మీ వ్యూస్

భరత్..అదరగొట్టాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్ర పోషించిన ‘్భరత్ అను నేను’ చిత్రంలో మహేష్ స్టైల్ సీఎంగా టక్ చేసుకునే పాత్రలో ప్రిన్స్‌గా కనబడడం సంతోషం. ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్ళేవారిపై సీఎం పాత్ర ద్వారా మన దేశంలో రయ్యిరయ్యిమని సిగ్నల్ దాటి వెళ్ళేవాహన చోదకులకు 20,000 ఫైన్ బావుంది. క్రమశిక్షణ లేని మన దేశంలో భరత్ చేసినట్లుగా ఎవరూ చేయకపోవచ్చును. ముఖ్యంగా ఈ చిత్రంలోని వసుమతి పాత్ర వేసిన కైరా అద్వాని మహేష్‌బాబు మనసు గెలుచుకొని సచివాలయంలో ఉద్యోగం సంపాదించడంపై ప్రేమతో ఏదైనా సాధించవచ్చు అన్న సందేశం నిజం అనిపిస్తుంది. వచ్చాడయ్యాస్వామి అన్నపాట ఈ చిత్రంలో బాగా చేశారు డైరెక్టర్‌గారు. చిన్నప్పుడు తల్లి ప్రా మిస్ సీన్స్ అదిరాయి. ప్రజ ల సమస్యలను గాలికి వదిలేసి తమ స్వంత పను లు చేసుకునే నేతలకు ఈ చిత్రం ద్వారా ప్రజల సమస్య లు పరిష్కరించాలనేది వస్తుం ది. మహేష్ సీఎం పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రంలో రాజకీయ సీన్స్ ప్రజలకు బాగా నచ్చాయి. ము ఖ్యంగా రాయలసీమ ప్రజలకు నీరు అందించేందుకు గ్రామానికి 5 కోట్లు విడుదల చెయ్యడం ద్వారా మహేష్ రాజకీయ ప్రవేశం చేస్తే రాగద్వేషాలకు అతీతంగా ధన వ్యామోహాలకు లొంగక సీఎంగా పరిపాలన సాగిస్తారని ప్రజలు ఈ చిత్రం ద్వారా మహేష్‌పై ఆశలు పెంచుకున్నారు.
- కె.అరుణ్ రాజీవ్, హైదరాబాద్

అశ్లీలం లేని కామెడీ
కామెడీ షో పేరు చెప్పి మగవాళ్లు ఆడవేషం వేసి ఆడే మాటలు, చేసే చేష్టలూ అన్ని ఛానల్స్‌లో చూసి మన నటీనటులు, రచయితలు దర్శకుల మనస్సుల్లో ఇంత మలినం ఉందా? అని ఆశ్చర్యపోతూ ఉంటాం. వీళ్లంతా ము ఖ్యంగా రచయితలు, దర్శకులు రోజూ రాత్రి 8 గంటలకు ‘వనిత’ ఛానల్‌లో వస్తున్న ‘మాలినీ అయ్యర్’ కామెడీ సీరియల్ చూడాలి. హిందీ సీరియల్ అనువాదం ఇది. శ్రీదేవి హాస్య పాత్రని ఎంత గొప్పగా చేస్తుందో చూసి తీరవలసిందే. అశ్లీలం అసలే లేని కామెడీ ఇది.
- సంపూర్ణ, సాంబమూర్తినగర్
పురాణ గాథలను
అవమానిస్తారా?
హాస్యం పేరుతో పురాణాలను అపహాస్యం చేయడం మామూలైంది. కొన్ని సినిమాల్లో పురాణాలలో రాముడు, కృష్ణుడు, పాండవులు తదితర పాత్రలకు కమేడియన్లను ఎంపిక చేసి, పురాణ ఘట్టాలను చిత్రీకరించి, అందులో కథనుమార్చి వెకిలి కామెడీని పండిస్తున్నారు. ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని అపహాస్యం పాలు చేసిన చిత్రాలు ఎన్నో. పురాణ దేవతలకు మోడ్రన్ డ్రెస్‌లు వేయించడం, కృష్ణునిచే కూల్‌డ్రింక్స్ తాగించడం మన తెలుగు సినిమాకే దక్కింది. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్ని చిత్రాల్లో ఎన్ని రకాలుగా అవమానం జరిగిందో అసలు సెన్సార్ అనేది ఏం చేస్తుంది? సినీ విమర్శకులకు ఈ తప్పులు ఎందుకు కనిపించవు? ఎలాగూ ఈరోజుల్లో పౌరాణిక చిత్రాలను తీసే సాహసం ఎక్కువగా చేయడం లేదు. కనీసం మన పురాణ గాథలను, దేవతలను గౌరవించడం మన సంస్కారం అని తెలుసుకుందాం.
- సరికొండ శ్రీనివిసరాజు, వనస్థలిపురం

నిజాయితీని గౌరవించాలంటే...!
కాశ్మీర్, యుపీల్లో చిన్న పిల్లలపై జరిగిన గ్యాంగ్ రేప్‌ల పట్ల దేశం అట్టుడుకుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు రేపిస్టులను ఉరితీయాలన్నారు. సమంజసమే. కాని పవన్ తోలు ఒలిచేయాలి అనడం సినిమా డైలాగే. చట్టంలో ఉరిశిక్ష ఉంది గాని తోలు ఒలిచేయడం లేదు. వ్యాఖ్యలు చేయడంతో నటీనటుల బాధ్యత తీరిపోదు. సినిమాల్లోనూ టీవీ రియాలిటీ షోలలోనూ స్ర్తిలను చూపిస్తున్న తీరు, వారి పట్ల ఉపయోగిస్తున్న భాష, ఐటెంసాంగ్స్- స్ర్తిలను రేప్ చేయడంతో సమానమే. అలా స్ర్తిలను అగౌరవపరిచే సీన్లు తమ చిత్రాల్లో లేకుండా చేస్తేనే నటీనటుల నిజాయితీని గౌరవించగలం.
- సత్య, కరప

ఆశ్చర్యమే..!
మహాభారతంని నాలుగు భాగాల మెగా చిత్రం నిర్మిస్తానని అమీర్‌ఖాన్ ప్రకటించి దేశాన్ని ఆశ్చర్యంలో ముంచేశాడు కాని ఇప్పుడు ఆ ప్రయత్నం విరమించినట్టు ప్రకటించాడు. ఎందుకంటే పద్మావతీ, మణికర్ణిక లాంటి చిత్రాలకు కొన్ని సంఘాలనుంచి ఎదురైన బెదిరింపులు! దశాబ్దాల క్రితం వచ్చిన మహాభారత్ టెలి సీరియల్ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఆ సీరియల్‌కు అద్భుతమైన సంభాషణలు రాసింది ఒక ముస్లిం. ఎన్నో విమర్శల్ని ఎదుర్కొని ‘ఒక ముస్లిం మహాభారత్ సంభాషణలు రాయకూడదా? తప్పులుంటే చెప్పండి’ అని చాలెంజ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. అమీర్‌కి అంత ఆత్మవిశ్వాసం లేకపోయిందేమో ప్రాజెక్ట్స్ వదులుకున్నాడు. సొంత అభిప్రాయాలు చొప్పించకుండా ఉన్నది ఉన్నట్లు చిత్రిస్తే అందరూ శభాష్ అంటారు.
- పవన్‌పుత్ర, రామారావుపేట

మంచి చిత్రమే కానీ..!
ఉత్తర, దక్షిణ భారతదేశాల చిత్ర పరిశ్రమలు కలిసి లాబీయింగ్ చేసి ‘రంగస్థలం’ చిత్రాన్ని ఆస్కార్‌కి పంపకపోతే ద్రోహులనిపించుకుంటారు అని చెప్పేవారికి ఎలాంటి చిత్రాలకు ఆస్కార్ లభిస్తుందో తెలియదనుకోవాలి. రంగస్థలం ఖచ్చితంగా మంచి చిత్రమే కాని గొప్ప చిత్రం కాదు. ఎన్ని హంగులున్నా ఈ చిత్రం కథ పాత చింతకాయ పచ్చడే. దుర్మార్గుడిని చంపేస్తే ప్రపంచంలో దుర్మార్గం అంతం అయిపోతుందా? ఒక జటిలమైన సమస్యను విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి పరిష్కరించిన కథల్నే ఆస్కార్‌లు వరిస్తున్నాయి. ఇంతవరకు మన దేశానికి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఒక్క అవార్డుకూడా రాలేదు.
- హితీక్ష, రమణయ్యపేట