మీ వ్యూస్

మహానటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహానటి’- రంగస్థలం, భరత్‌ల మాదిరి సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకుల మన్నన పొంది హిట్ అయింది. తమాషా ఏమంటే చిత్ర నిర్మాతలు గాని దర్శకుడు గాని మహానటి సావిత్రి మరణించే నాటికి పుట్టనే లేదు. నిర్మాతలు ప్రియాంక, స్వప్నల తల్లి, తాతగారు ఎక్కువగా సావిత్రి నటించిన చిత్రాలు చూస్తూ ఆమె గొప్పదనం వారికి చెప్తూ ఉండేవారు. అయితే ప్రియాంక భర్త నాగఅశ్విన్ సావిత్రి బయోపిక్ తీస్తాననగానే ఆ సోదరీ మణులు ఉలిక్కిపడ్డారు. అంతవరకు వాళ్లు తీసిన చిత్రాలేవీ హిట్ కాలేదు. నాగ అశ్విన్ జోక్ చేయడం లేదని గ్రహించాక సావిత్రి జీవితంపై పరిశోధన చేసి కథ తయారుచేసి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరికి వినిపిస్తే ఆమె పెద్దగా సుముఖం చూపలేదు. అయినా అదొక చాలెంజ్‌గా తీసుకొని ‘మహానటి’ని తీర్చిదిద్ది ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు.
-సంపూర్ణ
సాంబమూర్తినగర్

ఇదీ ‘సూర్య’ విజయం!
‘రంగస్థలం’ హిట్ అయినందుకు మహేశ్, ‘్భరత్ హిట్ అయినందుకు రామ్‌చరణ్ పరిశ్రమకు పండుగ వచ్చిందని ఆనందించినా వారి అభిమానులు మాత్రం ఎవరి చిత్రానికి ఎక్కువ వసూళ్లు? ఎవరు గొప్ప? అని వాదులాడుకుంటూనే ఉన్నారు. వివాదాలు రేపుతున్నారు. అయితే అల్లు అర్జున్ చిత్రం ‘నాపేరు సూర్య’ ఫట్‌మంది. విజయం సాధించని ఈ చిత్రం విజయోత్సవం నిర్వహించారు. ఘనంగా నిర్వహించాలనుకున్నా హీరో, దర్శకుడు, నిర్మాత, గీత రచయిత తప్ప ముఖ్యులెవరూ రాలేదు. పవన్‌కల్యాణ్ వచ్చి శుభాకాంక్షలు చెప్పినా ఎవరి ముఖంలోనూ ఆనందం లేదు. కనీసం 3,4 గంటలు నిర్వహించవలసిన కార్యక్రమం ఐదే నిమిషాల్లో ముగిసింది! ఇదీ ‘సూర్య’ విజయం!
- మైథిలి, సర్పవరం

సహేతుకమే!
కాస్టింగ్ కౌచ్‌పై సాహసి రాఖీసావంత్ ధైర్యంగా చెప్పిన అభిప్రాయాలు సహేతుకమే. కౌచ్ ద్వారా మంచి అవకాశాలు దక్కించుకొని తర్వాత ఆదర్శాలు వల్లిస్తారు చాలామంది. ప్రఖ్యాత రచయిత, జర్నలిస్టు ఎడిటర్ ప్రీతీశ్‌నంది సెక్స్ వేరు, రేప్ వేరు అంటూ జీవితంలో ఎదగడానికి సెక్స్‌ని ఉపయోగించేవారున్నారు అన్నాడు. ఒకటి మాత్రం నిజం! అమ్మాయిలు ఇప్పుడు నన్నంటుకోకు అన్నట్టు దూరంగా ఉండే పరిస్థితి లేదు. పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా ఉంటూ అమ్మాయిలు పెద్దలకు తెలియకుండా సహజీవనం చేస్తున్నారు. ఇది ఇష్టపూర్వక కౌచ్ కాదా? దాహం వేస్తే కూల్‌డ్రింక్ తాగినట్టే అవసరానికి సెక్స్ ఉపయోగించుకునే అమ్మాయిలు అందరూ కాక పోయినా కొందరైనా కనిపిస్తారు.
- హితీక్ష, రమణయ్యపేట

అయ్యో, ప్రియాంక!
బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, దీపిక పడుకొనేలు ఒకేసారి హాలీవుడ్‌లోకి దూసుకెళ్లారు. దీపిక ఒక చిత్రం చేసి దాని సీక్వెల్‌లో నటిస్తున్నది. ప్రియాంక కూడా ఒక చిత్రం చేసి క్వాంటికోఅనే టెలీ సీరియల్‌లో ఎక్కువ కీర్తి, డబ్బు ఆర్జించి దీపికను మించి పోయింది. ఆమె హాలీవుడ్‌లోనే స్థిరపడుతుంది అనుకున్నారు గాని పరిస్థితి తిరగబడి క్వాంటికోకి ఆదరణ తగ్గింది. దాన్ని ఆపేస్తారు అనుకుంటున్నారు. ప్రియాంక బాలీవుడ్ వైపు తిరిగి సల్మాన్‌ఖాన్‌తో ఒక చిత్రం చేయాలనుకుంటున్నది. మూడేళ్ల క్రితం ఆమె చేసిన హిందీ చిత్రం ఫ్లాప్ అయింది. ఇప్పుడు సల్మాన్ ఆమెను ఏ తీరానికి చేర్చుతాడో! అది కూడా ఫ్లాప్ అయితే ఆమె చాప్టర్ క్లోజ్! అయ్యో, ప్రియాంక!
- శాండో ప్రచండ్, శ్రీనగర్

ఇదేం మాయరోగం!
యాంకర్, నటి, అనసూయ వేషాలు, భాష, హొయలు చూసి ఇద్దరు బిడ్డల తల్లికి ఇదేం మాయరోగం అని నెటిజన్స్ తూర్పారబడితే తన తల్లిదండ్రులు బాధపడ్డారని అనసూయ చెప్పింది. నెటిజనే్ల కాదు సొంత బిడ్డలు మా అమ్మ ఇలా ఉందేమిటి? అనుకోరా? వారి ఫ్రెండ్స్ వారిని ఏడిపించరా? డబ్బు సంపాదించగానే సరిపోదు. తన బిడ్డల దృష్టిలో తన ఇమేజ్ గురించి కూడా ఆలోచించాలి కదా. నా కుటుంబసభ్యులు తల వంచుకునేలాగ ఆ స్థాయిలో గ్లామర్ ప్రదర్శించను నేనెప్పుడూ అని కీర్తిసురేష్ చెప్పిన మాటలు అనసూయకు స్ఫూర్తినివ్వాలి.
- ధర్మతేజ, గొడారిగుంట