మీ వ్యూస్

ఈ తారలను విమర్శించనేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో కీర్తిప్రతిష్ఠలార్జించి ‘అక్కడ కథలు నచ్చడంలేదు’ అంటూ బాలీవుడ్‌కి చెక్కేసిన రకుల్‌పై కొన్ని చానల్స్ నిప్పులు కక్కాయి. ఇక్కడ పేరు రాగానే అక్కడకు వెళ్లి స్థిరపడిన వాళ్లెందరో ఉన్నారు. అది తప్పు కాదు. వైజయంతిమాల, హేమమాలిని, వహీదా, శ్రీదేవి అలా చేసినా ఎవరూ విమర్శించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీదేవి తెలుగు చిత్రం బాహుబలిని కాదని తమిళ కత్తిలో నటించినప్పుడూ ఎవరూ విమర్శించలేదు. ఇప్పుడు ఇలియానా, తాప్సీ, రకుల్‌లను విమర్శించనేల? పక్షులు, పశువులే కదా మనుషులూ పచ్చగా కనిపించే చోటుకి వలసపోవడం సహజం! మన పిల్లల్ని అమెరికా పంపేసి మురిసిపోవడంలేదా మనం!
-సుధీర్, శ్రీనగర్

కొత్త అనుభూతి!
‘రంగస్థలం’ చిత్రం కథ చాలా పాతదైనా సుకుమార్ అద్భుతమైన స్క్రీన్‌ప్లే, దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. హీరో రామ్‌చరణ్ చెవిటివాని పాత్రను ఎంచుకోవడమే గొప్ప సాహసం. కానీ ఎంతో అనుభవమున్న నటుడిలా ఆద్యంతం అత్యద్భుతమైన సహజ నటనతో అభిమానులకు పండగ చేశాడు. తోటి పెద్ద నటులు, విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఎలాంటి పాత్రలనైనా అవలీలగా నటించగలడు అని నిరూపించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆది, జగపతి బాబు, సమంత మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌పాయింట్. పల్లెటూరి అందాలు కనువిందు చేశాయి. మళ్లీ మళ్లీ చూడాల్సిన చిత్రం ‘రంగస్థలం’
-సరికొండ శ్రీనివాసరాజు
వేధింపులు ఎక్కువే..!
అన్నిరంగాల్లోనూ స్ర్తిలు లైంగిక వేధింపులకు గురికావడం వింటున్నదే. సినిమా రంగంలో మరికాస్త వేధింపులు ఎక్కువే. అయితే పురుషుల్లోనే కాదు స్ర్తిలలోనూ వికృత మనస్కులున్నారు. ఈ వికృత మనస్కులు పురుషుల్నికూడా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బయటపడ్డాడు. అమెరికానుంచి వచ్చిన ఆయన బంధువులు కొందరు సినిమా ఛాన్స్ ఇప్పించమని ఆయన్ని కోరగా వారిని కొందరి వద్దకు పంపగా వారు అక్కడకు వెళ్లి వచ్చి తమని స్ర్తి లేక పురుషులు కూడా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు చెప్పారట. సినిమా ఛాన్స్‌కోసం వెళ్లిన వారంతా పురుషులే! ఔరా! లోకం పోకడ!
-భాస్కర్, అశోక్‌నగర్

ఆ మాటల్లో నిజం..
చేసినవి కొద్ది సినిమాలే అయినా ముక్కుసూటిగా ధైర్యంగా మాట్లాడుతుంది ఆండ్రి యా. ఒక్క చిత్రం హిట్ అయితే చాలు హీరోని సూపర్‌స్టార్ అనేస్తారు. హీరోయిన్‌కి ఆ స్థాయి ఎన్నటికీ దక్కదు. హీరో చుట్టూ నడుం ఊపుతూ డాన్సులే గతి హీరోయిన్లకు. బికిని, లిప్‌లాక్‌లు వారి కర్మ. నటనకు ఆస్కారం ఇవ్వరు. టాలీవుడ్‌కన్న కోలీవుడ్, మాలీవుడ్‌లు నయం. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు లభిస్తాయి. నిజానికి నయనతారను సూపర్‌స్టార్ అనొచ్చు కాని అనరు అంటూ తన ఆవేదనను వెల్లడించింది ఆండ్రియా. ఆమె మాటల్లో ఎంతో నిజం ఉందనిపిస్తోంది కదా!
-జె.జ్ఞానబుద్ధ, సిద్ధార్థ్‌నగర్

ఈజీ కాదన్నమాట..!
పాలిట్రిక్స్ ఈజీకాదన్నమాట నిజమే. సినీ రాజకీయ రంగాలు రెండూ కలిసి వచ్చింది చాలాకొద్దిమందికే. ఓటుని అమ్ముకోవడం తగదు అంటున్నాడు కమల్. మనీ, మద్యం ఇవ్వకపోతే ఎంతమంది అతనికి ఓట్లు వేస్తారో చూడాలి. అంతేకాక ఉత్తరాది నుంచి దక్షిణాది ఆరు రాష్ట్రాల్ని వేరుచేయాలంటూ విభజన విత్తులు నాటుతున్నాడు. రజనీ ఇంతవరకు తనపాలసీ వెల్లడించలేదు. నటులు రాజకీయాల్లో చేరితే దేశం నాశనం అవుతుందన్న ప్రకాశ్‌రాజ్ కెసిఆర్‌తో కలిశాడు. అతడు కర్ణాటక ఫెడరల్ ఫ్రంట్‌కి అధినేత అవుతాడని అభిమానులు అంటున్నారు. నటుల మంద ఎక్కువ అయితే మజ్జిగ పలుచుబడుతుంది మరి.
-పి.ఎస్.లక్ష్మి, బృందావనం

1980 నేపథ్య చిత్రంకాదు!
రామ్‌చరణ్ చెవిటి చిట్టిబాబుగా, సమంత రామలక్ష్మిగా వచ్చిన రంగస్థలం 1980 నేపథ్య చిత్రం కాదు. నేడు జరుగుతున్న అవకాశ రాజకీయాలకు చెంపపెట్టుగా దర్శకుడు సుకుమార్ చిత్రాన్ని రాజకీయ రంజకంగా సినిమా తీశారు. ప్రెసిడెంట్ పదవి కోసం వేసిన నామినేషన్ దృశ్యాలు, ఆఖరి క్లైమాక్స్‌లో తనను నమ్మించి తన అన్న మరణానికి కారకుడైన ఎంఎల్‌ఏ ప్రకాశ్‌రాజ్‌ను చంపే దృశ్యం హైలెట్‌గా వుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో సమంత డీ-గ్లామరైజ్ పాత్రలో బాగా నటించింది. చిట్టిబాబుగా రామ్‌చరణ్‌లోని నటుడిని బయటకు తెప్పించింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలలో రంగమ్మ మంగమ్మ పాటలో రామ్‌చరణ్, సమంత అదరగొట్టారు. నేటి రాజకీయ నేపథ్యంలో తమ పదవికోసం నేతలు ఎలా స్వార్థంగా ఉంటారో ప్రకాష్‌రాజ్ పాత్ర ద్వారా దర్శకుడు మనకు కళ్లు తెరిపించాడు. ఆది పినిశెట్టి పోషించిన అన్న పాత్ర బాగుంది. సీనియర్ నరేష్, రోహిణిలు తమ కొడుకు మరణించే సన్నివేశంలో కన్నీరు కురిపించే నటన పాట ద్వారా ఆకట్టుకున్నారు. రామ్‌చరణ్‌కు రంగస్థలం మెగాహిట్ అని చెప్పవచ్చు.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి
సినీ సమాహారం!
ప్రతి ఆదివారం వెలువడుతున్న ఆంధ్రభూమి సినిమా అనుబంధం ‘వెనె్నల’ విభిన్న సకల సినీ సమాహారంగా విలసిల్లుతోంది. మొదటి పేజీ కథనాలు, రెండో పేజీ ఫ్లాష్‌బ్యాక్ విషయాలు, మూడో పేజీ సినిమాల రివ్యూలు, నాలుగో పేజీ ఆసక్తికర విశేషాలు వెనె్నలకు ఆభరణాలు. వారం వారం వెనె్నల మమ్మల్ని ఎంతో అలరిస్తోంది.
-శివలెంక చంద్రశేఖర్, హైదరాబాద్