మీ వ్యూస్

అబ్బురపరచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథలో కొత్తదనం, ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం అభిరుచినిబట్టి కథకు ప్రాధాన్యత నివ్వడం హర్షణీయం, ఆనందదాయకం. ఆచితూచి అడుగులేస్తూ, మంచి చిత్రాలు నిర్మించాలన్న అభిలాష ఉండాలి ప్రతి దర్శకుడికి. ‘రంగస్థలం చిత్రం సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుని 3 గం. సినిమా అయినా కుర్చీకి అతుక్కుపోయేటట్లుగా చేసిం ది. విసుగులేక హాస్యపుజల్లులతో, మాటల తూటాలతో ముందుకు సాగింది. ప్రేక్షకులను అబ్బురపరచింది. హీరో రామ్‌చరణ్ చెవిటివాని పాత్రలో అద్భుతంగా నటించారు. అందరిని మెప్పించారు. ఇకపోతే సమంత, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు తమతమ పాత్రలకు న్యాయంచేకూర్చారు. బయట ఎండలుమండుతున్నా సినిమా థియేటర్‌లో కూల్ వాతావరణంలో సినిమా చూసి ఎంజాయ్‌చేశారు. మంచి చిత్రాన్ని చూశామన్న అభిప్రాయానికి వచ్చారు ప్రేక్షకులు. వెనె్నల మరింత వెనె్నలతో అలరారాలని, కనిపించే పున్నమి వెనె్నలకన్నా వారంవారం మమ్మల్ని మురిపించే వెనె్నలతో మరింత హాయినా పొందాలని, సుకుమార్ దర్శకత్వంలో మరిన్ని మంచి చిత్రాలు రావాలని, ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా...
- తాడినాడ భాస్కరరావు, తణుకు

ఇంకా భగభగ!
కాస్టింగ్ కౌచ్ ఇంకా భగభగ లాడుతూనే ఉంది. కొందరు వివాదాస్పద వ్యాఖ్యలూ చేస్తున్నారు. ‘లైంగిక వేధింపులు అనాదిగా ఉన్నవే. సినిమా రంగంలో ఆ ‘కౌచ్’వల్ల కనీసం ఉద్యోగం ఇస్తున్నారు. ఇతర రంగాల్లో అదీ లేదు’అన్నది ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్. విమర్శకులు చెలరేగడంతో ఆమె సారీ చెప్పింది. అలనాటి హీరో శత్రుఘ్నసిన్హా ‘నన్ను సంతోష పెడితే నిన్ను సంతోష పెడతా’అన్న సూత్రం చాలా కాలంగా ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత అంగీకారం అది. జీవితంలో ముందుకు వెళ్లాలంటే కౌచ్ అవసరం అనుకునే వాళ్లున్నారు అని వ్యాఖ్యానించాడు. మరి విమర్శకులు ఊరుకుంటారా?
- అభిలాష, సాంబమూర్తినగర్

భావదాస్యం వదలలేదు..!
సినీ నటీనటులు దేవతలా? వాళ్లు నేరాలు చేయరా? అలాగే ఉంది మన మేధావుల, అభిమానుల అభిప్రాయం. అక్రమ ఆయుధాలున్నందుకు సంజయ్‌దత్‌కి శిక్షపడితే పరిశ్రమకెంత నష్టం అని మేధావులు వాపోయారు. కొద్దికాలం జైలులోఉండి మిగిలిన కాలం మాఫీ పొంది అతగాడు బయటపడితే అతని బయోపిక్ తీస్తున్నారు! తాగి కారు నడిపి మరణానికి కారణం అయిన సల్మాన్‌ఖాన్ ఆ కేసునుంచి ‘ఎలాగో’బయటపడ్డాడు. మరో కేసు తగులుకుంది. కృష్ణజింకను చంపడం. మళ్లీ మేధావుల గగ్గోలు. అతడు జైలుకెళితే పరిశ్రమకు 800కోట్లు నష్టం అని, బెయిల్ మీద బయటపడ్డాడు సల్మాన్. అతడు జింకను చంపలేదు. టబు చంపితే నేరం తన మీద వేసుకున్నాడని బోడి సమర్ధింపు ఒకటి. ఎన్నో స్వచ్చంద సేవలు చేస్తున్న సల్మాన్‌కి శిక్షనుండి ఉపశమనం కలగాలని జయాబచ్చన్ ఆకాంక్ష! దేశానికి బానిసత్వం వదిలినా మన మనసులకు భావదాస్యం వదలలేదు!
- మరుదకాశి, కరప

చాలా సినిమాల్లో...!
‘చిన్న పదం పెద్ద తప్పు’లాంటివి చాలా సినిమాల్లో కనిపిస్తాయి. సినిమా కథ కాలంనాటి పరిస్థితులు పట్టించుకోకపోతే తప్పులు దొర్లుతాయి. లైలామజ్ను సినిమాలో ‘ఏ కొర నోములు నోచానో’అన్న పాట విని అప్పుడే ముస్లిం అమ్మాయి నోములు నోచుతుందా అని విమర్శించారు. రచయిత సముద్రాల ‘ఎవరైనా ఏడుస్తూ పాట పాడుతారా?’ సినిమాల్లో ఇవన్నీ చెల్లుతాయి అనేశారు. ‘సువర్ణసుందరి’ చిత్రంలో దేవకన్య మానవకాంతగా మారి బొమ్మలు అమ్ముకుంటుంది పాట పాడుతూ. ఆ పాటలో ‘ఏ బొమ్మ అయినా ఒక అణాయే సుమా’ అని ఉంది. ఆరోజుల్లో అణాలు లేవు. సామాజిక మాధ్యమాల్లో తప్పులు కుప్పలుతెప్పలుగా కనిపిస్తాయి. ఎవరూ పట్టించుకోరు. అది అంతే..
- సుభాష్, శ్రీనగర్

రాసిన ‘నిమిషం’ సరైనదే..!
‘చిన్న పదం పెద్ద తప్పు’ వ్యాసంలో మినిట్ అనే పదానికి నిమిషం అనే అర్థం చెప్పుకొని రెండు పాటల్లో ఆ పదం వాడటం పెద్ద తప్పు అన్నారు రచయిత. అయితే మినిట్‌ని నిమిషం అనడమే తప్పు! నిమిషం అనే పదానికి ‘రెప్పపాటు కాలం’అని అర్ధం. రెప్పపాటు లేని దేవతల్ని అనిమిషులు అంటారు. ఈ అర్ధంతో ఆ పాటల్లో! రాసిన నిమిషం సరియైనదే. తప్పుకాదు. రెప్పపాటు కాలంలో ఏమి జరుగునో చెప్పలేం. అలాగే రెండో పాటలో కూడా. సెకనుని క్షణం అనడం తప్పే. మినిట్‌నికాక సెకను నిమిషం అనాలి మరి!
- శుభ, కాకినాడ