మీ వ్యూస్

వనెని తెచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సందేశాత్మకంగా నిర్మించిన ‘రంగస్థలం’ చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంది. రామ్‌చరణ్ కెరీర్‌లో మరో మలుపు ఈ చిత్రం కథ సరికొత్తదనంతో బావుంది. సమంత నటన బావుంది. సుకుమార్ దర్శకప్రతిభ వనె్న తెచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని చిత్రం ‘రంగస్థలం’.
-ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం
మెప్పించే చాకచక్యం..
మనసుల్ని కదిలించేది పల్లెటూరి నేపథ్యమే అనడం సరికాదు. పట్నవాసులైనా, పల్లెవాసులైనా ఆ ప్రజల వ్యక్తిత్వాలు చక్కగా తీర్చిదిద్ది వారిమధ్య ఆప్యాయతలు, అనుబంధాలు, అపార్థాలు ప్రేక్షకుల హృదయాల్లోకి ఎక్కేటట్లు చిత్రీకరిస్తే ఆ చిత్రం హిట్ అవుతుంది. బొమ్మరిల్లు, బిచ్చగాడు, రఘువరన్ చిత్రాలు పల్లె నేపథ్యం లేకపోయినా హిట్ అయ్యాయి. పల్లె నేపథ్య చిత్రాలూ ఫట్‌మన్నాయి. ప్రేక్షకుల్ని మెప్పించే చాకచక్యం దర్శకులకు ఉండాలి. అది పల్లె నేపథ్యమా పట్నం నేపథ్యమా అనేది ముఖ్యంకాదు.
- శాంతి చంద్రిక, సామర్లకోట
అన్ని చిత్రాలను సమీక్షించండి!
‘వెనె్నల’ కోసం చకోర పక్షుల్లాగ ఎదురుచూసే మాకు ఈమధ్య కొంచెం నిరాశ కలుగుతున్నది. కారణం విడుదలైన అన్ని చిత్రాలనూ సమీక్షించక పోవడం. మీ కారణాలు మీకు వుండవచ్చును. కనీసం చిత్రం పేరు, పక్కన దానికి ఎన్ని నక్షత్రాలు అన్నవైనా ప్రచురిస్తే బాగుంటుంది.
-డొక్కా చంద్రశేఖర్, వక్కలంక
సందేశాత్మక చిత్రాలే రావాలి!
నాటక రంగం ముందు మొదలై ఆ తరువాత సినిమా ప్రారంభం అయింది. అయితే నాటక రంగం ఎందుకు పుట్టింది? ఆ తరువాత సినిమా ఎందుకు పుట్టింది? అని ఆలోచిస్తే పౌరాణిక గాథలు, చారిత్రక గాథలు పండితుల నుండి పామరుల వరకూ అందరికీ తెలియాలని అంతేకాదు సమకాలీన సమాజంలో వివిధ సమస్యలను, కుటుంబ సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను కథావస్తువుగా తీసుకొని మొదట్లో సినిమాలు వచ్చేవి. అలాగే కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకోవడానికి వినోదాత్మక చిత్రాలు వచ్చేవి. రానురాను నిర్మాతలలో వ్యాపార దృక్పథం ఎక్కువై ప్రేమకథా చిత్రాలు, హీరో ఇమేజ్ ఆధారంగా కథలు, దానికనుగుణంగా డ్యూయేట్లు, ఫైటింగ్స్ దట్టించి, సినిమాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా అడపాదడపా హింస, అశ్లీల చిత్రాలు, ద్వంద్వార్ధ చిత్రాలు రావడం శోచనీయం. ఈ పద్ధతి మారాలి. నిర్మాతల, దర్శకుల, కథానాయకుల దృక్పథం మారాలి. ప్రతి సినిమా సందేశాత్మకంగా, సమాజాన్ని మంచి దారిలోపెట్టే కథలతో రావాలి.
- సరికొండ శ్రీనివాసరాజు,
వనస్థలిపురం
వివాదాలు మామూలే!
‘వివాదాలు మామూలే’ వ్యాసంలో కర్ణిసేన దీపిక, భన్సాలీలను చంపిన వారికి బహుమతి ప్రకటించడాన్ని అధిక్షేపించారు. అయితే మన దేశంలో వాక్ స్వాతంత్య్రం ఎక్కువ. సిపిఐ నారాయణ మన ప్రధానిని ఎన్నిసార్లు చంపినా ఫర్వాలేదు అన్నాడు. యుపిలో ఒక ముస్లిం ఎంపీ మోది తన నియోజకవర్గంలో అడుగుపెడితే ముక్కలుగా నరికేస్తానన్నాడు. కాని ఎవరూ పట్టించుకోలేదు. దీపిక, భన్సాలీ కూడా హడలిపోలేదు. ఆవేశం పట్టలేక వాగడం అందరికీ బాగా అలవాటైపోయింది. తమాషా ఏమంటే మన దేశంలో భావస్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారని మేధావులు విదేశాల్లో విమర్శిస్తూ ఉంటారు!
- సత్య, కరప
నిజమా..అబద్ధమా
పట్టించుకోరు..
‘వివాదాలు మామూలే’ చదివాక- మనం చదువుకున్నదే వక్రీకరణ చెందిన చరిత్ర. భారతీయ చరిత్రను కమ్యూనిస్టులు ఒక విధంగా రాస్తే మనల్ని పాలించిన బ్రిటిషర్లు మరోలాగ బాధిత భారతీయులు మరోలాగ రాస్తారు. కాలగమనంలో నిజాలు కనుమరుగై అబద్ధాలు నిజాలుగా చలామణీ కావచ్చు. టిప్పుసుల్తాన్, నైజాం నవాబులు ఎంత క్రూరులో అనుభవించినవారు చనిపోయినా వారి కుటుంబీకులు చెప్తారు కాని టిప్పుని హీరోని చేసి జన్మదినాలు జరిపిస్తున్నది కర్ణాటక ప్రభుత్వం. తెలంగాణ సిఎం నైజాం నవాబుని దేవుడ్ని చేసింది. సినిమా తీసేవారు తమకు నచ్చినదాన్ని హైలైట్ చేస్తారు, నిజమా అబద్ధమా అని పట్టించుకోరు.
- శాంతిసమీర, వాకలపూడి