోభితంగా ఈనాటి ప్రేక్షకులకు అందించే సారధి కావాలని వెనె్నల మరింత వెనె్నలతో అలరారాలని కోరుకుంటున్నా.
-తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం
ఇలా ఇంకెన్నాళ్లు?
ఈమధ్య వస్తున్న ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం. పాత చింతకాయ పచ్చడి కథ. బోరింగ్ స్క్రీన్‌ప్లే.. సాగతీత. ఫస్ట్ఫా ఓకె అయితే సెకెండాఫ్ బాగుంది. అసందర్భంగా కథనానికి అడ్డువచ్చే పాటలు. మితిమీరిన హింస. ఇవే తప్ప బాగుంది అన్న చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. బాలీవుడ్‌ను తీసుకుంటే కథలో కొత్తదనం, ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు. వీటిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది. పాత చిత్రాల కథల ఫార్ములా వర్కవుట్ కావడంలేదు. కాబట్టి కథ కథనాల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. శర్వానంద్, నాని, వరుణ్‌తేజ్ లాంటి హీరోలు పెద్ద హీరోలు ఈమధ్య ప్రేక్షకుల అభిరుచినిబట్టి కథకు ప్రాధాన్యతనివ్వడం హర్షణీయం. ప్రతి ఒక్క దర్శక నిర్మాత ప్రేక్షకుల నాడిని పసిగట్టి మంచి కథ, సంగీతం, సందరోభచితమైన పాటలతో సినిమాలను తీస్తే బాగుంటుంది.
-ఎస్. శ్రీనివాసరాజు, హైదరాబాద్
ఏం చేస్తాం?
రెండుని బై అని మూడుని ట్రై అని వ్యవహరిస్తారు. అందువల్ల ఇద్దరు స్టార్లు ఉన్న చిత్రాన్ని బైస్టారర్ అని, ముగ్గురు స్టార్లు వున్న చిత్రాన్ని ట్రైస్టారర్ అని అనడం సబబు. ముగ్గురుకంటే ఎక్కువమంది స్టార్లున్నపుడు మల్టీస్టారర్ అ నాలి. కాని ఇద్దరు స్టార్లున్నా మల్టీస్టారర్ అనేస్తున్నారు. ఏం చేస్తాం? భాషను వ్యాకరణాన్ని పట్టించుకోవడంలేదు మనవాళ్లు. పదుగురాడు మాట పాటియై ధరాజెల్లు గదా!
-అయోధ్య రామ్, పెద్దాపురం
ఎంత గొప్పవారైనా..
నాగయ్య, శ్రీదేవి లాంటి ప్రఖ్యాతులు మరణిస్తే వారు లేని లోటు తీరనిది అని యథాలాపంగా అందరూ అనేస్తారు గాని అది నిజం కాదు. నాగయ్య నటించిన పాత్రలు తనూ చేయబోయి బొక్కబోర్లాపడిన అక్కినేని, భక్తుడు విప్రనారాయణ పాత్ర గొప్పగా చేసాడు. ఎన్టీఆర్ కూడా పాండురంగ మహాత్మ్యంలో భక్తుని పాత్ర చేసి ప్రేక్షకుల కంటతడి పెట్టించాడు. బాహుబలిలో శ్రీదేవి చేయనన్న పాత్రను రమ్యకృష్ణ అమోఘంగా పోషించగా, అటువంటి పాత్రనే తమిళ పులిలో చేసి శ్రీదేవి అభాసుపాలయింది. ఎంత గొప్పవారైనా వారి లేని లోటు తీరనిది అనుకోనక్కరలేదు.
-కె.సుభాష్, శ్రీనగర్
ఇవ్వరనడం సరికాదు..
మీ వ్యూస్‌లోని ‘సకల కళావల్లభుడు’ లేఖలో ఆసియావాసులకు ఆస్కార్ అవార్డు ఇవ్వరనడం సరికాదు. ఆస్కార్లు కేవలం ఆంగ్ల చిత్రాలకే. ప్రాంతం, దేశంతో నిమిత్తం లేకుండా ఆంగ్ల చిత్రాల్లో పనిచేసే అందరూ అవార్డుకి అర్హులే. ఆంగ్ల చిత్రాల్లో పనిచేసి ఎ.ఆర్.రెహమాన్ సంగీతానికి రెండుసార్లు, భాను అతయా (కాస్ట్యూమ్స్), పూకుట్టి (సినిమాటోగ్రఫీ)కి ఆస్కార్ సాధించినవారు భారతీయులే. ఆంగ్ల చిత్రం తీయకపోయినా సత్యజిత్‌రాయ్‌కి గౌరవ ఆస్కార్ లభించింది. ఆయనా భారతీయుడే కదా!
-సోనాలి, సూర్యారావుపేట
సూపర్ దర్శకుడు!
ఆచి తూచి అడుగులు వేస్తూ ఒక దర్శకుడిగా మంచి చిత్రాలు నిర్మించాలన్నదే సుకుమార్ కల. అందుకే ఆయన తీసిన సిని మాలన్నీ ఎంతో విభిన్నంగా వుంటాయ. ప్రతీ చిత్రానికి దర్శకుడిగా సుకుమార్ పడు తున్న తపన ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఆయన మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఆశ.
-కె.విజయలక్ష్మి, మహబూబ్‌నగర్