మీ వ్యూస్

ఒకింత ఆనందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘్భరత్ అనే నేను’ ఓ మోస్తరుగా వుండి అభిమానులను నిరాశపరిచి, మాస్, క్లాస్ ప్రేక్షకులను ఒకింత ఆనందపరిచింది. ఒక మామూలు కథ తీసుకుని, మహేష్, కొరటాల శివ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. మొదటిరోజు డివైడ్ టాక్ తెచ్చుకుని, మెల్లమెల్లగా సూపర్ హిట్ రేంజ్‌కి చేరుకుని ప్రేక్షకులను, విమర్శకులను విస్మయానికి గురిచేసింది. భరత్‌రామ్ పాత్రలో కర్త, కర్మ, క్రియ లాగా మహేష్ ముఖ్యమంత్రిలా విజృంభించి నటించాడు. ప్రతీ ఊరికి సంవత్సరానికి 5కోట్ల రూపాయలను ఇచ్చి ఊరును బాగుచేసుకోవడం, స్వయం పరిపాలన బాగుంది. ‘వచ్చాడయ్యో సామీ..’ పాట ఈ సినిమాకు ప్రత్యేకం. రవి కె.చంద్రన్, తిరుల ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది. దర్శకుడిగా కొరటాల శివ ‘్భరత్ అనే నేను’తో మరో మెట్టు ఎక్కాడు.
- జి.గౌరీగాయత్రి, హైదరాబాద్

క్లీన్‌గా అలరించింది
22 ఏప్రిల్, ఆదివారం ఆంధ్రభూమి ‘వెనె్నల’ అనుబంధంలో ‘్భరత్ మెప్పించాడు’, ఎం.డి.అబ్దుల్‌గారి వ్యాసం ఆ సినిమా ఉన్నంత క్లీన్‌గా అలరించింది. దాదాపుగా కొత్త సినిమాలు చూడటం మానేసిన, ప్రేక్షకులను అన్నివిధాల ఆకట్టుకునేలా నేటి రాజకీయ కుళ్లుని కడిగేసేలా ‘్భరత్ అనే నేను’ సినిమా ఆకర్షణీయంగా, ఆలోచింపజేసేలా రూపుదిద్దుకుంది. పాతుకుపోయిన పాత నేతల నిర్వాకాలను రూపుమాపేలా నాయకుడు లేని రాజ్యయే మిన్న అని ఈ సినిమా కొత్త బోధ చేసింది. హీరోలా మహేష్, దర్శకుడు కొరటాల, నిర్మాత డివివి దానయ్య చేపట్టిన అఖండ, అద్వితీయ చిత్రం ‘్భరత్ అనే నేను’.
- యం.వి.ఆర్.కె., హైదరాబాద్

మిలటరీ తుపాకులు
చాలా సినిమాలలో మిలటరీ నేపథ్యం ఉన్న వేషాలకు, మారువేషాలకు మిలటరీ వాడని తుపాకులను చూపిస్తున్నారు! అసలు అటువంటి తుపాకులు ‘మిలటరీ వాళ్లు’ అని ప్రేక్షకులకు తెలియటం కోసమే వాడుతున్నారు. కానీ మిలటరీ నుండి విడుదల అయినవారు లేదా సెలవుమీద వచ్చిన వారికి తుపాకులను వెంట తీసుకెళ్లనివ్వరు కదా. పైగా డ్యూటీలో లేనివారు మిలటరీ దుస్తులు వేసుకున్నట్లు చూపించటం మరీ చోద్యం! సేతుబద్ధత లేని పాత్రలు, సన్నివేశాలు, కథలు, కల్పనలు ఉండే సినిమాలలో వాస్తవికతకోసం వెదకటం వెర్రితనం. సినిమాలు ‘కళ తప్పి’ చాలాకాలమే అయింది. ఎవరూ మార్చలేనంత ‘పద్మవ్యూహంలో’ ఇరుక్కుపోయింది. సినిమాలు చూడటం కన్నా చెట్లు, పూలమొక్కలు ఆకాశం, మేఘాలు వంటి వాటిని చూసి పరవశిస్తూ ప్రకృతితో ‘మమైక్యం’ చెందటం మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది.
-ఎన్.మధుసూదనరావు, హైరాబాద్

అదీ..ఆ పాట గొప్పదనం!
‘రోజులు మారాయి’ సినిమా పేరువినగానే ‘ఏరువాకా సాగారో రన్నా చిన్నన్నా’ పాట జ్ఞాపకం వస్తుంది. ఆ పాట రాష్ట్రానే్న ఉర్రూత లూగించింది. విడుదల అయిన కొన్ని వారాలకు ఆ నలుపు-తెలుపు చిత్రంలో ఆ పాటకు మాత్రం రంగులు అద్దారు. నిజానికి ఆ పాట లీల చేత పాడించాలని సంగీత దర్శకుడు అనుకున్నారు. కాని లీల తండ్రి ఆ పాట విని ‘మా అమ్మాయి సంగీత సాహిత్యాలతో పరిపుష్టంగా ఉండే పాటలే పాడుతుంది. ఇలాంటి లొల్లాయి పాటలు పాడదు’అనేశారు. దాంతో జిక్కీ చేత పాడించారు. ఆ పాటకు తొలిసారిగా నృత్యం చేసిన వహీదా తర్వాత నటిగా మారి బాలీవుడ్‌కి వలసపోయి గొప్ప నటిగా సెటిల్ అయింది. అదీ ఆ పాట గొప్పదనం!
- సాహిత్యదీప్తి, రమణయ్యపేట

అర్థం లే(కా)ని సంభాషణ!
‘నిన్ను ప్రేమిస్తున్నాను’. ‘పెళ్ళికూడా’చేసుకోవాలి అని అనుకుంటున్నాను’ అన్న సంభాషణ ఇప్పటికీ చాలా సినిమాలలో, నాటకాలలో, టీవీలలో, సాహిత్యంలో వి(క)నిపిస్తోంది. ‘పెళ్ళిచేసుకుందామా’ అంటే ఉభయులకూ మర్యాదకరంగా ఉంటుంది కదా. ‘పెళ్ళికూడా’ చేసుకోవాలనుకుంటున్నాను’అని అనటంలో అర్ధం ఉందా? ప్రేమిస్తున్నాను అంటే పెళ్ళిచేసుకోవాలన్న సూచన ఉంటుంది కదా. ‘పెళ్ళి’ కుదరకపోతేనేం ప్రేమించుకుంటూనే (?) ఉందాం అన్న సూచన సదరు సంభాషణలో అంతర్గతంగా ధ్వనిస్తోంది కదా.
- ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్

ఇంతకీ టార్గెట్ ఎవరు?
కాస్టింగ్ కౌచ్ రగడ పవన్‌కల్యాణ్‌ని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. మెగా కుటుంబం ఫిలింఛాంబర్‌కి చేరుకొని మీరేం చేస్తున్నారని నిలదీయడంతో రామ్‌గోపాల్‌వర్మ ‘ఎవరో అనామకురాలు ఏదో అంటే పవన్ గౌరవం తరిగిపోతుందా?’అని రిటార్ట్ ఇచ్చాడు. అన్ని దులపరించుకొని పోయే వర్మని ఎవరెంత తిట్టినా ఆయనకు బాధలేకపోవచ్చు గాని అందరూ అలా ఉండలేరుకదా. ఈ రగడను హైలైట్ చేసిన చానల్ మరి రేణుదేశాయ్ పవన్‌ని విడిచి వెళ్లిపోయినప్పుడు అతని అభిమానులు ఆమెను ఎలా తిట్టారో ఆయనకు తెలియదా? అలా తిట్టవద్దని ఆయన అభిమానులకు చెప్పగలిగాడా? అని చానల్ రిటార్ట్ ఇచ్చింది!
- ప్రేమజ్యోతి, శ్రీనగర్

హాట్ టాపిక్!
శ్రీరెడ్డివల్ల గత రెండువారాల హాట్ టాపిక్ కాస్టింగ్ కౌచ్ అయింది. నిజానికిది అన్నిరంగాల్లోనూ ఉన్నదే. ముఖ్యంగా సినీ రంగం, వైద్య రంగాల్లో కొంచెం ఎక్కువే. తాడూబొంగరం లేకుండా సినిమా ఛాన్స్‌లకోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారే ఇందుకు టార్గెట్ అవుతారు. అలా ఛాన్సులు సంపాదించి రంగంలో నిలదొక్కుకున్నాక అబ్బే మాకు అలాంటి సమస్య ఎదురవలేదు అంటుంటారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేసేవారు ఎక్కువగా కేరళ నుంచి వచ్చిన 18 ఏళ్లలోపు వారే. వీళ్ల కబుర్లు వింటే ఆ కౌచ్ గురించి పెద్దగా పట్టించుకోరు. మంచి భోజనం సినిమా చూసే ఛాన్స్ దొరికితే చాలు అనుకుంటారేమో అనిపిస్తుంది.
- ప్రవీణ్, కాకినాడ