మీ వ్యూస్

మెప్పించలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విడుదలైన ‘మెహబూబా’ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీసువద్ద విజయం సాధించలేక పోయింది. తనయుడు ఆకాష్‌పూరిని హీరోగా పరిచయంచేస్తూ తనకు అలవాటైన బాటలో వెళ్ళక కొత్తగా ఉంటుందని చేసిన మెహబూబా చిత్రం పూరీ జగన్నాథ్ వరుస పరాజయాల పరంపరలో ఒకటిగా నిలిచింది. ఎన్నుకున్న కథ బాగానే ఉన్నా, సరైన హీరో లేకపోవడం మైనస్‌గా మారింది. ఇదే కథని రవితేజ హీరోగా తీస్తే సినిమా సూపర్‌హిట్ అయుండేది. ఇండో-పాక్‌ల మధ్య నడిచిన ప్రేమకథ తెలుగుతెరకు కొత్తగానే ఉన్నా సరైన పద్ధతిలో ప్రేక్షకులకు నచ్చేలా తీయలేక ఇది పూరీ జగన్నాథ్ సినిమానా. చిత్రంలో పూరీ మార్కు ఒక్కటి కూడా లేక నిరాశ పరిచింది.
- జి.గౌరీగాయత్రి,
ఉప్పల్, హైదరాబాద్
వెలితిగా కనిపించింది..
2.4.18 వెనె్నలలో ‘హాస్యానికి అందలం’ ప్రధాన వ్యాసం బాగున్నది. కాని హాస్యానికి మారుపేరైన రేలంగి ప్రస్తావన లేకపోవడం వెలితిగా కనిపించింది. ఆయన ముందుతరం వాడనుకుంటే నేటి తరంలో తనదైన శైలిలో ‘నాయనా తిరు!’అంటూ హాస్యాలు ఒలకబోసిన ‘శ్రీలక్ష్మి’గారి గురించి ఒక్కమాట కూడా లేకపోవడం మరీ పెద్ద లోపం. గమనించగలరు.
- పి.వి.నారాయణాచార్యులు, లూటుకుర్రు,
మామిడికుదురు మండలం, తూ.గో.జిల్లా.
ఏమిటీ ఎడిటింగ్‌లు?
‘పదములె చాలు రామా... నీ పద ధూళులె పదివేలు’ ఎ.పి.కోమల పాడిన ఈ పాటను చిన్నప్పటినుండీ రేడియోలో వింటుంటే నా మనసు పులకించేది. ‘బంగారు పంజరం’ సినిమాలోనిది ఈ పాట అంటూ రేడియోలో చెప్పేవారు. దూరదర్శన్‌లో బంగారు పంజరం సినిమా వస్తుంటే అతి ముఖ్యమైన పనులన్నీ మానుకొని టి.వి.కి అతుక్కుపోయాను. ఆ భక్తి పాటకోసం సినిమా మొత్తం వీక్షించాను. పాట రాకపోయేసరికి దూరదర్శన్‌వారు తమ సహజశైలిలో ఈ పాటను కట్ చేశారేమోనని తీవ్రం గా నిరాశపడ్డాను. కానీ ఇటీవల ఓ విషయం పత్రికలో చదివి ఆశ్చర్యపోయాను. ‘పదములెచాలు’ పాటను సినిమాలో చిత్రీకరించాక సినిమా నిడివి ఎక్కువైందని ఎడిటింగ్‌లో ఈ పాట తొలగించారట. సినిమాల్లో డ్యుయేట్లముందు భక్తిపాటలు పనికిరావని సినిమావాళ్లు తేల్చేశారన్నమాట. ఇంతమంచి పాట తొలగించాల్సిన అవసరమేముంది? వేరే పాటనో, అనవసరమైన సన్నివేశాన్నో తొలగించవచ్చుగదా! రేడియో, టీ.వి చానెల్స్‌వారికి విన్నపం. ఇకనుండి ఈ పాటను ప్రైవేట్ సాంగ్‌గా నిర్ణయించండి.
- సరికొండ శ్రీనివాసరాజు,
వనస్థలిపురం
వనె్న తరగని చిత్రం!
వినోదావారి దేవదాసు చిత్రం విడుదల 1953వ సంవత్సరం! నేటికి అరువది అయిదు సంవత్సరాలైనా ఆ చిత్రం నేటికి ప్రేక్షకుల హృదయాలలో ఆచంద్రార్క తారాస్థాయిగా నిలిచింది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం, సుబ్బరామన్, సంగీత దర్శకత్వం బి.యస్. రంగా, కెమెరా కూర్పు చేయడం ఎంతో విశేషం! ఎక్కడ ఏ దృశ్యము అనుసరించే పద్ధతి తీవ్ర కృషి! ముందు ఆలోచన. ఇక కథానాయక నాయికల నటన జీవం పోశారు! ఎక్కువగా రాత్రివేళ షూటింగ్ చేసిన చిత్రం! గాలి వానను క్లైమాక్స్‌చేసిన మొదటి చిత్రం దేవదాసు! ఇకముందు ఎన్ని సంవత్సరాలైనా వనె్న తరగని చిత్రం!
- కోవూరు
వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
భరత్.. బాధ!
ఈ సినిమా గురించి ప్రసారమాధ్యమాలు ఒక నెల నెలంతా ఊదరగొట్టితే గొప్ప కళాఖండం మిస్సవుతున్నానని పరిగెత్తుకెళ్ళి చూస్తే హీరోగారి భాషలో మైండు బ్లాకయి చుక్కలుకనబడి, ఏసీ హాలులో చెమటలు పట్టాయి. ఇది ఈ భరత్ సంగతి. పాత చింతకాయ పచ్చడి కథ. సి.ఎం. ప్రేమకథ చూస్తే అసహ్యం వేసింది సినిమాల మీద రాజకీయం మీద. ఇతర హీరోయిన్ గురించి చెప్పేది ఏమీ లేదు. పాటల కోసం తప్ప. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రసారమాధ్యమాల మాఫియా ఎంత దారుణంగా ఉందో ఈ సినిమాకు స్టార్లు ఇవ్వటం చూస్తే తెలుస్తుంది. చివరగా మన తెలుగు సినిమా ఇంతే-ఇంక బాగుపడదు.
-శిష్టాలక్ష్మీనరసింహమూర్తి,
హైదరాబాద్
హాస్యప్రమాణాలు
పెంచండి!
నేటి సినిమాల్లో పలుచనౌతున్న హాస్యం తో, శృతిమించుతున్న అపహాస్యంతో హాస్య ప్రేమికుల హృదయాలు బాధాతప్తవౌతున్నాయి. ఒకప్పుడు కథలో అంతర్భాగంగా హాస్యం నిలిచి కోట్లాది తెలుగు సినిమా ప్రేక్షకులను ఆనంద లోకాలలో విహరింపజేయగా, నేడు ప్రేక్షకులను నవ్వించేందుకు ద్వందార్థాలు, వెకిలి చేష్టలు, బూతు డైలాగులు, అభ్యంతర, అసభ్యకర సన్నివేశాలను గుప్పించి హాస్య ప్రమాణాలను అధమఃపాతాళానికి దిగజార్చేస్తున్నారు. మన దర్శక, నిర్మాత, రచయితలు. నాటి సినిమాలలో హాస్యం చూసి నేటికి కడుపుబ్బ నవ్వుకుంటుండగా, నేటి హాస్యం చూస్తే కడుపులో వికారం కలుగుతోంది. ప్రతిభ వున్న తెలుగు హాస్య నటులను విస్మరించి, అరువుతెచ్చుకున్న పరభాషా నటుల వెకిలి చేష్టలను చూసి నవ్వాలో ఏడవాలో అర్ధంకాదు. తెలుగు సినిమాలలో హాస్యప్రమాణాలను పెంచేందుకు చిత్తశుద్ధితో తెలుగు పరిశ్రమ కృషిచేయాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం