మీ వ్యూస్

అపురూపమైన అనుభూతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించిన ‘మహానటి’ చిత్రం చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు అపురూపమైన అనుభూతిని పంచింది. సావిత్రి జీవిత కథలో ఇన్ని మలుపులున్నాయా? అనిపిస్తుంది. దర్శకుడు నాగ్‌అశ్విన్‌కు ఇది రెండో చిత్రం అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ప్రతి సన్నివేశం, ప్రతి దృశ్యం కళాఖండంగా చిత్రీకరించి, తెలుగువాడి సత్తా చాటాడు. మహానటిగా నటించిన కీర్తిసురేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. వెండి తెరపై మళ్లీ సావిత్రిని చూస్తున్నామా అనిపించింది. మహానటిగా పాత్రలో ఒదిగిపోయి, కనిపించిన ప్రతి సన్నివేశంలోను, పరిణితి చెందిన నటనను ప్రదర్శించింది. సీనియర్, జూనియర్ నటులు తమ పాత్రల పరిధిమేరకు నటించిన, మహానటి చిత్రం ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు పొంది ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది.
- జి.గౌరీగాయత్రి, హైదరాబాద్

తస్మాత్ జాగ్రత్త!
సినిమా అనేది కల్పిత ప్రపంచం. సినిమాలో హీరో తొడకొట్టి మీసం మెలేసి నోటి దురద డైలాగులు కొడితే అభిమానులు హర్షిస్తారు. ఈలలు వేస్తారు. ఉత్సాహ భరితులవుతారు. కానీ రాజకీయాలు వాస్తవ ప్రపంచానికి చెందినవి. మాట్లాడేటప్పుడు మర్యాదగా హుందాగా మాట్లాడితే ఇమేజ్ పెరుగుతుంది. కానీ తొడకొట్టి మీసం మెలేసి నోటి దురద డైలాగులు కొడితే ఇమేజ్ డామేజ్ అయిపోతుంది. ప్రజలు నవ్వుకుంటారు. ఎద్దేవాచేస్తారు. ఈ విషయం ముఖ్యంగా బాలకృష్ణ గమనించాలి. వియ్యంకుణ్ణి మెప్పించాలని అతిచేస్తే గతి చెడుతుంది. తస్మాత్ జాగ్రత్త.
-చైతన్య, వాకలపూడి

సహజత్వానికి దూరంగా..
వెనె్నలలో ‘్భరత్ అనే నేను’ సమీక్ష చదివాక, చిత్రం చూసి నిరాశపడ్డాను. ‘్భరత్ అనే నేను’కన్నా ‘లీడరు’(రానా) బాగా తీయబడింది. అలానే అర్జున్‌తో వచ్చిన ఒక సినిమా కూడా. ఈ భరత్‌లో వున్న లోపాలు లేదా అనవసర సన్నివేశాలు- చిత్రంలో మహేష్‌బాబు తమ్ముడి పాత్ర ప్రాధాన్యత ఏమిటి? కథకు ఆ పాత్ర ఎలా ఉపయోగించబడింది? ఒక వ్యక్తి అంతమంది రౌడీలను కొట్టడం (ఈ సినిమాకు అది భావ్యంకాదు) అసహజం. ఆ రౌడీలలో ఒకడిదగ్గర చిన్న తుపాకీ వున్న అంతే సంగతులు కాని అందరూ కత్తులు, చేతులతోనే కొట్టుకుంటారు- ముఖ్యమంత్రిని పదవినుండి దింపెయ్యడానికే హీరోయిను పాత్ర ఉపయోగించింది తప్పితే యింకో ప్రయోజనం ఏమిటి? ఆ కారణంగా కాకుండా యింకో బలమైన (అవిశ్వాసంతో) కారణం చూపితే దింపేస్తే అది సహజంగా వుండేది. మొత్తంమీద ఈ చిత్రం సహజత్వానికి ఎంతో దూరంగా (ఎన్నుకున్న కథ అలాంటిది కాబట్టి సహజత్వం అన్నాను)వుంది. సామాన్యుడి విష్‌ఫుల్ థింకింగ్‌కు దగ్గరగా వున్నందున ఈ చిత్రం విజయం సాధించిందని నా అభిప్రాయం.
- త్రయంబకేశ్వరుడు, వక్కలంక

భరత్ నచ్చిండు!
స్వచ్ఛమైన, నిఖార్సైన రాజకీయాలు ఎలాచేయాలో ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉండాలో తెలియజెప్పిన చిత్రం ‘్భరత్ అను నేను’. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుత సమాజంలో నెలకొన్న సమస్యలు, వ్యవస్థ లోపాలను కొన్నిటిని ఎత్తిచూపి వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చో ముక్కుసూటిగా చూపించాడు. హీరో మహేశ్‌బాబు కొద్దినెలలు ముఖ్యమంత్రిగా ఉండి సామాన్యులకు మేలుచేసే చర్యలుచేపట్టి శభాష్ అనిపించుకుంటాడు. కాని అవి స్వార్థపూరిత రాజకీయ నాయకులకు కంఠగింపై ఆఖరుకు ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన నాయకులే అతన్ని గద్దె దింపుతారు. స్క్రీన్‌ప్లే బావుంది. దాదాపు సన్నివేశాలన్నీ పండినాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌బాబు నటన క్లాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమాలు దాదాపు 80 శాతం భాగంలో హీరో సీఎంగా నటించాడు. కనుక హీరోయిన్‌కి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఈ సినిమాలోని సందేశాన్ని ప్రశ్నిస్తే మంచిది.
-జి.అశోక్, గోదూర్, జగిత్యాల జిల్లా

అందుకే ఢాం అంది!
ఆత్మలు, దెయ్యాలు లేకపోయినా కొందరు పాశ్చాత్యులు ఆత్మల ఫొటోలు తీశాం అనడంతో మనలో కొందరు దెయ్యాల్ని నమ్ముతున్నారు. దెయ్యం సినిమాలు చాలానే వచ్చాయి. కొన్ని హిట్ అయాయి కూడా. కాని అన్ని సినిమాల్లోనూ ఒకటే కానె్సప్ట్. పగ, ప్రతీకారం. కొత్తదనం కోసం ‘కణం’ చిత్రంలో అబార్షన్ ఆత్మను చూపించారు. అయితే అబార్షన్ అనేది మూడునెలలలోపు చేయాలి. మూడునెలల్లో శిశు అవయవాలుగాని మెదడు గాని ఏర్పడదు. ఆలోచనలు, పగ, ప్రతీకారాలు తెలియవు. ఆత్మ వయసు పెరుగుతూ ఉంటుందని పాశ్చాత్యులు కూడా చెప్పలేదు. కాని ‘కణం’లో ఆ నలుసు ఐదేళ్ల పిల్ల అయ్యేరకూ ఆగి పగ తీర్చుకోడానికి ప్రయత్నించడం అసంభవం. అందుకే ఎవరికీ నచ్చక ఢాం అంది!
- సౌందర్య, కాకినాడ

కెరియర్ ముగిసినట్టే..!
పులులు పోట్లాడుకుంటే తెలిసోతెలియకో మధ్యలో చిక్కుకొని గాయపడిన లేడీ చందం అయింది శ్రీరెడ్డి పరిస్థితి. ఆమె కాస్టింగ్‌కౌచ్ గురించి ప్రస్తావిస్తూ కొందరు ప్రముఖులపై బురద చల్లుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టింది శ్రీరెడ్డి. వివాదాలకు ముందుండే ఒక దర్శకుడు ఆమెను ఎగదోసి పవన్‌పై మరింత బురుద చల్లేట్టుచేయడంతో మెగా కుటుంబం భగ్గుమని ఫిలింఛాంబర్‌ని నిలదీయడం, ఎవరిపై ఎలాంటి కేసులుపెట్టాలో లాయర్లతో సంప్రదించడం జరిగాయి. దాంతో శ్రీరెడ్డి కెరియర్ ముగిసినట్టే!
- సోనాలి, సూర్యారావుపేట